S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/02/2017 - 03:44

గుంటూరు, డిసెంబర్ 1: జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం సమస్యను పరిష్కరించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలని లోక్‌సత్తా పార్టీ జాతీయ నేత ఎన్.జయప్రకాష్ నారాయణ్ పేర్కొన్నారు. సురాజ్య యాత్రలో భాగంగా శుక్రవారం గుంటూరుకు విచ్చేసిన ఆయన ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూరె్తైతే తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా మారతాయన్నారు.

12/02/2017 - 03:44

అమరావతి, డిసెంబర్ 1: కాపువర్గాలకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము కోర్టులో సవాల్ చేస్తామని బీసీ యునైటెడ్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు పాలూరు రామకృష్ణయ్య వెల్లడించారు. బీసీ కమిషన్ జనగణన ప్రకారం ముందు బీసీల రిజర్వేషన్ల సంఖ్య పెంచి, తర్వాత ఇతరులకు ఇవ్వాలని గతంలో కోర్టులు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

12/02/2017 - 03:43

అమరావతి, డిసెంబర్ 1: ప్రభుత్వం కీలకంగా భావించిన బీసీ కమిషన్ నివేదిక.. చివరకు కమిషన్ చైర్మన్ మంజునాథ సిఫార్సు లేకుండానే ఆమోదించాల్సి వచ్చినట్లు సమాచారం. ఆయన మరికొంత సమయం కావాలని కోరుతుండటంతో, కమిషన్‌లోని ముగ్గురు సభ్యులు తమ సిఫార్సులు ప్రభుత్వానికి అందచేశారు. మంత్రివర్గం దానినే అమోదించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

12/02/2017 - 03:43

విజయవాడ, డిసెంబర్ 1: అక్రిడేషన్ జీవో సవరణపై చేసిన పలు సూచనలను నివేదిక రూపంలో రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులకు అక్రిడేషన్ సబ్ కమిటీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు శుక్రవారం అందజేశారు. వెలగపూడి సచివాలయంలోని సమాచార శాఖ కమిషనర్, సెక్రటరీ ఛాంబర్‌లో సబ్ కమిటీ చైర్మన్ శుక్రవారం ఈ నివేదికను అందజేశారు.

12/02/2017 - 03:42

విజయవాడ, డిసెంబర్ 1: నెల్లూరు జిల్లాలోని కండలేరు రిజర్వాయరు నుంచి చెరువులకు డిసెంబర్ 4న నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ, ఎమ్మెల్యేలు రామకృష్ణ, సునీల్ శుక్రవారం సమావేశమయ్యారు. నీటి విడుదలకు ఇబ్బందులు లేవని అధికారులు వివరించడంతో నిర్ణయం తీసుకున్నారు.

12/02/2017 - 03:42

విజయవాడ, డిసెంబర్ 1: బీజేపీలోని కొంతమంది డూప్లికేట్ల వల్లే పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు వస్తున్నాయని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు పురంధ్రీశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు వంటి నేతలు పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

12/02/2017 - 03:41

అమరావతి, డిసెంబర్ 1: ‘నాకేమీ మొహమాటాలు లేవు. ఎన్నికల్లో గెలుస్తారనుకున్న వాళ్లకే టికెట్లు ఇస్తా. మీ పనితీరు బాగోలేకపోతే నేనేమీ చేయలేను. అందుకే నాలుగు గ్రూపులుగా విభజిస్తున్నా. పనితీరు బాగోలేని వారిని పిలిపించి చెబుతా. అప్పటికీ మారకపోతే వదిలేస్తా. మీరు కుటుంబసభ్యులకూ సమయమివ్వండి. గ్రూపులు కట్టి పార్టీకి తలనొప్పి సృష్టిస్తే ఇప్పటిమాదిరిగా పిలిచి మాట్లాడేపనిలేదు. నేరుగా చర్యలే!

12/02/2017 - 03:39

విజయవాడ, డిసెంబర్ 1: పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్రం ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో పోరాటం చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. సచివాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం వ్యవహరించాలనన్నారు. నిధుల విడుదలకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు.

12/02/2017 - 02:04

హైదరాబాద్, డిసెంబర్ 1: ఆంధ్రప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ నెపంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులెత్తేశారని వైఎస్‌ఆర్‌సిపి నేతలు విమర్శించారు. పోలవరం నిర్మాణం ఆగి తే రాష్ట్ర ప్రజలు క్షమించరని అన్నారు. ముడుపుల కోస మే పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారని వారు అరోపించారు. ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టి పోలవరాన్ని ఏం చేయబోతున్నారో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.

12/02/2017 - 02:03

శ్రీకాళహస్తి, డిసెంబర్ 1: జర్మనీకి చెందిన 21 మంది భక్తబృందం శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించింది. జర్మనీకి చెందిన భక్తులు భారతదేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ శుక్రవారం శ్రీకాళహస్తికి వచ్చారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ఆలయంలోనే సుమారు ఒక గంట సేపు ధ్యానం చేశారు. హిందువుల్లాగా శివనామస్మరణ చేస్తూ తన్మయత్వం చెందారు.

Pages