S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/05/2017 - 04:47

విశాఖపట్నం, డిసెంబర్ 4: దక్షిణ అండమాన్‌ను అనుకుని బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం అధికారులు తెలియచేశారు. ఇది 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తావైపు రానుందని చెప్పారు. దీని ప్రభావం వలన ఈనెల 6,7,8 తేదీల్లో దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్నాయి.

12/05/2017 - 04:46

నందికొట్కూరు, డిసెంబర్ 4: వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చేస్తున్నది పాదయాత్ర కాదని, అది పాడుయాత్ర అని ఉప ముఖ్యమంత్రి కెయి.కృష్ణమూర్తి అన్నారు. జగన్‌కు ప్రజలే బాయ్‌కాట్ చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు.

12/05/2017 - 04:46

దేవనకొండ, డిసెంబర్ 4: ఈపాసు పుస్తకం ఇచ్చేందుకు ఓ రైతు నుంచి లంచం తీసుకున్న వీఆర్‌ఓను ఏసీబీ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పాలకుర్తికి చెందిన రైతు శివశంకర్‌రెడ్డి తన పొలానికి సంబంధించిన ఈపాసు పుస్తకం కోసం వీఆర్‌ఓ ఈశ్వర్‌రెడ్డిని సంప్రదించగా ఆయన తొలుత రూ.8 వేలు లంచం అడిగాడు. దీంతో రైతు ఆ సొమ్ము ఇచ్చాడు.

12/05/2017 - 04:45

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 4: నకిలీ మందులతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమార్కుల మూలాలను ఛేదించడంలో విజయవాడ నగర పోలీసులు, డ్రగ్ కంట్రోల్ శాఖాధికారులు సఫలీకృతులైనారు. ఇరు శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఉత్తరాఖండ్‌కు చెందిన పలువురితోపాటు రాష్ట్రంలోని వివిధ మందుల దుకాణదారులను అదుపులోకి తీసుకుని, మందుల తయారీకి చెందిన వివిధ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

12/05/2017 - 04:41

విశాఖపట్నం, డిసెంబర్ 4: పాకిస్తాన్‌పై చిరస్మరణీయ విజయాన్ని పురస్కరించుకుని ప్రతియేటా డిసెంబర్ 4వతేదీన నిర్వహించే నౌకాదళ దినోత్సవం(నేవీ డే) విశాఖ ఆర్కేబీచ్‌లో సోమవారం సాయంత్రం వేడుకగా జరిగింది. తూర్పునౌకాదళం(ఇఎన్‌సీ) ప్రధానాధికారి కరమ్‌బీర్ సింగ్ ముఖ్య అతిధి రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావును సాదరంగా ఆహ్వానించారు.

12/05/2017 - 04:40

అనంతపురం, డిసెంబర్ 4: రిజర్వేషన్ల పేర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుల రాజీకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఏ ఒక్క కులాన్నీ వదిలిపెట్టలేదన్నారు. ప్రజా సంకల్పయాత్ర 26వ రోజు సోమవారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా గుత్తిలో జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు.

12/05/2017 - 04:38

అమరావతి, డిసెంబర్ 4: దక్షిణకొరియాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందం పర్యటన ఆరంభమైంది. తొలిరోజు సోమవారం ముఖ్యమంత్రి ముందుగా కియా అనుబంధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ సంస్థకు కేటాయించిన ప్రాంతంలో వౌలిక సదుపాయాల అభివృద్ధి దృశ్యాలను ఆంధ్రప్రదేశ్ బృందం ప్రదర్శించింది.

12/05/2017 - 04:37

విజయవాడ (పటమట) డిసెంబర్ 4: తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి 19 వరకు ఐదు రోజులపాటు హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు తెలుగు భాషా ప్రేమికులందరూ పాలుపంచుకోవాలని తెలంగాణ గ్రంధాలయ సంస్ధ ఛైర్మన్ ఆయాచితం శ్రీ్ధర్ పిలుపు నిచ్చారు. సోమవారం సాయంత్రం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు.

12/05/2017 - 04:37

విశాఖపట్నం, డిసెంబర్ 4: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ) ప్రైవేటీకరణపై మనస్తాపానికి గురై, అందులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంస్థలో పనిచేస్తున్న ఎన్.వెంకటేష్ విజయనగరం జిల్లా నెల్లిమర్ల రైల్వే స్టేషన్‌వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. డీసీఐలో 2012లో హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా వెంకటేష్ విధుల్లో చేరాడు.

12/05/2017 - 04:35

విజయవాడ, డిసెంబర్ 4: మరో ఏడాది కాలంలో సాధారణ ఎన్నికలు జరుగబోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. ఆంధ్రలో తెలుగుదేశం పార్టీతో తరిగి పొత్తు కొనసాగుతుందా? లేదా? అన్నది పోలవరం ప్రాజెక్టు..కాపు రిజర్వేషన్‌లపై ఆధారపడి ఉంది.

Pages