S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/13/2017 - 02:03

నెల్లూరు, మార్చి 12: సరదాగా సముద్ర స్నానం చేస్తూ ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ఆదివారం నెల్లూరు జిల్లా టిపి గూడూరు మండలం కోడూరు బీచ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు నగరానికి చెందిన 14 మంది యువకులు ఆదివారం దామరమడుగులో క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. ఆట అనంతరం సరదాగా సముద్ర స్నానం చేసేందుకు కోడూరు బీచ్‌కు 8 మంది యువకులు వెళ్లారు.

03/13/2017 - 02:03

తడ, మార్చి 12: ఆంధ్రా నుండి తమిళనాడుకు ఎర్రచందనం అక్రమ రవాణా నిరాటంకంగా సాగుతోంది. సరిహద్దుల్లోని పోలీస్‌స్టేషన్లు, చెక్‌పోస్టులు దాటుకొని నిత్యం కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం తరలిపోతోంది. ఆదివారం నెల్లూరు జిల్లా తడ సమీపంలోని తమిళనాడుకు చెం దిన తచ్చూరుకూట్ రోడ్డు వద్ద అక్కడ పోలీస్ అధికారులు 8 టన్నుల బరువున్న 8 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.

03/13/2017 - 01:31

చిత్రం.. విజయవాడలో ఆదివారం జరిగిన హోలీ వేడుకల్లో ఆట పాటలతో రంగుల్లో తడిసి ముద్దయన యువతీ యువకులు

03/12/2017 - 10:01

అమరావతి, మార్చి 11: ఒకవైపు చేజారుతున్న ఎమ్మెల్యేలు.. మరోవైపు పార్టీ నేతలపై కేసులు.. ఇంకోవైపు తనపై కొనసాగుతున్న విచారణలు. అయినా చెదరని ఆత్మస్థైర్యం. ఆ మొండితనమే పార్టీని ఆరేళ్ల నుంచి జనంలో ఉంచేలా చేసింది. అదే ఆత్మవిశ్వాసం రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా నిలిచేలా చేసింది.

03/12/2017 - 10:00

అమరావతి, మార్చి 11: మన సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదలకు సంబంధించి ఇప్పటివరకు పరిశోధించి సేకరించిన చిహ్నాలు, ఆధారాలు, ఆకృతులను అంశాలవారీగా క్రోడీకరించి వాటిని అమరావతి నిర్మాణంలో నిక్షిప్తం చేయాలని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ సారధ్యంలోని నిపుణుల కమిటీ నిర్ణయించింది.

03/12/2017 - 10:00

విజయనగరం, మార్చి 11: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయులను ఎలా భయబ్రాంతులకు గురిచేస్తున్నారో.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అదే తీరుగా వ్యవహరిస్తున్నారని వైకాపా మహిళా నేత రోజా ఆరోపించారు. శనివారం ఇక్కడ నిర్వహించిన వైకాపా జిల్లా సమీక్ష సమావేశానికి ఆమె, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో మహిళలకు భద్రత, భరోసా, సంక్షేమం కరవైందన్నారు.

03/12/2017 - 09:59

అమరావతి, మార్చి 11: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో ఇక దేశంలో బిజెపిని, ప్రధాని నరేంద్ర మోదీని పట్టుకోవడం కష్టమేనన్న చర్చ తెలుగుదేశం పార్టీలో మొదలయింది. తాజా ఎన్నికల ఫలితాలపై విశే్లషిస్తున్న పార్టీ నేతల్లో ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల తర్వాత ఇక బిజెపి విస్తరణ ఏపి పైనే ఉండవచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది.

03/12/2017 - 09:13

అమరావతి, మార్చి 11: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సొంతం చేసుకున్నందుకు ప్రధాని నరేంద్రమోదీ, భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోనులో శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయస్ఫూర్తితో దేశప్రజలకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాలను అభివృద్ధి చేయాలని కోరారు.

03/12/2017 - 07:45

కాకినాడ/విజయవాడ, మార్చి 11: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా బిజెపి శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశాయి. శనివారం ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.

03/12/2017 - 07:45

ఏలూరు, మార్చి 11: విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడిన రెండున్నరేళ్లలో ఎంతో సాధించామని, రెండంకెల వృద్ధిరేటును సాధించి చూపామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇక్కడ చదువుకునే మన పిల్లలు వేరే ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు రావాలన్నది తమ లక్ష్యమని, దానికోసం ఎంతగానో కృషి చేస్తున్నామన్నారు. ఎన్నో పరిశ్రమలకు శ్రీకారం చుట్టామన్నారు.

Pages