S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/21/2018 - 03:33

విజయవాడ, జనవరి 20: డేటా సెంటర్లు, ఆర్ట్ఫిషల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చెయ్యడమే లక్ష్యంగా క్లౌడ్ హబ్ పాలసీ 2018-2020ని ప్రభుత్వం రూపొందించింది. ఈ పాలసీకి వెలగపూడి సచివాలయంలో శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

01/21/2018 - 03:32

విజయవాడ, జనవరి 20: ఈ ఏడాది హజ్ యాత్రకు ఎంపికైన ప్రతి హజ్ యాత్రికుడు మొదటి విడత రూ.81,000 రూపాయలు జనవరి 31లోపు సెంట్రల్ హజ్ కమిటీకి చెల్లించాలి. చలానా ఫారాన్ని హజ్ కమిటీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని బ్యాంకులో జమ చేయాలని హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహ్మద్ లియాఖత్ అలీ తెలిపారు.

01/21/2018 - 03:31

కడప, జనవరి 20: కడప జిల్లాలోని చారిత్రక గండికోట ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే గండికోట ఉత్సవాలపై అనాసక్తిగా జిల్లా యంత్రాంగం చివరి రెండురోజుల్లో హడావుడిగా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ గండికోట ఉత్సవాలపై అటు పర్యాటకశాఖకు గానీ, ఇటు జిల్లా ఉన్నతాధికారులకు గానీ ఒక ప్రణాళిక లేదని ఈ ఉత్సవాల నిర్వహణ తీరే చెబుతోంది.

01/21/2018 - 03:29

మాచర్ల రూరల్, జనవరి 20: ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించటంతో ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగి అక్కడా తిరస్కారం ఎదురుకావటంతో విధిలేక ప్రభుత్వాసుపత్రికే వచ్చి.. ఆసుపత్రి ఆవరణలోనే ప్రసవించగా, వైద్యం అందక శిశువు మృతిచెందిన గిరిజన మహిళ విషాద ఉదంతమిది. తన శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితురాలు కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది.

01/21/2018 - 04:21

అమరావతి, జనవరి 20: ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి దావోస్ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం అందిందని ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ చెప్పారు. ఈసారి 25 ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలు, 5 ముఖ్యమైన సమావేశాలు, సీఈవో రౌండ్ టేబుల్ మీటింగ్స్, గ్లోబల్ సీఈవోలతో ముఖాముఖి చర్చలు, ప్రధాన వక్తగా కొన్ని సెషన్స్‌లో ప్రసంగాలు చేస్తారని, 3 ఎంవోయూలు జరుగుతాయని వెల్లడించారు.

01/21/2018 - 03:16

విజయవాడ (బెంజిసర్కిల్), జనవరి 20: అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, తెదేపా నేతల కన్ను పడిందని, అందుకే అగ్రిగోల్డ్ అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నప్పటికీ డిపాజిటర్లకు న్యాయం చేయడంలో మీన మేషాలు లెక్కిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యన్నారాయణ ఆరోపించారు.

01/21/2018 - 03:15

విశాఖపట్నం, జనవరి 20: రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు అనుకూల వాతావరణం ఉందని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో వైఎస్ ప్రసాద్ అన్నారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘్ఫడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌లో అవకాశాలు’ అంశంపై విశాఖలో శనివారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌లో పెట్టుబడులు పెట్టేవారికి అపార అవకాశాలున్నాయన్నారు.

01/21/2018 - 03:13

బికొత్తకోట, జనవరి 20: ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్ ఘాట్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం ఓ కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగి క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ అందులోని వారిని కిందిక దించివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కడప జిల్లాకు చెందిన బంగారు వ్యాపారి మహ్మద్ గౌస్ కారులో 10 మంది కుటుంబ సభ్యులతో కలసి హార్స్‌లీ హిల్స్‌కు బయలు దేరాడు.

01/21/2018 - 03:10

మడకశిర, జనవరి 20: విభజన హక్కుల సాధన కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం కేవలం ఎన్నికల స్టంటేనని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి మండిపడ్డారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీలో విరోధం ఏర్పడిన దరిమిలా ఆలస్యంగా మేల్కొన్న ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

01/21/2018 - 03:18

ఆలమూరు/రావులపాలెం, జనవరి 20: తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండల జొన్నాడకు చెందిన ఇద్దరు యువకులు గోదావరి నదిలో స్నానాలకు దిగి గల్లంతైనట్టు ఆలమూరు ఎస్సై పి దొరరాజు తెలిపారు.

Pages