S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/14/2017 - 02:10

విజయవాడ, మార్చి 13: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 31 వరకూ పొడిగించే అవకాశాలు ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిలో ఉభయ సభల్లో సోమవారం సమావేశాలను రద్దు చేశారు. మంగళవారం ఉభయ సభల్లో నాగిరెడ్డి సంతాప సమావేశాలను నిర్వహించి వాయిదా వేయనున్నారు. దీంతో రెండు రోజుల పాటు వివిధ అంశాలపై చర్చించేందుకు వీలు లేకపోవడంతో ఆ మేరకు రెండు రోజుల పాటు సమావేశాలను పొడిగించే అవకాశం ఉంది.

03/14/2017 - 01:28

విజయవాడ (క్రైం), మార్చి 13: ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ఐపిఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈమేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో జాయింట్ పోలీసు కమిషనర్‌గా పని చేస్తున్న పి హరికుమార్‌ను ఏసిబి అదనపు డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఈయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. హరికుమార్ జాయింట్ సీపిగా బాధ్యతలు తీసుకుని కేవలం పది మాసాలు మాత్రమే అయింది.

03/14/2017 - 01:27

అమరావతి, మార్చి 13: రాష్ట్రంలో ఇద్దరు నేతల అధిపత్యపోరు, ఘర్షణ ఫలితంగా ప్రతిష్టాత్మకమైన పార్టీ సభ్యత్వాలు కూడా జరగని ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని తెలుగుదేశం క్యాడర్, చివరకు పార్టీ నాయకత్వం మాట కూడా ఖాతరు చేయని పరిస్థితి నెలకొంది. ఇటీవల విధానమండలి సభ్యుడిగా ఎన్నికైన సీనియర్ నేత కరణం బలరామ్‌కు టికెట్ ఇచ్చే ముందు..

03/14/2017 - 01:27

విజయవాడ, మార్చి 13: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో సోమవారం ఐదు కేసులు నమోదయ్యాయి. పరీక్షలకు 22,379 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణాలో ఒకటి, గుంటూరులో 1, ప్రకాశం జిల్లాలో రెండు, నెల్లూరులో ఒకటి మొత్తం ఐదు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.

03/14/2017 - 01:26

విజయవాడ, మార్చి 13: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో సంవత్సరానికి 16వేల టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యంతో జరుగుతున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని తక్షణం నిలుపుచేయాలని రాష్ట్ర గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి 10 వామపక్షాల నేతలు లేఖ రాశారు. గ్రామాల మధ్య ఈ పార్క్ వద్దని పరిసర ప్రాంత గ్రామాల ప్రజలందరూ గత మూడు సంవత్సరాలుగా వ్యతిరేకిస్తున్నారన్నారు.

03/14/2017 - 01:25

విజయవాడ, మార్చి 13: పెద్ద నోట్ల రద్దు తరువాత అప్పట్లో పాత 1000 రూపాయలు, 500 రూపాయల నోట్లను చూస్తే జనం ఉలిక్కిపడేవారు. రద్దు అయిన నోట్లను మార్చుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. వాటిని వదిలించుకునేందుకు పడిన పాట్లు దేవుడికే ఎరుక. తాజాగా 10 రూపాయల నాణెం చూస్తే కూడా ప్రజలు అలానే భయపడుతున్నారు.

03/14/2017 - 01:25

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 13: గవర్నర్లతో బిజెపి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొన్నట్టుగా కనిపిస్తోందని, నూతన ప్రభుత్వాల ఏర్పాటులో రాజ్యాంగంలోని నిబంధనలను అమలుచేయకుండా బిజెపి ఏజెండాను అమలుచేస్తున్న గవర్నర్ల పనితీరును పరిశీలిస్తే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

03/13/2017 - 04:27

ఆళ్లగడ్డ, మార్చి 12 : కర్నూలు జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం దిగువ అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం 46వ పీఠాధిపతి శ్రీవన్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌స్వామి ఆధ్వర్యంలో శ్రీ ప్రహ్లాదవరదుని రథోత్సవం వైభవంగా జరిగింది.

03/13/2017 - 04:23

తిరుపతి, మార్చి 12: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం స్వామివారి పుష్కరిణిలో శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై వివిధ రకాల పుష్పాలతో పాటు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. తెప్పోత్సవంలో స్వామివారు ఉభయ దేవేరులతో కూడి ఏడుమార్లు తెప్పపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.

03/13/2017 - 04:21

రాజమహేంద్రవరం, మార్చి 12: గోదావరి నదిలో నీటి లభ్యత రోజు రోజుకీ క్షీణిస్తుండటంతో ఉభయ గోదావరి జిల్లాల్లో దాళ్వా పంటను గట్టెక్కించడానికి అధికారులు త్రిముఖ కసరత్తు జరుపుతున్నారు. సహజ నీటి లభ్యత అడుగంటిపోవడంతో ప్రస్తుతం సీలేరు నీరే శరణ్యంగా మారింది. గోదావరి డెల్టాలో రబీకి అనూహ్యంగా ఇబ్బందులు ఎదురయ్యాయి.

Pages