S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/19/2018 - 02:53

గుంటూరు, జనవరి 18: తెలుగుజాతిపై దివంగత నేత ఎన్టీ రామారావు చెరగని ముద్రవేశారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు, మంత్రులు నివాళులర్పించారు. గుంటూరులోని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గురువారం ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

01/19/2018 - 02:48

విజయవాడ, జనవరి 18: రెండు రోజుల పాటు జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సులో కొంతమంది అధికారుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలకు అధికారులు కంగు తిన్నారు. అయితే గ్రామీణాభివృద్ధి శాఖను మాత్రం సీఎం మెచ్చుకోవడం విశేషం.

01/18/2018 - 04:00

విజయవాడ, జనవరి 17: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)కు సంబంధించిన సాంకేతిక అంశాలపై అధికారుల స్థాయిలో చర్చించాకే త్రైపాక్షిక సమావేశం నిర్వహిద్దామని తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి హరీష్‌రావుకు ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. ఈమేరకు బుధవారం ఆయన హరీష్‌రావుకు లేఖ రాశారు.

01/18/2018 - 04:00

శ్రీశైలం, జనవరి 17: శ్రీశైలంలో జరుగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. యాగశాలలో బుధవారం ఉదయం అర్చకులు శాస్త్రోక్తంగా హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. నందీశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. త్రిశూల స్నానం అనంతరం ధ్వజావరోహణ గావించారు. గురువారం స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం, అశ్వవాహన సేవ నిర్వహిస్తారు.

01/18/2018 - 03:59

తిరుపతి, జనవరి 17: ఎన్నికల సమయంలో బోయలను ఎస్టీల్లోనూ, రజకులను ఎస్సీల్లోనూ చేరుస్తానని ఘంటాపథంగా చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మోసం చేశాడని, ఇదేనా వెనుకబడిన తరగతులపై ఆయనకున్న ప్రేమ అని వైకాపా అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్ చేపట్టిన మహాసంకల్ప పాదయాత్ర 64వ రోజు బుధవారం శ్రీకాళహస్తి, పుత్తూరులో కొనసాగించారు.

01/18/2018 - 03:57

రాజమహేంద్రవరం, జనవరి 17: పోలవరం ప్రాజెక్టులో ప్రధాన అడ్డంకులు తొలగిపోవడంతో ప్రస్తుతం పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీపై దృష్టి సారించారు. ఈ నేపధ్యంలో డిస్ట్రిబ్యూటరీలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ చేపట్టారు. ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో నిర్ధేశిత పనులన్నీ ఈ ఏడాది పూర్తయ్యే విధంగా కార్యాచరణ తీసుకున్నారు. ఈ క్రమంలో పునరావాస, పునర్నిర్మాణ ప్రక్రియ ఊపందుకుంది.

01/18/2018 - 03:57

కాకినాడ, జనవరి 17: కోడి పందేలపై పాలకుల ద్వంద్వవైఖరికి సామాన్యులు బలవుతున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందాలకు సై అన్న సగటు మనిషి ఆనక పోలీసులు అనుసరిస్తున్న వైఖరితో సరదా తీరిపోతోంది. సంక్రాంతికి పది పదిహేను రోజుల ముందుగానే కోడి పందేలపై రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నుండి అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు కోడి పందేలకు అనుకూలంగా వ్యవహరించారు.

01/18/2018 - 03:56

నంద్యాల, జనవరి 17: గుంటూరు - గుంతకల్లు మధ్య 2020 నాటికి డబ్లింగ్ పనులు పూర్తిచేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయన్నారు. అటు గుంటూరు, ఇటు గుంతకల్లు రెండు వైపుల నుంచి ఒకేసారి డబ్లింగ్ పనులు జరుగుతాయని ఆయన తెలిపారు.

01/18/2018 - 03:14

విజయవాడ, జనవరి 17: ఎపీ స్టేట్ హజ్ కమిటీ విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం 2018 హజ్ యాత్రికుల ఎంపికకు డ్రా నిర్వహించింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ మహ్మద్ అహ్మద్ షరీఫ్, స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ మోమిన్ అహ్మద్ హుస్సేన్, హజ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

01/18/2018 - 03:13

అమరావతి, జనవరి 17: రానున్న కాలంలో రాజధాని అమరావతిలో టై అమరావతి - ఏంజెల్స్ నెట్‌వర్క్ సంయుక్తంగా ప్రముఖ పాత్ర పోషించనున్నాయని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ‘మైక్రోసాఫ్ట్ వంటి అతిపెద్ద కంపెనీని నడిపిస్తున్నది కూడా మన తెలుగువాడే. మన దేశ ప్రజలను మెప్పించగలిగే ఒక ప్రాజెక్టు తయారుచేస్తే ప్రపంచాన్ని జయించవచ్చు.

Pages