S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/13/2017 - 03:24

ఆళ్లగడ్డ, మార్చి 12 : కర్నూలు జిల్లాలో గొప్ప నాయకుడైన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని కోల్పోయామని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి చెందారన్న విషయం తెలిసిన వెంటనే నారా లోకేష్ హుటాహుటిన ఆళ్లగడ్డకు చేరుకుని భూమా పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు వుంచి ప్రగాఢ సంతాపం తెలిపారు.

03/13/2017 - 03:20

విజయవాడ, మార్చి 12: ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కుల, మతాలకు అతీతంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి గెలిపించడం ప్రజాస్వామ్య విజయంగా మాజీ కేంద్ర మంత్రి, బిజెపి మహిళా మోర్చా జాతీయ ఇన్‌ఛార్జి దగ్గుబాటి పురంధ్రీశ్వరి అభివర్ణించారు. బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

03/13/2017 - 03:19

గుంటూరు, మార్చి 12: నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. వైద్యులు సాధారణ పరీక్షలు నిర్వహించారు. మోకాళ్ల నొప్పులకు సంబంధించి శస్తచ్రికిత్స నిర్వహించాల్సి ఉందని వైద్యులు సూచించారు. రెండురోజుల పాటు పరిశీలనలో ఉంటే తగిన వైద్యం అందించగలమని వైద్యులు తెలిపారు.

03/13/2017 - 03:17

విజయవాడ, మార్చి 12: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భూమా కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు.

03/13/2017 - 03:16

విజయవాడ, మార్చి 12: నంద్యాల శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి హఠాన్మరణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కర్నూలు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఎప్పటికప్పుడు తెలుసుకున్నానని, ఇంతలోనే విషాద వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. భూమా నాగిరెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తుచేశారు.

03/13/2017 - 03:16

విజయవాడ, మార్చి 12: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తన జీవితంతో చివరిసారిగా విజయవాడలో శనివారం గడిపారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపిటీసీ సభ్యులు, కౌన్సిలర్లు భూమా నేతృత్వంలో ఉండవల్లిలోని సిఎం నివాసంలో ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడును కలిశారు. నియోజక వర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరగా, కలిసి కట్టుగా పని చేయాలని సిఎం తెలిపారు.

03/13/2017 - 02:12

విజయవాడ, మార్చి 12: ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చరి త్ర, వారసత్వ సంపదలను నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో నిక్షిప్తం చేయడానికి ఏర్పాటైన నిష్ణాతుల కమిటీ ఏప్రిల్ మొదటి వారంలోగా కసరత్తును పూర్తిచేయాలని నిర్ణయించింది. మలివిడత సమావేశాల్లో భాగంగా ఆదివారం సిఆర్‌డిఏ కార్యాలయంలో వరుసగా రెండోరోజు భేటీ అయిన ఈ కమిటీ పలు అంశాలపై చర్చించింది.

03/13/2017 - 02:10

గుంటూరు, మార్చి 12: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో వ్యూహాత్మక అడుగులు వేయాలని అధికార పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 40 మంది ఎమ్మెల్యేలకు ఆదివారం గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అవగాహన కల్పించారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వివిధ జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, తొలివిడత ఎంపికైన సభ్యులు హాజరై పలు అంశాలపై చర్చించారు.

03/13/2017 - 02:07

భీమవరం, మార్చి 12: చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల సాధనకు పోరాటబాట పట్టాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదా య శాఖ ఉద్యోగులు నిర్ణయించారు. త్వరలో విధుల బహిష్కరించాలని నిర్ణయించారు. పోరాటానికి వీలుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి)లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

03/13/2017 - 02:04

హైదరాబాద్, మార్చి 12: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపికి ఘోర పరాజయం తప్పదని, వైకాపా అధికారంలోకివస్తుందని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఇక్కడ లోటస్‌పాండ్ కార్యాలయంలో వైకాపా వ్యవస్ధాపక దినోత్సవం సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఎగురవేసి మాట్లాడారు.

Pages