S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/12/2017 - 07:43

గుంటూరు, మార్చి 11: కాపు రిజర్వేషన్ల సాధనలో ఎలాంటి శక్తులకు భయపడేదిలేదని కాపునాడు అధ్యక్షుడు ముద్రగడ పద్మనాభం తేల్చిచెప్పారు. రిజర్వేషన్ల సాధనకు అవసరమైతే ప్రాణత్యాగం చేస్తామని స్పష్టం చేశారు. తాము బిసిలకు అన్యాయంచేసి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయటంలేదన్నారు. రిజర్వేషన్లకు సంఘీభావం ప్రకటించాల్సిందిగా ఆదివారం బిసి సంక్షేమ, ఐక్య సంఘాల నేతలతో సంప్రతింపులు జరపనున్నారు.

03/11/2017 - 04:21

అమరావతి, మార్చి 10: ‘‘విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, సోలార్, పొదుపు - సంరక్షణ విధానాల్లో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆంధ్రప్రదేశ్ దక్కించుకోవడం ఈ మూడేళ్లలో కొత్తేమీ కాదు. థర్మల్ విద్యుత్తు ఉత్పత్తికోసం విపరీతంగా బొగ్గును వినియోగిస్తూ కార్బన్ ఉద్గారాలను విడిచిపెడుతూ వాతావరణం కాలుష్యం కాకుండా చూడాలన్నదే నా ప్రధాన లక్ష్యం. అందుకే...

03/11/2017 - 04:19

విజయవాడ, మార్చి 10: గతంలో హైకోర్టు ఆదేశాలతో నిలిచిపోయిన ఏపి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ నియామక సమస్య ఎట్టకేలకు పరిష్కారమయింది. గత ఏప్రిల్ 26న చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కారెం శివాజీ నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని, ముందుగా నోటిఫికేషన్ ఇవ్వలేదంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన క్రమంలో..

03/11/2017 - 04:17

విజయవాడ, మార్చి 10: పుట్టుకతో అంగవైకల్యం, చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సిన దయనీయ స్థితి. స్థిమితంగా చిన్న ఉద్యోగం చేయటానికే కుదరని నిస్సహాయుడు. అతడి పేరు జంధ్యం వెంకటేశ్వరరావు. శుక్రవారం కృష్ణాజిల్లా ప్రసాదంపాడు నుంచి వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిశారు. తన కష్టాన్ని వివరించి సహాయం అడగటానికి ముందుకు రాబోగా, సిఎం అతని పరిస్థితి చూసి వారించి తానే అతడి సమీపానికి వెళ్లారు.

03/11/2017 - 04:14

విజయవాడ (క్రైం), మార్చి 10: నిత్యం కోర్టుల చుట్టూ తిరిగే వైకాపా నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని విమర్శించే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ ఎంత ఘనుడో వోక్స్‌వాగన్ కంపెనీ స్విట్జర్, అలెక్‌రాజాని అడిగితే చెబుతారన్నారు.

03/11/2017 - 04:13

విజయవాడ, మార్చి 10: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకు సంబంధించి ఉత్తమ చిత్రాల, ఉత్తమ కళాకారుల, సాంకేతిక నిపుణులకు సంబంధించి నంది ఫిల్మ్ అవార్డుల ఎంపిక కోసం నిర్మాతల నుంచి ఎంట్రీ ఫారాలను ఆహ్వానిస్తోంది.

03/11/2017 - 04:12

అమరావతి, మార్చి 10: ఉత్తరాది ఎన్నికలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిజెపికి అనుకూలంగా ఉంటాయన్న ఎగ్జిట్‌పోల్స్ నేపథ్యంలో, ఫలితాల అనంతరం ఏపిలో కూడా యుపి ప్రయోగానికి బిజెపి నాయకత్వం సిద్ధమవుతోంది. ఆంధ్రపదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలపై సీరియస్‌గా దృష్టి సారించాలని కూడా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

03/11/2017 - 04:11

విజయవాడ, మార్చి 10: బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేసి తమ ఉన్నతికి తోడ్పాటు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కృతజ్ఞతలు తెలిపింది. ఆలయాల్లో పనిచేసే అర్చకులకు వారసత్వ హక్కును కల్పించి, వారి వయో పరిమితిని రద్దుచేసి వారి జీవితాల్లో వెలుగు నింపిన సందర్భంగా సన్మానించేందుకు సమయం కేటాయించాలని సంఘటన అధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య విజ్ఞప్తి చేశారు.

03/11/2017 - 04:11

అమరావతి, మార్చి 10: ప్రకాశం జిల్లాలో పార్టీ మారిన వైసిపి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఇకపై వారే ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి వరకు కొనసాగిన ప్రకాశం జిల్లా పార్టీ సమీక్ష సమావేశంలో చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు క్లాసు ఇచ్చారు.

03/11/2017 - 04:10

విజయవాడ, మార్చి 10: బిసిలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సముచిత స్థానం కల్పిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో చేనేత సామాజిక వర్గానికి చెందిన పోతుల సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో 13 జిల్లాలకు చెందిన చేనేత సంఘాల నాయకులు చంద్రబాబును కలిసి శుక్రవారం రాత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Pages