S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/02/2017 - 03:58

ఖమ్మం, డిసెంబర్ 1: సుదీర్ఘకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న గిరిజనుల రిజర్వేషన్ల వివాదం ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలగా మారుతోంది. ఎస్టీలుగా ఉన్న లంబాడీలు, ఆదివాసీల మధ్య ముదురుతున్న వివాదం ప్రభుత్వానికి సంకటంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30లక్షల మంది ఎస్టీలు ఉండగా వారిలో 20,46,117మంది లంబాడీలే. వీరంతా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలో మైదాన ప్రాంతానికి సమీపంలోనే జీవిస్తున్నారు.

12/02/2017 - 03:53

విజయవాడ, డిసెంబర్ 1: రాజధాని అమరావతిలో నిర్మించనున్న సచివాలయ భవన డిజైన్‌ను దాదాపు ఖరారు చేశారు. వెలగపూడి సచివాలయ ఆవరణలోని ఆసెంబ్లీలో శుక్రవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునేందుకు సీఎం నిర్ణయించారు.

12/02/2017 - 03:49

విజయవాడ, డిసెంబర్ 1: చాలాకాలంగా ప్రకటనలకే పరిమితమైన నిరుద్యోగ భృతి అంశాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఒక కొలిక్కి తీసుకువచ్చింది. చదువుకున్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించే ముసాయిదాను శాసనసభలో శనివారం ప్రవేశపెట్టనున్నారు.

12/02/2017 - 03:48

అమరావతి, డిసెంబర్ 1: ఇంధన రంగంలో అమరావతికి అరుదైన గౌరవం దక్కింది. జైపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి ఇంధన సామర్థ్య సదస్సులో ఇంధన సామర్థ్యం పెంపు, పొదుపు, ఎల్‌ఇడీ బల్బుల వాడకంపై ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం 29 రాష్ట్రాలున్నా మన రాష్ట్రానికే లభించటం ద్వారా ఎనర్జీ రంగంలో ఏపీ విజయాలను ప్రపంచం గుర్తించినట్లు స్పష్టమయింది.

12/02/2017 - 03:47

విజయవాడ, డిసెంబర్ 1: రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరిలకు రిజర్వేషన్ 5% కల్పించడానికి అత్యవసర క్యాబినేట్ సమావేశంలో చర్చించి, అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు పిళ్ళా వెంకటేశ్వరరావు, రాష్ట్ర కాపునాడు అధికార ప్రతినిధి, కృష్ణాజిల్లా అధ్యక్షులు బేతు రామమోహనరావు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలియజేశారు.

12/02/2017 - 03:47

విజయవాడ, డిసెంబర్ 1: ఐటి రంగంలోని దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా రూపొందించిన కొత్త ఐటీ విధానానికి రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఇంటిగ్రేటెడ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ పాలసీ 2017-2020గా ఈ పాలసీని వ్యవహరిస్తారు. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వాక్ టు వర్క్ అన్న కానె్సప్ట్‌తో విధాన రూపకల్పన చేశారు.

12/02/2017 - 03:46

విజయవాడ, డిసెంబర్ 1: రాష్ట్రంలో వివిధ డిస్కంల పరిధిలో 2018-19 సంవత్సరంలో విద్యుత్ చార్జీలు పెరగవు. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) వద్ద డిస్కంలు తమ ప్రతిపాదనలను అందచేశాయి. విజయవాడలో డిస్కంలతో ఈఆర్సీ సమావేశం శుక్రవారం నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యుత్ చార్జీలను పెంచకుండా తమ ప్రతిపాదనలను ఈఆర్సీకి అందచేశాయి. దీని వల్ల 1.72 కోట్ల మంది వినియోగదారులకు మేలు జరుగనుంది.

12/02/2017 - 03:46

విజయవాడ, డిసెంబర్ 1: వరల్డ్ మెమరీ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికై చైనా వెళుతున్న ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ విద్యార్థులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి కె.ఎస్.జవహర్ అభినందించారు. శుక్రవారం సచివాలయంలోని తమ ఛాంబర్‌లో కలిసిన విద్యార్థులు ఎమ్.సాయి జ్యోతి, జె.జ్యోతి, ఎస్.మమత, పి.మధుకర్‌తో మాట్లాడారు. ఆ పోటీలో విజయం సాధించి రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో ఇనుమడింపచేయాలని కోరారు.

12/02/2017 - 03:45

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 1: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా రాహల్‌గాంధీని ప్రతిపాదిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది.

12/02/2017 - 03:45

విజయవాడ, డిసెంబర్ 1: ఒంగోలులో రాష్ట్ర స్థాయి 25వ జాతీయ బాలల సైన్సు కాంగ్రెస్‌ను డిసెంబర్ 3, 4 తేదీల్లో నిర్వహించేందుకు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆప్ సైన్సు అండ్ టెక్నాలజీ ఏర్పాట్లు చేస్తోంది. వల్లూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో దీనిని నిర్వహించనున్నారు. దివ్యాంగులపై ప్రత్యేక శ్రద్ధతో సుస్థిర అభివృద్ధికి శాస్త్ర, సాంకేతికత, సృజనాత్మకత అన్న అంశంపై బాల శాస్తవ్రేత్తల నుంచి ఎంట్రీలను ఆహ్వానించారు.

Pages