S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/02/2017 - 02:04

విజయనగరం, డిసెంబర్ 1: విజయనగరం పట్టణంలోని కెఎల్ పురం సమీపంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం సమీపంలో పోలయ్యపేట వద్ద నివసిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థి ముదునూరు అశ్విని (24) శుక్రవారం సాయంత్రం నడక కోసం కెఎల్ పురం వైపు వెళ్లింది. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆమెపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు.

12/02/2017 - 02:02

తిరుపతి, డిసెంబర్ 1: చిత్తూరు జిల్లాలో గాలేరి-నగరి రిజర్వాయర్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసేలా ముఖ్యమంత్రి మనసు మార్చాలని ఆ తిరుమల శ్రీనివాసుడిని ప్రార్ధిస్తానని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. నగరి సత్రవాడ నుంచి ఎమ్మెల్యే రోజా చేపట్టిన పాదయాత్ర శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకుంది. ఈసందర్భంగా ఉదయం తిరుచానూరు వద్దకు చేరుకున్న ఆమె ముందుగా శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు.

12/02/2017 - 02:02

విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 1: ఆడపిల్ల పుట్టిందని భార్య, పాపను వదిలేశాడో భర్త! ఆమెరికా వెళ్లిపోయిన భర్తను ఇక్కడకు తీసుకుని వచ్చి న్యాయం చేయాల్సిందిగా ఆ ఇల్లాలు బోరుమంది. అనకాపల్లి జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న షేక్ సుభాని, తన కుమార్తె షేక్‌ఫాతిమాను జివిఎంసిలో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న ఎండి రషీదాబేగం కుమారుడైన జబూయిల్ హక్ నవాజ్‌తో పెద్దల సమక్షంలో వివాహం చేశారు.

12/02/2017 - 02:01

విజయవాడ, డిసెంబర్ 1: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షిణ కొరియాలో డిసెంబర్ 3 నుంచి ఆరు వరకు పర్యటిస్తారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ పెట్టుబడుల ఆకర్షణే ప్రధానాంశంగా ముఖ్యమంత్రి సియోల్, బూసన్ నగరాలలో పర్యటిస్తారన్నారు.

12/02/2017 - 02:06

అమలాపురం, డిసెంబర్ 1: చైనాలో ప్రపంచ స్పీడ్ కార్డు ఓపెన్ మెమరీ పోటీలకు ముమ్మిడివరం సాంఘి క సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని జగడం ప్రేమ జ్యోతి ఎంపికయ్యింది. కాట్రేనికోన మండలానికి చెందిన ప్రేమ జ్యోతి గురుకుల పాఠశాలలో ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. ఆమెలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు గుర్తించిన గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు జ్యోతికి వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చారు.

12/02/2017 - 02:00

కాకినాడ, డిసెంబర్ 1: బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా పేరుగాంచిన పోలవరంను పూర్తిచేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడివుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. రూ.50 వేల కోట్లతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ వ్యయంలో కేవలం రూ.1400 కోట్ల పనులపై టిడిపి ప్రభుత్వం అనవసర రాద్ధాతం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

12/02/2017 - 01:58

గుంటూరు, డిసెంబర్ 1: ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాలను, న్యాయ వ్యవస్థలను బ్లాక్ మెయిల్ చేస్తూ నియంతలా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ధ్వజమెత్తారు. శుక్రవారం గుంటూరులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ తన మాట వినని రాజకీయ పార్టీలను దేశ ద్రోహులుగా పేర్కొంటున్నారన్నారు.

12/01/2017 - 03:44

విజయవాడ (బెంజిసర్కిల్), నవంబర్ 30: విభజన హామీల్లో ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టుపై ఎంత మంది ఎన్ని వివాదాలు సృష్టించినా... ఎన్ని అవాంతరాలు ఎదురైనా... నిధుల సమస్య ఎదురౌతున్నా... ఆపకుండా పనులను పరుగులు తీయిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

12/01/2017 - 03:42

విశాఖపట్నం, నవంబర్ 30: పోలవరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని కేంద్రం నిర్ధారణకు వచ్చినందువల్లే పోలవరం పనులకు నిధులు ఇవ్వలేమని, పనులు నిలిపివేయమని ఆదేశించిందని వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

12/01/2017 - 03:40

అమరావతి, నవంబర్ 30: తెలుగుదేశం ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం తమతో కావాలనే కయ్యానికి కాలుదువ్వుతోందని మిత్రపక్షమైన బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. తమకు టీడీపీకి దూరం కావాలని గానీ, పోలవరం రాకుండా ఉండాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదని స్పష్టం చేస్తున్నారు.

Pages