S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/07/2017 - 01:12

విశాఖపట్నం, డిసెంబర్ 6: రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ తొలిసారిగా విశాఖ రానున్నారు. గురువారం నుంచి రెండు రోజుల పాటు రాష్టప్రతి నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశాఖ ఆర్కే బీచ్‌లో విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా) ఏర్పాటు చేసిన టీయూ-142 విమాన మ్యూజియంను ప్రారంభిస్తారు. అనంతరం ఆంధ్రా యూనివర్శిటీలో ఈ-క్లాస్‌రూం కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేస్తారు.

12/07/2017 - 00:42

ఒంగోలు, డిసెంబర్ 6 : రాష్ట్రంలో కాపుల రిజర్వేషన్ల వలన వెనుకబడిన వర్గాల వారికి ఎలాంటి నష్టం వాటిల్లదని కాపు కార్పొరేషన్ చైర్మన్ సిహెచ్ రామానుజయ అభిప్రాయపడ్డారు. బుధవారం ఒంగోలులోని ఎన్‌ఎస్‌పి అతిధి గృహంలో విలేఖర్లతో మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుండి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బిసిలు, కాపులు ఇద్దరూ సోదరులవలె మెలుగుతున్నారని తెలిపారు.

12/07/2017 - 00:41

రాజమహేంద్రవరం, డిసెంబర్ 6: అఖండ గోదావరి ఎడమ గట్టుపై ఇసుక దందా కొనసాగుతోంది..పోలవరం నిర్మాణ పనుల మాటున ఇసుక అక్రమ రవాణా యధేచ్ఛగా జరిగిపోతోందని తెలుస్తోంది..సీతానగరం మండలం కాటవరం ఇసుక ర్యాంపు నుంచి ప్రభుత్వ పనులకు ఇసుక ఉచితంగా తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ అనుమతిని అడ్డు పెట్టుకుని ఇసుక అక్రమ రవాణా జరిగిపోతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

12/07/2017 - 00:41

మడకశిర, డిసెంబర్ 6: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న విదేశీ పర్యటనల వల్ల ప్రజాధనం వృథా కావడం తప్ప దేశం, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు ఉండవని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు.

12/07/2017 - 00:40

విశాఖపట్నం, డిసెంబర్ 6: రాష్ట్రంలో టీడీపీతో పొత్తు కొనసాగుతున్నంత కాలం మిత్రపక్షంగా తాము విమర్శలకు దిగబోమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు స్పష్టం చేశారు. విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో టీడీపీ నాయకులు బీజేపీ తీరుపై చేస్తున్న విమర్శలపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సంయమనంతో సమాధానం చెప్పారు.

12/07/2017 - 00:40

అనంతపురం, డిసెంబర్ 6: రాష్ట్ర ప్రజలు, రైతుల కష్టాలు పట్టించుకోకుండా, తన స్వలాభం, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తూ, రైతుల కష్టాన్ని దోచుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ దళారీ అని వైకాపా అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సంకల్పయాత్ర 28వరోజు బుధవారం అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెలలో జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ ‘చంద్రబాబుకు హెరిటేజ్ అనే సంస్థ ఉంది.

12/07/2017 - 00:39

విజయవాడ (పటమట), డిసెంబర్ 6: విజయవాడ నగరంలో పట్టపగలే నడిరోడ్డుపై రౌడీషీటర్ కాళిదాసు సుబ్రహ్మణ్యం(35)ను దుండగులు పాశవికంగా హత్య చేశారు. ఈ సంఘటన బుధవారం ఉదయం నగరంలోని మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబ్రహ్మణ్యం నగరంలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో టీవీ కొనటానికి వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి మాచవరం రమ్మని పిలిచారు.

12/07/2017 - 00:38

విశాఖపట్నం, డిసెంబర్ 6: దేశంలో రాజకీయ వ్యవస్థ కుళ్లిపోయిందని, రాజకీయ నాయకుల దోపిడీతో వ్యవస్థ భ్రష్టుపట్టిందని, ఈ పరిస్థితిని మార్చి, రాజకీయాలకు కొత్త రక్తం ఎక్కించేందుకే తాను జనసేన పార్టీని స్థాపించానని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అవినీతి రాజకీయాలతో దేశాన్ని బీడుగా మార్చేశారని, దాన్ని తిరిగి సస్యశ్యామలం చేసేందుకు తను రంగంలో దిగానని పవన్ కళ్యాణ్ అన్నారు.

12/07/2017 - 00:27

2018 షెడ్యూల్ విడుదల 12,370 టీచర్ పోస్టుల భర్తీ 15న నోటిఫికేషన్
26 నుంచి దరఖాస్తుల స్వీకరణ మార్చి 23 నుంచి పరీక్షలు

12/06/2017 - 03:17

విజయవాడ, డిసెంబర్ 5: గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ తొలిదశ పనులు ప్రారంభానికి వీలుగా త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో భూగర్భ డ్రైనేజీ అమలుపై సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలిదశలో 157 గ్రామాల్లో ఏర్పాటు చేయనున్నామన్నారు.

Pages