S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/07/2017 - 01:23

విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రంలో వాల్మీకి, బోయల స్థితిగతులను అర్థం చేసుకుని వారిని ఎస్టీల జాబితాలో చేర్చాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బోయల దేవుడని వాల్మీకి, బోయ ఫెడరేషన్ చైర్మన్ బీటీ నాయుడు అన్నారు.

12/07/2017 - 01:22

విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రంలో నిరంతరాయంగా అందరికీ విద్యుత్ ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంక్ నుంచి వివిధ విద్యుత్ సంస్థలు 240 మిలియన్ డాలర్ల మేర రుణాన్ని తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందరికీ విద్యుత్ కింద ప్రపంచ బ్యాంక్ 240 మిలియన్ డాలర్లను, మరో 160 మిలియన్ డాలర్లను ఎఐఐబి అందచేసేందుకు వీలుగా కేంద్రం ఒప్పందం చేసుకుంది.

12/07/2017 - 01:21

అమరావతి, డిసెంబర్ 6: తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం గుర్తుందా? జల్లికట్టు క్రీడను కోర్టు నిషేధించిన సమయంలో దానిని వ్యతిరేకిస్తూ ప్రజలు ఎవరికి వారు మెరినాబీచ్ వద్దకు లక్షలాదిమంది హాజరయి దేశాన్ని విభ్రమపరిచారు. నాయకుడు లేని ఆ ఉద్యమానికి కేంద్రమే తలవంచింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు వ్యవహారం కూడా అదే దారి పట్టనుందా? అవును..

12/07/2017 - 01:21

గుంటూరు, డిసెంబర్ 6: రాష్ట్రంలో స్మార్ట్ నగరాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతోంది. రెండు దశల్లో 9 నగరాలకు రెండు దశల్లో కాంప్రెహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ)ని సిద్ధంచేసే బాధ్యతను గుర్‌గావ్‌కు చెందిన మెస్సర్స్ యూఎంటీసీ సంస్థకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్, పురపాలకశాఖలతో సంస్థ ఒప్పందం కుదుర్చుకో నుంది.

12/07/2017 - 01:16

భీమవరం, డిసెంబర్ 6: త్వరలోనే అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ప్రారంభిస్తామని విశ్వహిందూ పరిషత్ ఆఖిల భారత కార్యదర్శి కె.కోటేశ్వరశర్మ ప్రకటించారు. అయోధ్య కరసేవకులు మందిరం నిర్మాణం కోసం తీసుకువెళ్ళిన రామశిలలతోనే భవ్య మందిర నిర్మాణం జరుగుతోందన్నారు.

12/07/2017 - 01:15

హైదరాబాద్, డిసెంబర్ 6: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించేందుకు వైఎస్‌ఆర్‌సిపి ప్రజా ప్రతినిధుల బృందం ఈ నెల 7వ తేదీన బయలుదేరుతుందని ఆ పార్టీ ఎంపి వైవి సుబ్బారెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలు, కేంద్రప్రభుత్వ సాగదీత ధోరణి తదితర అంశాలపై క్షేత్రస్థాయి పోరాటానికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కార్యాచరణ రూపొందిస్తున్నారని అన్నారు.

12/07/2017 - 01:14

విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రంలోని పురపాలక, నగరపాలక సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తూ మున్సిపల్ డైరెక్టర్ కె కన్నబాబు ఆర్‌సీ నెం 3276ను బుధవారం విడుదల చేశారు. మున్సిపల్ టీచర్ల పదోన్నతులకు గత నెలలోనే పురపాలక శాఖ ఉత్తర్వులిచ్చినప్పటికీ సర్వీస్ రూల్స్, పదోన్నతుల సీనియార్టీ జాబితాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆ షెడ్యూల్‌ను వాయిదా వేసారు.

12/07/2017 - 01:14

విజయవాడ, డిసెంబర్ 6: బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగ ఫలాలు దిగువ స్థాయి వారికి చేరాలంటే సచివాలయ ఉద్యోగుల బాధ్యతలే కీలకమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. వెలగపూడి సచివాలయం 3వ బ్లాక్ మొదటి అంతస్తు సమావేశ మందిరంలో బుధవారం మధ్యాహ్నం సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 62వ అంబేద్కర్ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు.

12/07/2017 - 01:13

ఉదయగిరి, డిసెంబర్ 6: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మాదాల జానకిరామ్ (67) బుధవారంనాడు నెల్లూరులోని బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రెండురోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో బంధువులు ఆయనను వైద్యశాలలో చేర్పించారు. ఈక్రమంలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో బుధవారం మృతి చెందారు.

12/07/2017 - 01:12

విశాఖపట్నం, డిసెంబర్ 6: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం సాయంత్రానికి మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 1020 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. ఇది ఉత్తవ వాయువ్య దిశగా కదులుతూ రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల వైపు కదులుతోందన్నారు.

Pages