S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/19/2018 - 03:51

శ్రీకాళహస్తి, జనవరి 18: మహిళల ఆశ్వీరచనాలు, గ్రామాల్లో కార్యకర్తలు, అభిమానుల ఘన స్వాగతాలు, చిన్న పిల్లల సెల్ఫీలతో జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర గురువారం ఏర్పేడు మండలంలో ఉత్సాహంగా జరిగింది. ఏర్పేడు మండలం వికృతమాల గ్రామ శివారులో బుధవారం రాత్రి జగన్ బస చేశారు. గురువారం ఉదయం అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించిన జగన్ వికృతమాల దళితవాడకు చేరుకున్నారు.

01/19/2018 - 03:49

ఒంగోలు అర్బన్,జనవరి 18: ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించి ఇంకా గవర్నర్ నరసింహన్‌ను కొనసాగించటం అనైతికమని శాసనమండలి సభ్యులు, తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత కరణం బలరాం ధ్వజమెత్తారు. గురువారం ఒంగోలులో జరిగిన ఎన్‌టిఆర్ వర్ధంతి సభలో గవర్నర్‌పై విమర్శలు చేశారు. యుపిఎ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నరసింహన్‌ను గవర్నర్‌గా నియమించారన్నారు.

01/19/2018 - 03:49

తుని, జనవరి 18: తిరుమల నుండి పూరి వెళ్లే పూరి ఎక్స్‌ప్రెస్ రైలు నుండి పొగలు రావడంతో గురువారం తెల్లవారజామున తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్ 2వ నెంబర్ ఫ్లాట్‌ఫాంపై నిలిపివేశారు. రైల్వే పోలీసులు అందించిన సమాచారం ప్రకారం తిరుపతి నుండి బయలదేరిన రైలు చివరి మూడవ బోగీలో రేణుగుంట వద్ద పొగలు రావడం ప్రారంభమై కొద్దిసేపటికి ఆగిపోయాయి. అయితే మళ్లీ రైలు పిఠాపురం వచ్చే సరికి పొగలు రావడం మొదలయ్యాయి.

01/19/2018 - 03:48

విజయవాడ, జనవరి 18: రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కోల్డ్ చైన్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డెయిరీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా విధానాన్ని రూపొందించాలని, దేవాలయాల్లో గోశాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.

01/19/2018 - 03:48

పొదిలి,జనవరి 18: నలుగురు నకిలీ నక్సలైట్లను పొదిలి పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

01/19/2018 - 03:41

హైదరాబాద్, జనవరి 18: ఓఎన్‌జిసి సంస్థలో పనిచేస్తున్న ఫీల్డ్ ఆపరేటర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, వీరు గత 12 నెలల్లో 240 రోజులు పనిచేశారని హైకోర్టు ఓఎన్‌జిసి యాజమాన్యాన్ని ఆదేశించింది. 2016 డిసెంబర్‌లో సింగిల్ జడ్జి కోర్టు ఫీల్డ్ ఆపరేటర్ల సేవలను క్రమబద్ధీకరించాలని ఆదేశించింది. వీరు ఆంధ్ర, తెలంగాణలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారని కోర్టు పేర్కొంది.

01/19/2018 - 03:19

విజయవాడ, జనవరి 18: రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే రానున్న రోజుల్లో పరిశ్రమలు, సేవల రంగాలు మరింత బలోపేతం కావాల్సి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. జీఎస్‌డీపీలో పరిశ్రమల రంగం వాటా 24 శాతం మాత్రమే ఉందని, సేవల రంగం వాటా కూడా ఆశాజనకంగా లేదని, వీటి వాటా మరింత పెరిగేలా కృషి జరగాలని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులకు ముఖ్యమంత్రి సూచించారు.

01/19/2018 - 03:18

న్యూఢిల్లీ, జనవరి 18: ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రాన్ని కోరారు. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో 2018-19 ప్రీ బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యనమల రామకృష్ణడు హాజరయ్యారు.

01/19/2018 - 03:16

నూజివీడు, జనవరి 18: రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీల్లో విద్యావిధానం ఏమాత్రం బాగోలేదు. ప్రభుత్వం విడుదల చేస్తున్న కోట్లాది రూపాయల నిధులు వృథా.. అధికారుల పనితీరుతో ట్రిపుల్ ఐటీల పరువు పోతోంది సార్..

01/19/2018 - 03:12

అమరావతి, జనవరి 18: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న పరిశ్రమలకు భూకేటాయింపులపై జాప్యం జరిగితే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. కలెక్టర్ల సదస్సులో ఆయన వివిధ రంగాలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అనుమతుల విషయంలో మీ నుంచి ఎలాంటి ఆలస్యం ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. వారానికి రెండు, మూడు గంటలు మీరంతా దానిపైనే సమయం కేటాయించాలని ఆదేశించారు.

Pages