S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/06/2017 - 03:15

విజయవాడ, డిసెంబర్ 5: రైతులకు మేలు చేకూర్చటమే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు అనుమతితోనే సరిపెట్టకుండా, వాటి నిర్వహణా తీరు, నిబంధనల ప్రకారం ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలు అమలవుతున్నాయా.. లేదా అని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆయన ఆదేశించారు.

12/06/2017 - 03:20

విజయవాడ, డిసెంబర్ 5: పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు బలవర్థక బియ్యం (్ఫర్టిఫైడ్ రైస్) సరఫరా చేసేందుకు నిర్ణయించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో టాటా ట్రస్టు ప్రతినిధులతో మంత్రులు సోమిరెడ్డి, నారా లోకేష్ మంగళవారం సమావేశమై ఫోర్టిఫైడ్ రైస్‌పై చర్చించారు. పౌష్టికాహార లోపం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని తెలిపారు.

12/06/2017 - 03:13

విజయవాడ, డిసెంబర్ 5: కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్)లో ఎదురవుతున్న ఆర్థికపరమైన లోటుపాట్లపై ఎపిసీపీఎస్ ఎంప్లారుూస్ అసోసియేషన్ నేతలు మంగళవారం ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లుతో కల్సి రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్రతో సమావేశమై ప్రధానంగా ఏడు అంశాలపై చర్చించారు.

12/06/2017 - 03:13

విజయవాడ, డిసెంబర్ 5: కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయమై ముందుగానీ, నిర్ణయం వెల్లడించిన తరువాత గానీ వెనుకబడిన వర్గాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ఉంటే ఇంత గందరగోళం ఉండేది కాదని బీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. తాను కూడా వారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

12/06/2017 - 03:12

విజయవాడ, డిసెంబర్ 5: పోలవరం ప్రాజెక్టుపై పలురకాల వివాదాలు చోటు చేసుకున్న ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితులను గురించి తెలుసుకునేందుకు సీపీఐ ప్రతినిధి బృందం ఈ నెల 11వ తేదీన పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనుంది.

12/06/2017 - 03:11

పటమట, డిసెంబర్ 5: గిరిజన ప్రాంతాలలో వౌలిక వసతులు, రవాణా మెరుగుపర్చటం, వసతిగృహాలలో హాజరుశాతం పెంచటంతోపాటు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు తప్పక నిర్వహించాలని, దీనివలన ప్రభుత్వం ఆశించిన గిరిజన సంక్షేమ పథకాలు వంద శాతం వారికే చెందే అవకాశం వుంటుందని, అందుకు ఆధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా అధికారులను అదేశించారు.

12/06/2017 - 03:11

విజయవాడ, డిసెంబర్ 5: సచివాలయంలో మంగళవారం పాము కలకలం సృష్టించింది. రెండో బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులు గదులను శుభ్రం చేస్తుండగా, పామును గమనించారు. దీంతో ఒక్కసారిగా ఆందోళన గురయ్యారు. అయితే పామును పారిశుద్ధ్య సిబ్బంది చంపేశారు.

12/06/2017 - 03:10

విజయవాడ, డిసెంబర్ 5: ఎపీఎస్ ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన 2015 లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌ను గుర్తింపు సంఘం ఎస్‌ఎంయు విజ్ఞప్తి మేరకు ఈ నెల 20వ తేదీన నగదు రూపంలో చెల్లించేందుకు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మాలకొండయ్య మంగళవారం 7/2017తో సర్క్యులర్ విడుదల చేశారు. ఈ ఆదేశాలు ద్వారా సంస్థలో పని చేస్తున్న 55వేల మందికి లబ్ధిచేకూరనున్నది.

12/06/2017 - 03:10

విజయవాడ, డిసెంబర్ 5: 2018 హజ్ యాత్రకు నామమాత్రపు స్పందన లభిస్తోంది. 2017 హజ్ యాత్రకోసం 3 వేల 800 మందికి అవకాశం ఉంటే మంగళవారం సాయంవ్రరకు కేవలం 690 మంది మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీతో దరఖాస్తు గడవు ముగియనున్నదని ఈ ఏడాది ఎలాంటి పరిస్థితుల్లోనూ పొడిగింపు ఉండబోదని ఏపీ హజ్ కమిటీ ఇవో మహ్మద్ లియాఖల్ ఆలీ తెలిపారు.

12/06/2017 - 03:09

విజయవాడ, డిసెంబర్ 5: బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ నివేదిక అందకుండానే సభ్యుల నివేదికలతో కాపులను బీసీ జాబితాలో చేర్చుతూ ప్రభుత్వం హడావుడిగా ఉభయ సభల్లో బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన రాష్ట్ర బంద్ పాటించాలని బీసీ సంఘాలు నిర్ణయించాయి.

Pages