S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/22/2016 - 07:41

విశాఖపట్నం, డిసెంబర్ 21: కోస్తాను చలి వణికిస్తోంది. గత రెండు రోజులుగా కోస్తాలో ముఖ్యంగా విశాఖ పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్న వాతావరణ మార్పులు చలి తీవ్రతను మరింత పెంచాయి. గత రెండు రోజులుగా విశాఖ ఏజె న్సీ లంబసింగి, చింతపల్లి, పాడేరు, మోదకొండమ్మ పాదాలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళ, బుధవారాల్లో లంబసింగిలో 3,4 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

12/22/2016 - 05:46

విజయవాడ, డిసెంబర్ 21: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నిధుల విడుదల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల నుంచి కేంద్రంపై తీసుకువచ్చిన ఒత్తిడి ఫలించింది. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిన పోలవరం నిర్మాణానికి దాదాపురూ.40వేల కోట్ల మేరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో దాదాపు 20 వేల కోట్ల రూపాయలు పునరావాసానికి ఖర్చు చేయనున్నారు.

12/22/2016 - 05:45

అమరావతి, డిసెంబర్ 21: వారంతా ఇప్పటివరకూ నౌకర్లు, చాకర్లు, వాళ్లు కాకపోతే పీఏలను పురమాయించి సరకులు తెప్పించుకుంటున్నారు. అదీ కాకపోతే భార్యామణుల చేతికి డబ్బులిచ్చి కావలసినవి తెచ్చుకునేవారు. కానీ, ఇప్పుడిక డిజిటల్ యుగం వచ్చేసింది. దానికితోడు ముఖ్యమంత్రి చంద్రబాబు నగదురహిత కొనుగోలు, ఈపోస్, ఆధార్ ఆధారిత నగదు రహిత కొనుగోళ్ల విప్లవం ప్రారంభించారు.

12/22/2016 - 05:43

విజయవాడ, డిసెంబర్ 21: ‘రాష్ట్రంలో నగదు కొరతను నివారించటానికి, నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను అధిగమించటానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకుంది. అందులో భాగంగా ఈ పోస్, రూపే కార్డులు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు పెద్ద ఎత్తున జరగడానికి చర్యలు తీసుకున్నాం. ఇంకా మొబైల్ ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు జరపటానికి ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

12/21/2016 - 05:25

విజయవాడ, డిసెంబర్ 20: విద్యుత్ పొదుపుతో పాటు సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలోనూ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలో వుందని రాష్ట్ర ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్ తెలిపారు. ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

12/21/2016 - 05:25

అమరావతి, డిసెంబర్ 20: ఎప్పుడూ తనదైన శైలిలో మాట్లాడి వార్తల్లో ఉండే అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన చంద్రబాబునాయుడు పనితీరు, కార్యకర్తల పరిస్థితి, సీఎంపేషీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మంగళవారం జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల వర్క్‌షాప్‌లో పాల్గొని మధ్యలో బయటకు వచ్చిన జెసిని అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు పలకరించారు.

12/21/2016 - 05:24

విశాఖపట్నం, (జగదాంబ) డిసెంబర్ 20: తెలుగుభాష వికాసానికి, అభివృద్ధికి, తెలుగుభాషా వ్యాప్తికి ప్రభుత్వం ప్రత్యేక సమితి ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ఆంధ్రాయూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసెంబ్లీ హాల్‌లో ఈనెల 18 నుండి 20 వరకు మూడు రోజులపాటు నిర్వహించే తెలు గు తిరునాళ్ళు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

12/21/2016 - 05:24

తిరుపతి, డిసెంబర్ 20: దేశంలో గో హత్యలను అడ్డుకోవడంలో కేంద్రం విఫలమైందని, అందుకే దేశంలో అశాంతి నెలకొందని విశా ఖ శారదాపీఠం అధిపతి స్వరూపానంద సరస్వతి స్వామి అన్నారు. మంగళవారం శ్రీవారి దర్శనార్థం ఆ యన తిరుమలకు వచ్చారు. ఆయన తన శిష్యగణంతో ఆలయ మహద్వారం వద్దకు రాగానే ఆలయ అర్చకులు, జెఇఓ శ్రీనివాసరాజులు ఆయనకు ఇస్తికపాల్ స్వాగతం ఘనంగా పలికారు.

12/21/2016 - 05:23

రాజమహేంద్రవరం, డిసెంబర్ 20: అమెరికాలో ఉంటున్నా అయినవారిని మర్చిపోమని, మనవాళ్లంతా బాగుండాలనేదే తానా తాపత్రయమని తానా అధ్యక్షుడు డాక్టర్ వి. చౌదరి జంపాల పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆనం కళా కేం ద్రంలో మంగళవారం తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తానా చైతన్య స్ర వంతి పేరిట జానపద కళాఉత్సవం వైభవంగా నిర్వహించారు.

12/21/2016 - 03:56

విజయవాడ, డిసెంబర్ 20: ఇకపై సామాజిక పింఛన్లకు సంబంధించి డబ్బును బ్యాంక్‌లకు ఇవ్వనని చెప్పానని, పాత పద్ధతిలోనే పింఛన్లను పంపిణీ చేస్తామని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో మంగళవారం జరిగిన టిడిపి ప్రజాప్రతినిధుల వర్కుషాపులో ఆయన నోట్ల రద్దు వల్ల ఎదురైన పరిస్థితులను ప్రస్తావించారు. నోట్ల రద్దుతో డబ్బులు లేని పరిస్థితి నెలకొందన్నారు.

Pages