S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/20/2016 - 04:35

కర్నూలు, డిసెంబర్ 19: ఇంత కాలం నిత్యావసర వస్తువుల కొరత పేరుతో అక్రమాలకు వ్యాపారులు తెరలేపగా తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే అత్యధిక మంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా నగదుకు కూడా కృత్రిమ కొరత ఏర్పడిందని కొంత మంది బ్యాంకు సిబ్బంది వాపోతున్నారు.

12/20/2016 - 04:34

భద్రాచలం, డిసెంబర్ 19: పక్క రాష్ట్రాలైన చత్తీస్‌గఢ్, ఒడిశాలతో కలిసి పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని మహబూబాబాద్ ఎంపి ప్రొఫెసర్ సీతారామ్ నాయక్ చెప్పారు. సోమవారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ గిరిజనుల హక్కులు, మనోభావాలకు భిన్నంగా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు.

12/20/2016 - 04:33

భీమవరం, డిసెంబర్ 19: ఆక్వా రైతాంగానికి ఆదాయ పన్ను మినహాయింపు లభించేలా కృషిచేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. ఈ రంగంలో కూడా సన్న, చిన్నకారు రైతులున్నారని, వారి కోసం నిబంధనలు సడలించి, వరి రైతు తరహాలో ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్నారు. ఆక్వా రైతాంగాన్ని కూడా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేర్చాలని కోరతామన్నారు.

12/20/2016 - 04:33

విజయవాడ, డిసెంబర్ 19: రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి చట్టబద్ధతపై క్యాబినెట్ నోట్‌ఫైల్ సిద్ధమైందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసంలో సోమవారం ఆయన చంద్రబాబును కలిసి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్యాకేజీకి చట్టబద్ధత త్వరలోనే వస్తుందని సుజనా చౌదరి చెప్పారు. రానున్న క్యాబినెట్ సమావేశంలో ఇందుకు ఆమోదం లభిస్తుందని స్పష్టం చేశారు.

12/20/2016 - 04:32

హైదరాబాద్, డిసెంబర్ 19: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ , ప్రైవేటు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు జనవరి 7నుండి ప్రారంభం కానున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం ఈమేరకు వార్షిక ప్రణాళికలో మార్పులు చేయనున్నారు. సంక్రాంతి సెలవులు 7 నుండి మొదలై 15వ తేదీ వరకూ ఉంటాయని పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు చెప్పారు.

12/20/2016 - 04:32

తిరుపతి, డిసెంబర్ 19: తిరుపతికి చెందిన ఓ మహిళ సోమవారం తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో జారి పడి మృతి చెందింది. మృతదేహాన్ని భక్తులు గుర్తించి టిటిడి అధికారులకు సమాచారం ఇవ్వడంతో జె ఇ ఓ శ్రీనివాసరాజు అధికారులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలుపలికి తీశారు. ఆమె మెడలోవున్న గుర్తింపు కార్డు ఆధారంగా ఆమె పేరు నాగరత్న(35)గా గుర్తించారు.

12/20/2016 - 05:41

విశాఖపట్నం, డిసెంబర్ 19: వెనుకబాటు తనాన్ని రూపుమాపకుండా ప్రాంతాల మధ్య వివక్ష చూపితే రాష్ట్రాల్లో వేర్పాటు వాదం మొదలవుతుందని పిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. విశాఖలో శనివారం జరిగిన ఉత్తరాంధ్ర కాంగ్రెస్ కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు తెలంగాణ వాదం బలంగా విన్పించగా, చివరకు రాష్ట్రం రెండుగా చీలిపోయిందన్నారు.

12/20/2016 - 04:28

రేణిగుంట, డిసెంబర్ 19: చిత్తూరు జిల్లా రేణిగుంట మండల పరిధిలో అక్రమంగా ఎర్రచందనం చెట్లు నరికేందుకు వెళ్తున్న తమిళ ఎర్రకూలీలు 23 మందిని అరెస్ట్‌చేసి వారు దాచిపెట్టిన ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.

12/20/2016 - 04:27

రాజమహేంద్రవరం, డిసెంబర్ 19: పోలవరం నిర్వాసితులకు పునరావాస పునర్నిర్మాణ చట్టం (ఆర్ అండ్ ఆర్) ప్రకారం ఇవ్వాల్సిన భూమికి భూమి వ్యవహారంలో మాయ జరుగుతోంది. ఆర్ అండ్ ఆర్ ప్రకారం నిర్వాసితుల నుండి తీసుకున్న వ్యవసాయ భూమికి బదులుగా వేరే ప్రాంతంలో భూమిని ఇవ్వాల్సివుంది. అయితే నిర్వాసితులకు ఎటువంటి భూమి ఇప్పటివరకు ఇవ్వకపోయినా రికార్డుల్లో మాత్రం వారికి భూమి ఇచ్చినట్టు నమోదుచేస్తునట్టు వెలుగులోకి వచ్చింది.

12/20/2016 - 04:22

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: బాలలహక్కుల పరిరక్షణ కోసం గట్టి చర్యలు తీసుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తెలిపింది. ఏపిలో బాలల హక్కుల కమిషన్ బెస్ట్ ప్రాక్టీస్‌పై ఢిల్లీలో మూడు రోజులుగా జరుగుతున్న సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జ్ చైర్‌పర్సన్ ఎస్ బాలరాజు, సభ్యుడు ఎస్ మురళీధరరెడ్డి నివేదించారు. ఏపిలో బాలల హక్కుల ఉల్లంఘనలపై అందిన కేసులపై విచారణ జరిపినట్టు బాలరాజు వెల్లడించారు.

Pages