S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/01/2017 - 02:48

విజయవాడ, నవంబర్ 30: ఈద్ మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 2వ తేదీన 1881 నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ చట్టం ప్రకారం సెలవుదినంగా ప్రకటించినట్లు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ తెలపారు. ఈ మేరకు గురువారం జీఓ విడుదల చేశారు. గతంలో మిలాదున్ నబీ సందర్భంగా డిసెంబర్ 1వ తేదీన సెలవు దినంగా సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

12/01/2017 - 02:48

అమరావతి, నవంబర్ 30: పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేసే క్రమంలో ఏకగవాక్ష విధానాన్ని మరింత సరళీకరించి అన్ని అనుమతులు సత్వరం పొందగలిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా ఆదేశించారు. పర్యాటక పెట్టుబడిదారులు తమ అనుమతుల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఎదురు కాకుండా, ఏకగవాక్ష విధానాన్ని మరింత పటిష్ఠపరచాలని సూచించారు.

12/01/2017 - 02:47

గుడ్లవల్లేరు, నవంబర్ 30: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాపుజాతిని దగా చేస్తున్నారని కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. గురువారం ఆయన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ నేను మారాను అని చెప్పి కాపుల ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు నేడు తమ జాతికి తీరని ద్రోహం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

12/01/2017 - 02:46

భీమవరం, నవంబర్ 30: సమిష్టిగా ఆలోచించాలి..కొంగొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలి. ఉరకలెత్తే యువత ఆలోచనలకు ప్రోత్సాహం అందిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. యువత సాధించలేనిది ఏదీలేదు. ఇందుకు వారిని చైతన్యం చేయడం ఒక ఆయుధం. వారిలో ఆలోచనలను బయటకు రప్పించి, వారిని కార్యోన్ముఖులను చేయగలిగితే అద్భుతాలు సృష్టిస్తారు. ఈ పనికి శ్రీకారం చుటి, ప్రపంచ యువతకు వేదికగా నిలిచింది అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ.

12/01/2017 - 01:04

విజయవాడ (బెంజిసర్కిల్), నవంబర్ 30: ఇప్పటి వరకు ఆడవాళ్ళు మగవారిపై ఆధారపడి ఉండే వారని, కాని నేడు మారుతున్న పరిస్థితుల్లో స్ర్తి తన శక్తిన్ని అన్నింటా పెంచుకోవడంతో అడవారిపై మగవారు ఆధారపడే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.

12/01/2017 - 01:02

విజయవాడ (బెంజిసర్కిల్), నవంబర్ 30: కబ్జాలు...హత్యలు...సెటిల్‌మెంట్‌లు చేసుకునే వ్యక్తికి నేడు చంద్రబాబు పక్కన కూర్చోనే ఆర్హత లేదని పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డిని ఉద్దేశించి అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం లాబీల్లో వైకాపా ఎమ్మెల్యేలు చేరిక, పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య గురువారం అసక్తికర సంభాషణ జరిగింది.

12/01/2017 - 01:01

విజయవాడ (బెంజిసర్కిల్), నవంబర్ 30: పవన్ కల్యాణ్ కేవలం సినిమాలకే పనికి వస్తారని, రాజకీయాల్లోకి పనికి రాడని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తెదేపాలో ఎప్పటికీ చంద్రబాబు ఒక్కడే నెంబర్ వన్‌గా ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం లాబీల్లో వైకాపా ఎమ్మెల్యేలు చేరిక, పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య అసక్తికర సంభాషణ జరిగింది.

12/01/2017 - 00:59

శ్రీకాకుళం, నవంబర్ 30: ఇక అణువు కదలదు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారత-అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో కొవ్వాడలో పది వేల మెగావాట్ల సామర్థ్యంలో నిర్మించనున్న అణుపార్కు నిర్మాణానికి అన్ని రకాల సన్నాహాలు తుది దశకు చేరుకున్న సమయంలో నిధుల సమస్య తలెత్తింది. అత్యంత కీలకమైన భద్రత వలయానికి 60 కిలోమీటర్లు ఏయే గ్రామాలు ఖాళీ చేయాలి? అణుకేంద్ర రక్షణ పరిధిలోకి ఏయే గ్రామాలు వస్తాయి?

12/01/2017 - 00:57

రాజమహేంద్రవరం, నవంబర్ 30: గోదావరి నదిలో డ్రెడ్జింగ్ ప్రక్రియ అసలు ప్రయోజనాన్ని వదిలి, కొసరు ఫలితాన్నిచ్చింది. నదిలో పెరిగిపోయిన ఇసుక మేటలను తొలగిస్తే కాటన్ బ్యారేజీ వద్ద నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, ఏటా రబీలో ఎదురవుతున్న సాగు నీటి సమస్యను అధిగమించవచ్చని ప్రభుత్వం భావించింది. అయితే డ్రెడ్జింగ్ జరిగినప్పటికీ,.

12/01/2017 - 00:56

విజయవాడ, నవంబర్ 30: ఒక్కో రాష్ట్రాన్ని కబళిస్తున్నట్లుగానే ఏపీలో కూడా బీజేపీ చేయాలనుకుంటోందని ఎంపీ జెసీ దివాకర రెడ్డి ఆరోపించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అయితే తమ సీఎం సామాన్యుడు కాదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం లేఖ రాయడం దురదృష్టకరమన్నారు. సీఎం తనను తాను తక్కువ చేసుకుని పోలవరం విషయంలో కేంద్రానికి వివరించారన్నారు.

Pages