S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/14/2017 - 03:39

విశాఖపట్నం, మార్చి 13: నెల్లూరు జిల్లా బుచ్జిరెడ్డిపాలెం ఎస్‌బిఐ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులపై సిబిఐ కేసు నమోదు చేసింది. సిబిఐ అధికారులు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరాలు పేర్కొన్నారు.

03/14/2017 - 03:38

రాజమహేంద్రవరం, మార్చి 13: గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల జియో టాగింగ్ పనులకే పరిమితమైన రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ యంత్రాంగం పలు సమస్యల నేపథ్యంలో పోరుబాట పట్టింది. చేతినిండా పని కల్పించకుండా తమను శంకించడం ఎంత వరకు సబబు అంటూ వారు ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు సంస్థ ఎండిని కలవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఎట్టకేలకు దశల వారీ పోరాటానికి జెఎసి సన్నద్ధమైనట్టు సమాచారం.

03/14/2017 - 03:37

విజయవాడ, మార్చి 13: పనిచేసే ప్రభుత్వాలకు ప్రజల అండదండలు ఎప్పుడూ ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ‘నీరు-ప్రగతి’పై సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీపై ప్రజల విశ్వాసానికి ఇటీవల వివిధ రాష్ట్రాల శాసనసభల ఎన్నిక ఫలితాలే నిదర్శనంగా పేర్కొన్నారు.

03/14/2017 - 03:36

విజయవాడ, మార్చి 13: పోలవరం పనులకు సంబంధించి భారీ యంత్రాల తరలింపులో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. భారీ యంత్రాలను తరలించకపోవడంపై కాంట్రాక్టర్లను ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఉండవల్లిలోని తన నివాసం నుంచి సోమవారం సిఎం సమీక్ష నిర్వహించారు.

03/14/2017 - 03:15

అమరావతి, మార్చి 13: తెలుగుదేశం పార్టీని అగ్రనేతల మరణాలు కుంగదీస్తున్నాయి. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీని కంచుకోటల్లా తీర్చిదిద్దిన ప్రముఖులు ఆ తర్వాతి కాలంలో రోడ్డు ప్రమాదాల్లోనో, సహజంగానో మృతి చెందుతున్న వైనం పార్టీకి భారీ నష్టం మిగులుస్తోంది. ఫలితంగా ఆ స్థాయిలో నేతలను ఇప్పటికీ తయారుచేసుకోలేక పార్టీ నాయకత్వం సతమతమవుతోంది.

03/14/2017 - 03:09

అమరావతి, మార్చి 13: తెలుగుదేశం పార్టీలో పెరిగిపోతున్న ముఠా తగాదాలు, అనైక్యతకు తెరదించేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపొందించిన ఫార్ములా పనిచేయడం ప్రారంభించింది. పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో కూడా అగ్రనేతల మధ్య సయోధ్య లేక బలహీనపడుతుండటాన్ని గమనించిన బాబు, వారందరినీ ఏదో ఒక నియోజకవర్గానికి వెళ్లి అందరూ కలిసి అక్కడి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు.

03/14/2017 - 03:07

విజయవాడ, మార్చి 13: రాష్ట్రంలోని జిల్లా, సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో బ్రిటీష్‌కాలం నుంచి కొనసాగుతూ వస్తోన్న కంచుగంటలను ఏం చేస్తారనే అంశం ప్రస్తుతం ప్రతి కార్యాలయంలోనూ చర్చనీయాంశంగా మారింది. కాలగమనంలో ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోవడంతో ప్రస్తుతం ఆ గంటలు దిష్టిబొమ్మలుగా మారాయి. ప్రస్తుతం అసలు ఈ గంటలతో పనిలేకపోవటంతో వాటిని కాపాడలేక అనేక కార్యాలయాల్లో వాటిని జాగ్రత్తగా పదిలపరచారు.

03/14/2017 - 03:05

అమరావతి, మార్చి 13: తాజాగా జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల్లో మణిపూర్‌లో బిజెపికి మెజారిటీ లేకపోయినా కమల వికాసం ఖాయయింది. ప్రధాని మోదీ బృందసభ్యుడు, తెలుగు నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చూపిన చాణక్యం అక్కడ బిజెపి సర్కారును ఏర్పాటుచేయనుంది. నిజానికి అక్కడ బిజెపి 21, కాంగ్రెస్ 28, ఇతరులు 10, టీఎంసి ఒక సీటు గెలుచుకున్నాయి.

03/14/2017 - 02:16

విశాఖపట్నం, మార్చి 13: ప్రజా సమస్యలపై జనసేన స్పందించనుంది. రాజకీయ పార్టీగా అవతరించి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఇక జనంలోకి వెళ్లాలన్న అభిప్రాయంతో అధినేత పవన్ కల్యాణ్ ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగానే జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు రావాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం.

03/14/2017 - 02:12

ఒంగోలు, మార్చి 13: ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం స్వల్పంగా భూమి కంపించింది. సోమవారం ప్రజలందరూ నిద్రమత్తులో ఉన్న సమయంలో వేకువజామున రెండున్నర గంటల ప్రాంతంలో రెండు సెకెన్లపాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలకు షెల్ఫ్‌లో ఉన్న గినె్నలు కిందపడడంతో నిద్రమత్తులో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Pages