S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/22/2018 - 02:05

విజయవాడ, జనవరి 21: చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం ఎమ్మెల్యేలకు ఇక కష్టకాలమేనని, పనిచేయకపోతే మీకు ఇబ్బందులు తప్పవని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉండవల్లిలో జరుగుతున్న టీడీపీ ఒకరోజు వర్క్‌షాప్‌లో ఆదివారం ఆయన మాట్లాడుతూ ‘నేనే మీదగ్గరకు వచ్చి నిరాహార దీక్ష చేస్తా.. అప్పుడైనా మీపైన ఒత్తిడి పెరుగుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

01/22/2018 - 02:04

కర్నూలు, జనవరి 21 : పెట్రోల్ ధర ఒక రూపాయి పెరిగినా రోడ్లెక్కి ఆందోళనలు చేసిన జనం ఇప్పుడు ఎంత ధర పెరిగినా వౌనంగానే ఉంటున్నారు. రోజువారీ ధరల మార్పు నిర్ణయంతో ప్రతి రోజూ పెట్రోల్ ధర పెరుగుతూ లీటర్ పెట్రోల్ రూ. 80కి చేరువవుతున్నా ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. గత 50 రోజుల్లో లీటర్ పెట్రోర్ ధర ఏకంగా రూ. 10.43 పెరిగినా నోరు విప్పకుండా భారం మోస్తూనే ఉన్నారు.

01/22/2018 - 02:03

అమరావతి, జనవరి 21: పార్టీకి, తనకు బలం, బలహీనతగా మారిన అభిమానుల విషయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

01/22/2018 - 02:03

విజయవాడ (బెంజిసర్కిల్), జనవరి 21: అత్యవసర పరిస్థితుల్లో ఏసమయంలోనైనా నేనున్నానంటూ కుయ్.. కుయ్.. కుయ్.. అంటూ మరుక్షణమే ప్రత్యక్షమై క్షతగాత్రుల ప్రాణాలకు భరోసానిచ్చిన 108 అంబులెన్స్‌లు నేడు కుయ్యో.. మొర్రో అంటూ దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అక్కరుకు రాని మందులు, వెంటాడుతున్న వాహన మరమ్మతులు, చాలీచాలని సబ్బంది.. వెరశి రాష్ట్రంలో 108 అంబులెన్స్‌ల కూత సన్నగిల్లేలా చేస్తున్నాయి.

01/22/2018 - 02:02

విజయవాడ, జనవరి 21: ఏ రంగంలోనైనా వినియోగదారుల సంతృప్తే పరమావధిగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏ సంస్థకైనా వినియోగదారుడే రారాజు అని స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తితో విద్యుత్ రంగంలో కె రంగనాథం 50 ఏళ్లుగా అందిస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు.

01/21/2018 - 04:20

అమరావతి, జనవరి 20: లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు రానున్నాయా? ఆ మేరకు ఎన్డీఏ భాగస్వామి తెలుగుదేశం పార్టీకి సంకేతాలు వచ్చాయా? ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాజా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే అలాంటి అనుమానాలే తెరపైకి వస్తున్నాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం..

01/21/2018 - 04:19

రాజమహేంద్రవరం, జనవరి 20: తేలికపాటి నల్లరేగడి నేలల్లో సంప్రదాయ పొగాకు స్థానే ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలు విస్తరిస్తున్నాయి. పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా లాభాలను బేరీజు వేసుకుంటూ రైతులు ఇతర వాణిజ్య పంటలను గోదావరి జిల్లాల రైతులు ఆశ్రయిస్తున్నారు.

01/21/2018 - 03:37

విజయవాడ, జనవరి 20: ఈనెల 26న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే గణతంత్ర వేడుకల ఏర్పాట్లను వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తు సీఎస్ సమావేశ మందిరంలో శనివారం మధ్యాహ్నం సమీక్షించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే గణతంత్ర వేడుకల నిర్వహణ బాధ్యతలను కృష్ణాజిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతానికి అప్పగించారు.

01/21/2018 - 03:36

తిరుపతి, జనవరి 20: ప్రధాని నరేంద్రమోదీ అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా భారతదేశం ముందుకు దూసుకుపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. శనివారం పుత్తూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నగరి నియోజక వర్గ బూత్ కమిటీ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పెద్దనోట్ల రద్దు, జీ ఎస్టీ అమలు విప్లవాత్మక సంస్కరణలుగా ఆయన అభివర్ణించారు.

01/21/2018 - 03:35

విశాఖపట్నం (ఆరిలోవ), జనవరి 20: కన్నతల్లి వంటి మాతృభాషను బతికించుకునే బాధ్యత మనందరిపై ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. ప్రఖ్యాత కవి, రచయిత మీగడ రామలింగస్వామికి లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కార ప్రదానోత్సవం విశాఖలో శనివారం ఘనంగా జరిగింది.

Pages