S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/08/2017 - 03:22

విశాఖపట్నం, డిసెంబర్ 7: లాభాలార్జిస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేందుకు గట్టిగా కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డీసీఐ ఆఫీసర్స్ అసోసియేషన్, నాన్ ఎగ్జిక్యుటివ్ ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు గురువారం విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబును కలిసి చర్చించారు.

12/08/2017 - 00:47

విజయవాడ, డిసెంబర్ 7: దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా పరిశ్రమలశాఖ మంత్రి ఎన్.అమరనాధరెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఆర్.ప్రీతమ్‌రెడ్డి గురువారం సియోల్‌లో హ్యుండాయ్ మోటార్స్ గ్రూపు ఎలక్ట్రిక్ వెహికల్, ఫ్యూచర్ వెహికల్ వైస్ ప్రెసిడెంట్ జంగ్‌తో భేటీ అయ్యారు.

12/08/2017 - 00:46

విజయవాడ, డిసెంబర్ 7: రాష్ట్రంలోని 163 మోడల్ పాఠశాలలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని వారికి 0/0 పద్దు కింద జీతాల చెల్లింపునకు సంబంధించిన ఫైల్‌ను సిద్ధం చేసి త్వరలో ప్రభుత్వ ఆమోదానికి పంపేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి హామీ ఇచ్చారని మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శివశంకరరెడ్డి, జి.చంద్రశేఖర్ తెలిపారు.

12/08/2017 - 00:46

విజయవాడ, డిసెంబర్ 7: భారతదేశంలో నరేంద్రమోదీ నాయకత్వంలో మైనార్టీ వర్గాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని భారతీయ జనతా మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ అన్సారీ అన్నారు.

12/08/2017 - 00:45

విజయవాడ, డిసెంబర్ 7: దేశ భద్రతకు అహర్నిశలు శ్రమించి ప్రాణ త్యాగం చేసిన వీర సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకై సైనిక సంక్షేమానికి ప్రజలు, దాతలు విరాళాలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 7వ తేదీ సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని వెలగపూడి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో గురువారం సైనిక సంక్షేమానికి ఆయన తొలి విరాళాన్ని అందించారు.

12/08/2017 - 00:45

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 7: ప్రపంచ దేశాలు, ఇతర రాష్ట్రాలు అసూయ పడేలా రాష్ట్భ్రావృద్ధికి నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి 2019 ఎన్నికల్లోకూడా తిరిగి పట్టం కట్టాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.

12/08/2017 - 00:44

విజయవాడ, డిసెంబర్ 7: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం పరిధిలోని లక్షా 80వేల మంది ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి తక్షణం చర్యలు చేపట్టాలని కోరుతూ ఏపీ జెఏసీ అమరావతి చైర్మన్, రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నాయకత్వంలో ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులు గురువారం సచివాలయంలో ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ను కల్సి వినతిపత్రం స

12/08/2017 - 00:43

విజయవాడ, డిసెంబర్ 7: రాష్ట్రంలో వీలైనంత త్వరలో మత్స్య విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటుచేసేలా చర్యలు ప్రారంభించినట్లు మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. చైనా అకాడమీ సాంకేతిక సహకారంతో ఆనంద్ గ్రూప్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే.

12/08/2017 - 00:43

విజయవాడ, డిసెంబర్ 7: తొలి అర్ధ సంవత్సరంలో 11.37 శాతం వృద్ధి రేటును సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దేశంలో అన్ని రంగాల్లోనూ ఏపీ నెంబర్ 1గా నిలిచిందన్నారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోందని తెలిపారు.

12/07/2017 - 01:25

విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రంలో మహిళలకు ఆత్మరక్షణపై శిక్షణకు అకాడమీ ఏర్పాటు చేసే యోచన ఉందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన ఆ శాఖ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆపద సందర్భాల్లో తమను తాము రక్షించుకునేందుకు వీలుగా శిక్షణ ఉంటుందన్నారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.

Pages