S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/21/2017 - 04:52

సీలేరు, జనవరి 20: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఒడిశా డిజిపి కెవి సింగ్, డిఐజి షైనీ విస్తృతంగా ఏరియల్ సర్వే నిర్వహించారు. మల్కన్‌గిరి జిల్లా కుడుముల గుమ్మా బ్లాక్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఒడిశా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

01/21/2017 - 04:51

విజయవాడ, జనవరి 20: వెలగపూడి సచివాలయంలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవన నిర్మాణాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ శుక్రవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులు వేగంగా జరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 28 నాటికి భవన నిర్మాణం పూర్తి అవుతుందని, 29న ప్రభుత్వానికి కాంట్రాక్టరు అప్పగిస్తారని తెలిపారు. స్పీకర్‌తో ఈ భవనాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

01/21/2017 - 04:25

విజయవాడ, జనవరి 20: విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం 2016 కింద వివిధ సంక్షేమ పథకాల్లో 5 శాతం నిధులను వీరికి కేటాయించా ల్సి ఉంటుందని రాష్ట్ర మహిళా సాధికారత, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం వెలగపూడి సచివాలయంలో శుక్రవారం జరిగింది.

01/21/2017 - 04:22

విజయవాడ, జనవరి 26: పోలవరం ప్రాజెక్టు గేట్లు, డయాఫ్రం వాల్ పనులు ఈ నెల 29 నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ ఇప్పటికే ఇం దుకు సంబంధించిన డిజైన్లను కేంద్ర జల సంఘం ఖరారు చేసిందన్నారు. ఒక ఒక బ్లాక్, ఒక పిల్లర్ నిర్మాణం పూర్తి అయిన తరువాత పూర్తి స్థాయి లో డిజైన్‌పై స్పష్టత వస్తుందన్నారు.

01/21/2017 - 04:21

విజయవాడ, జనవరి 20: రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన కోసం పరిశ్రమల స్థాపనకై భారీగా పెట్టుబడుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు క్షణం తీరిక లేకుండా దేశ విదేశాల్లో తిరుగుతున్నారు. అయితే ఆయన వ్యవహారశైలి ఎలా ఉందంటే ఏనుగులు పోయే దారి వదిలి... చీమలు వెళ్లే దారి కోసం వెతుకుతున్నట్లుగా వుంది..

01/21/2017 - 04:21

విజయవాడ, జనవరి 20: రాష్ట్ర ప్రభుత్వ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (ఎపి ఎన్‌జివో అసోసియేషన్) రాష్ట్ర సంఘానికి ఫిబ్రవరి 19వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారి కె.దాలినాయుడు శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసారు.

01/21/2017 - 04:20

విజయవాడ (క్రైం), జనవరి 20: రాష్ట్రంలో 11మంది డిఎస్పీలకు పోస్టింగ్‌లు లభించాయి. వీరిలో పలువురుకి స్థానం చలనం కలిగింది. వెయిటింగ్‌లో ఉన్న ఎక్కువ మందికి కొత్త పోస్టింగ్‌లు ఇస్తూ డిజిపి కార్యాలయం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న కె కృష్ణప్రసన్న, ఎస్‌వి మాధవరెడ్డిలను పిసిఎస్ అండ్ ఎస్ విభాగంలో పోస్టింగ్‌లు ఇచ్చారు.

01/21/2017 - 04:20

విజయవాడ, జనవరి 20: రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ఫారెస్టు అకాడమీ శాఖను తిరుపతిలో ఏర్పాటు చేయాలని అధికారులను రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకతిక శాఖల మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆదేశించారు. వెలగపపూడి సచివాలయంలో ఆయన శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటవీ సిబ్బందికి శిక్షణ వంటివి నిర్వహించేందుకు ఈ కేంద్రం ఉపయోగంగా ఉంటుందని ఆయన తెలిపారు.

01/21/2017 - 04:19

తిరుపతి, జనవరి 20: స్వాతంత్రోద్యమ కాలంలో తానునమ్మిన అహింసావాదంతోనే మహాత్మగాంధీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని గాంధీజీ మనవడు, కేంద్రసాహిత్య అవార్డు గ్రహీత రాజ్‌మోహన్ గాంధీ అన్నారు. శుక్రవారం తన సతీమణి ఉషామోహన్‌గాంధీతో కలసి తిరుపతిలోని భారతీయ విద్యాభవన్స్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయానికి చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయన్ను దుశ్శాలువతో కప్పి సన్మానించి, జ్ఞాపికతో సత్కరించారు.

01/21/2017 - 04:18

విజయవాడ, జనవరి 20: ఎన్‌టిఆర్ విదేశీ విద్యాదరణ పథకం కింద విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయల మంజూరు చేసి వేలాది మంది విద్యార్థులకు సహాయం అందిస్తున్నామని బిసి సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పొట్టిశ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్‌టిఆర్ విదేశీ విద్యాదరణ పథకం కింద అర్హులైన విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు.

Pages