S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/03/2017 - 04:51

విజయవాడ, డిసెంబర్ 2: రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్‌ఎండి ఫరూఖ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. మండలిలో కాపులకు రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొనేందుకు శనివారం సీఎం మండలికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనుభవం కలిగిన వ్యక్తిఅని, అజాతశత్రువని ఫరూఖ్‌ను కొనియాడారు.

12/03/2017 - 04:51

విజయవాడ, డిసెంబర్ 2: ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం 9 గంటలకల్లా అదీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభలోకి ప్రవేశించక ముందుగానే లోపలికి వచ్చి తన సీట్లో ఆశీనులయ్యారు. కాపు రిజర్వేషన్ బిల్లు కోసం ప్రశ్నోత్తరాలు, ఇతర అంశాలన్నింటినీ పక్కనబెట్టారు. అయితే సభ్యులనేక మంది లాబీలోనే తచ్చాడుతున్నారు.

12/03/2017 - 04:50

విజయవాడ, డిసెంబర్ 2: రాష్ట్ర శాసన సభ, శాసన మండలి 29వ సమావేశాలు శనివారం ముగియడంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి. గత నెల 10న ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరిగాయి. తొలుత నవంబర్ 25వ తేదీ వరకూ నిర్వహించేందుకు నిర్ణయించినప్పటికీ, వివిధ బిల్లులు సభలో ప్రవేశపెట్టాల్సి ఉండటం, సెలవులు ఎక్కువగా ఉండటంతో డిసెంబర్ 2వ తేదీ వరకూ పొడిగించారు.

12/03/2017 - 03:33

నిజామాబాద్, డిసెంబర్ 2: నిజామాబా ద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నం గ్రామంలో చోటుచేసుకున్న ఉదంతానికి సంబంధించి బీజేపీ మాజీ నాయకుడు భరత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకోనుందని స్పష్టమవుతోంది. తన దాష్టీకపు చర్యల నుండి ఎలాగైనా బయటపడాలనే తలంపుతో భరత్‌రెడ్డి ఎంతో వ్యూహాత్మకంగా ‘సినీ ఫక్కీ’లో అల్లిన షూటింగ్ ఎపిసోడ్ కాస్త తారుమారవడంతో అతని కోసం పోలీసులు వేటను మరింత ముమ్మరం చేయనున్నారు.

12/03/2017 - 03:31

శ్రీకాకుళం, డిసెంబర్ 2: చెత్తకుప్పల్లో, కాలువల్లో పసికందులను పడేసిన సంఘటనలు.... ఆసుపత్రుల్లోని శిశువులను ఎత్తుకుపోయే సందర్భాలు సంభవించాయి. కానీ, శ్రీకాకుళంలో ఏకంగా శిశువుల విక్రయ కేంద్రమే పుట్టి, జిల్లాకు చెడ్డపేరు తెచ్చింది. అదీ ఓ మహిళ నిర్వహించడం దారుణం!

12/03/2017 - 03:26

ఆదోని/తుగ్గలి, డిసెంబర్ 2: రైతులు అధైర్యపడవద్దని, వారి కి అండగా ఉంటానని వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా సంకల్పయాత్ర 24వ రోజు కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో కొనసాగింది. తుగ్గలి పలువురు రైతులు జగన్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.

12/03/2017 - 03:24

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 2: కాపులకు రాజకీయ, సామాజిక, ఆర్థికంగా అభ్యున్నతి చెందడానికి దోహదపడేలా రిజర్వేషన్లు ఉండాలని ఏపీ కాంగ్రెస్ కాపు రిజర్వేషన్ సాధికారత విభాగం చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు పేర్కొన్నారు.

12/03/2017 - 03:24

విజయవాడ, డిసెంబర్ 2: పాఠశాలల్లో పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి ఐఈసీ కిట్స్‌తో దేవాన్ష్‌పై ప్రయోగం చేశానని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

12/03/2017 - 03:23

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 2: మున్సిపల్ రంగంలోని ఉద్యోగ, కార్మికుల హక్కులను కాలరాస్తూ, మున్సిపాల్టీలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన 279 జీవో తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శనివారం సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన రఘువీరారెడ్డి జీవోతో ప్రజలపై కోట్లాది రూపాయల భారం పడుతుందన్నారు.

12/02/2017 - 04:00

కర్నూలు/పత్తికొండ, డిసెంబర్ 1 : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కమీషన్ల కోసం దురాశకు పోయి చేస్తున్న తప్పిదాలను ఎత్తిచూపుతూ కేంద్ర ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.

Pages