S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/23/2016 - 02:17

చిత్రం..క్రిస్మస్ సందర్భంగా రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో గురువారం జరిగిన కేరల్స్ కార్యక్రమంలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు కేక్ తినిపిస్తున్న యువతి

12/23/2016 - 02:14

కుందుర్పి, డిసెంబర్ 22: ఒకరి పక్కన ఒకరు నిలుచుని నీళ్ల బిందెలు, బక్కెట్లు అందుకుంటున్న ఈ బాలికలు అనంతపురం జిల్లా కుందుర్పిలోని కస్తూరిబా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు. నాలుగురోజుల క్రితం పాఠశాలలో బోర్ పాడవడంతో నీటికి కటకట ఏర్పడింది. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక వీరంతా ఇలా అరకిలోమీటరు దూరంలోని ట్యాంకు నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు.

12/23/2016 - 02:12

నెల్లూరు, డిసెంబర్ 22: నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సులో విదేశీ పక్షులను తిలకించే ఉద్దేశంతో ఈనెల 27నుంచి మూడురోజులపాటు ఫ్లెమింగ్ ఫెస్టివల్ పేరిట ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించింది.

12/23/2016 - 02:10

విజయవాడ (బెంజిసర్కిల్), డిసెంబర్ 22: వందల సంవత్సరాల చరిత్ర.. లక్షలాది మంది కళాకారుల కృషి.. ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన తెలుగువారి ప్రాచీన నృత్య కళాతోరణం కూచిపూడి నాట్యం మరోసారి తన సత్తాను ప్రపంచం ముందు ఆవిష్కరించేందుకు సిద్ధమయింది.

12/23/2016 - 02:09

ఒంగోలు, డిసెంబర్ 22: ప్రకాశం జిల్లాలోని పంచాయతీరాజ్ శాఖాధికారులపై అవినీతి నిరోధక శాఖాధికారులు ఏకకాలంలో గురువారం ముమ్మర దాడులు చేశారు. ఒంగోలు పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఇఇ మెండు వెంకటేశ్వర్లు, చీరాలకు చెందిన పంచాయతీరాజ్ జూనియర్ ఇంజనీరు కట్టా ఏలిషా కాంట్రాక్టర్ల వద్ద లంచాలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

12/23/2016 - 02:07

బొబ్బిలి, డిసెంబర్ 22:ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని ఇరాన్‌కు వెళ్లిన బొబ్బిలికి చెందిన కొంతమంది కూలీలు పరాయి దేశంలో పని దొరక్క, తిండీ తిప్పలు లేక అల్లాడుతున్న వైనం వెలుగు చూసింది. బొబ్బిలి మండలం పిరిడి, రంగరాయపురం, చెల్లారుపువలస గ్రామాలకు చెందిన కొంతమంది కష్టజీవులు నాలుగు నెలల క్రితం ఉపాధి వెతుక్కుంటూ ఇరాన్ వెళ్లారు.

12/23/2016 - 02:07

విజయవాడ, డిసెంబర్ 22: ఆన్‌లైన్‌లో లావాదేవీల విషయంలో ఐఎఎస్ అధికారులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ఆధార్ ఆధారిత, నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా బందర్ రోడ్డులో చాలా దుకాణాల్లో ఈ-పోస్ మిషన్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

12/22/2016 - 07:20

విజయవాడ, డిసెంబర్ 21: ఇకపై సముద్ర సంపదపై దృష్టి సారించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. సముద్ర సంపదను ఎలా ఉపయోగించుకోవాలన్న అంశంపై డ్రెడ్జింగ్ కార్పొరేషన్ నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. విజయవాడలో రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సదస్సు ప్రారంభంలో మాట్లాడుతూ గతంలో హైదరాబాద్‌లో ఐటి ఆధారిక అభివృద్ధిపై దృష్టి సారించామని, ఇప్పడు సముద్ర ఆధారిక అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు.

12/22/2016 - 07:19

గుంటూరు, డిసెంబర్ 21.. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అతి చేరువలో ఉన్న నిజాంపట్నం పోర్టు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. విస్తరణ విషయంలో ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కించడంతో ఆటుపోట్లను ఎదుర్కొంటోంది.. హార్బర్ విస్తరణకు గత దశాబ్దాల కాలంగా చేసిన ప్రతిపాదనలు అటకెక్కుతున్నాయి..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోర్టు ఆథారిత పరిశ్రమలపై దృష్టిసారించిన నేపథ్యంలో నిజాంపట్నంకు మహర్దశ పడుతుందని భావించారు.

12/22/2016 - 07:16

విజయవాడ, డిసెంబర్ 21: పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రానికి 30 శాతం మేర ఆదాయం తగ్గిందని రాష్ట్ర ఆర్ఢిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. విజయవాడలో ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉందన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో లావాదేవీలు తక్కువగా ఉన్నాయన్నారు. పర్యాటక రంగంలో వృద్ధి నమోదైందన్నారు.

Pages