S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/04/2017 - 02:58

గుంటూరు, డిసెంబర్ 3: కాపులకు 5 శాతం బీసీ రిజర్వేషన్ వర్తింపచేస్తూ శాసనసభ, మండలిలో చేసిన తీర్మానాలు చెల్లవని ఏబీ బీసీ సంక్షేమ సంఘం నేతలు అన్నారు. ఇందుకు నిర్దేశించిన జస్టిస్ మంజునాథ కమిషన్ చైర్మన్ అధికారికంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉండగా అలాంటివేమీ లేకుండా ఒకరిద్దరు ప్రతినిధులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎలా తీర్మానం చేస్తారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ప్రశ్నించారు.

12/04/2017 - 02:57

విజయవాడ, డిసెంబర్ 3: రాష్ట్ర విద్యాశాఖలో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న వివిధ కేడర్ల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ఆదివారం నాడిక్కడ గాంధీ మున్సిపల్ హైస్కూల్‌లో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ‘జాక్టో’ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

12/04/2017 - 02:57

విజయవాడ, డిసెంబర్ 3: రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి బీసీ(ఎఫ్) కింద 5 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు, అది అమలుకానున్నట్లు చంద్రబాబు భ్రమలు కల్పించడం, ఆ కులాలకు చెందిన కొందరు చెక్క్భజన చేయడం హాస్యాస్పదంగా ఉందని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. ఇది అరచేతిలో వైకుంఠం చూపించడం మినహా మరేమీ కాదన్నారు.

12/03/2017 - 04:55

విశాఖపట్నం, డిసెంబర్ 2: దక్షిణ కోస్తాకు వాయుగుండం పొంచి ఉంది. రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ శనివారం పేర్కొంది. ప్రస్తుతం దక్షిణ అండమాన్‌లో ఉన్న తీవ్ర అల్పపీడనం మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఇది క్రమంగా దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు వైపు కదులుతోందని పేర్కొన్నారు.

12/03/2017 - 04:54

విజయవాడ, డిసెంబర్ 2: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

12/03/2017 - 04:54

విజయవాడ, డిసెంబర్ 2: అవకాశవాద రాజకీయాలు పెరిగిపోయాయని, కాపులకు రిజర్వేషన్ వంటి అంశాలపై అన్ని పార్టీలు ఆత్మ విమర్శ చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసన మండలిలో కాపులకు రిజర్వేషన్ బిల్లును మంత్రి అచ్నెన్నాయుడు శనివారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కాపు రిజర్వేషన్‌పై రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

12/03/2017 - 04:53

అమరావతి, డిసెంబర్ 2: పనె్నండురోజుల పాటు జరిగిన శాసనసభా సమావేశాలను బహిష్కరించడం ద్వారా వైసీపీ నాయకత్వం తప్పులోకాలేసింది. శనివారంతో ముగిసిన సమావేశాల్లో కీలకమైన అంశాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వాన్ని నిలబెట్టి, నిలదీసే అవకాశాన్ని తమ నాయకత్వం చేతులారా పోగొట్టుకుందన్న ఆవేదన వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తమవుతోంది.

12/03/2017 - 04:53

విజయవాడ (బెంజిసర్కిల్), డిసెంబర్ 2: రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు బీసీ ఎఫ్ కేటగిరి పేరుతో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూ చంద్రబాబు మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సిద్దపడ్డారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. శాస్ర్తియత లేని బిల్లు ఆమోదం ఎప్పుడూ పొందలేదని, తద్వారా కోర్టులలో ఈ అంశం నిలబడదన్నారు.

12/03/2017 - 04:52

విజయవాడ, డిసెంబర్ 2: కాపులను బీసీల్లో చేర్చాలని మంత్రి మండలి తీర్మానించటం, దానిని ఉభయ సభల్లో ఆమోదించడంతో కాపుల చిరకాల కోరి తీరిందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశల ముగింపు అనంతరం శాసనసభ ప్రాంగణంలోని మీడియఅ పాయింట్ వద్ద శనివారం సాయంత్రం పలువురు కాపు నేతలతో కలిసి ఆయన మాట్లాడారు.

12/03/2017 - 04:52

విజయవాడ, డిసెంబర్ 2: కాపు రిజర్వేషన్లకు సంబంధించి నివేదిక అందచేయడంలో బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ జాప్యం చేస్తున్నారన్న అభిప్రాయాన్ని మంత్రి నారాయణ వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ నలుగురు సభ్యుల్లో ఇప్పటి వరకూ ముగ్గురు సభ్యులు మాత్రమే నివేదిక ఇచ్చారన్నారు. దీంతో మెజార్జీ సభ్యుల అభిప్రాయంతో ముందుకు వెళ్లామని తెలిపారు.

Pages