S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/06/2017 - 03:09

విజయవాడ, డిసెంబర్ 5: రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం మాత్రమే కొనసాగించేలా గతంలో హడావుడిగా 14వ నెంబరు జీవో జారీ చేసిన ప్రభుత్వం తన తప్పిదాన్ని సరిదిద్దుకుంటూ తెలుగు మీడియం సెక్షన్లు కొనసాగించేలా మున్సిపల్ శాఖ కార్యదర్శి ఆర్ కరికర వాలన్ మంగళవారం జీవో 421ను జారీ చేశారు.

12/06/2017 - 03:08

విజయవాడ, డిసెంబర్ 5: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భారతావనిని తెలుసుకోండి అన్న కార్యక్రమం కింద 9 దేశాల నుంచి భారత మూలాలు కలిగిన ఉన్న 40 మంది యువతీ, యువకులు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి లోకేష్‌ను వెలగపూడి సచివాలయంలో మంగళవారం కలిశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని విజయవాడ, రాజమండ్రి, విశాఖల్లో వీరు పర్యటించనున్నారు.

12/06/2017 - 02:57

విజయవాడ, డిసెంబర్ 5: నవ్యాంధ్రలో పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా ప్రారంభమైన ముఖ్యమంత్రి చంద్రబాబు కొరియా పర్యటన మంగళవారం రెండో రోజుకు చేరింది. దక్షిణ కొరియాలో ఉదయం ఏడున్నరకు (్భరత కాలమానం ప్రకా రం తెల్లవారుజామున నాలుగు గంటలకు) ముఖ్యమంత్రి కార్యక్రమాలు ఆరంభమయ్యాయి.

12/06/2017 - 02:57

విజయవాడ, డిసెంబర్ 5: విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు కనె్నర జేశారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విజయవాడలో చేపట్టిన ‘కరెంటోళ్ల సమరభేరి’ దద్దరిల్లింది. ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్య వేదిక ఆధ్వర్యాన తలపెట్టిన ఆందోళనకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌లలో పని చేస్తున్న వేలాది మంది కార్మిక లోకం తరలివచ్చింది.

12/06/2017 - 02:54

విశాఖపట్నం, డిసెంబర్ 5: గిరిజన మహిళలకు ఉపాధి కల్పించడం ద్వారా వారిని, సమాజ వ్యతిరేక శక్తుల ప్రలోభాలకు లోనుకాకుండా పోలీసులు సరికొత్త పంథాను అనుసరిస్తున్నారు. కేవలం ఉపాధి లేమి కారణంగానే గిరిజనులు ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారని భావించిన యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది.

12/06/2017 - 02:50

విశాఖపట్నం, డిసెంబర్ 5: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ మేరకు ఇక్కడి వాతావరణ కేంద్రం మంగళవారం రాత్రి పేర్కొంది. రానున్న 12 గంటల్లో ఇది వాయిగుండంగా మారే అవకాశం ఉందని, మరో 48 గంటల్లో తీవ్ర వాయిగుండంగా మారి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాల మీదుగా దీనిని ప్రభావం చూపనుంది. భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

12/06/2017 - 02:49

చోడవరం, డిసెంబర్ 5: విశాఖపట్నం జిల్లాలో పరీక్షలు సక్రమంగా రాయలేదనే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. చోడవరం మండలంలోని గాంధీగ్రామ పంచాయతీ, లక్ష్మీనగర్‌కు చెందిన రిట్టా హరిత (19) ఇక్కడి ఒక ప్రైవేట్ కళాశాలలో బీఎస్‌సీ డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది.

12/06/2017 - 02:48

పాచిపెంట, డిసెంబర్ 5: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పాలన అవినీతిమయమని వైసీపీ విజయనగరం, విశాఖ జిల్లాల పరిశీలకుడు భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. విజయనగరం జిల్లా, పాచిపెంట మండలంలోని పాంచాలి గ్రామంలో మంగళవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం హత్యారాజకీయాలకు ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.

12/05/2017 - 04:49

కాకినాడ సిటీ, డిసెంబర్ 4: మావోయిస్టు దంపతులతో పాటు కొరియర్ తూర్పు గోదావరి జిల్లా పోలీసుల ఎదుట సోమవారం లొంగిపోయారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కార్యకలాపాలను నిర్వహించే మావోయిస్టు దళంలో పనిచేసిన సుకుమా జిల్లా గాసంపాడు గ్రామానికి చెందిన మడివి జోగయ్య అలియాస్ రోషన్(28), ఎటపాక మండలం జగ్గారం గ్రామానికి చెందిన కలుమా పొజ్జి అనే రాధ(24) ప్రేమించుకుని 2014వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.

12/05/2017 - 04:48

నరసరావుపేట/జె పంగులూరు, డిసెంబర్ 4: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం పాలైన విషాదం ఇది. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో సోమవారం రైలు కింద పడి ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన విజయలక్ష్మి (33)కి ప్రకాశం జిల్లా జె.

Pages