S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/12/2016 - 05:21

విజయవాడ, డిసెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టులో దాదాపు 10 లక్షల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీటును వినియోగించనున్నారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో కాంక్రీటును వినియోగించిన ప్రాజెక్టులు లేవు. పోలవరం ప్రాజెక్టును బహుళార్థ సాధక ప్రాజెక్టుగా దాదాపు 40 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు.

12/12/2016 - 05:16

విజయవాడ, డిసెంబర్ 11: వెనుకబడిన తరగతుల సబ్ గ్రూప్-డి కింద అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నివసించే అగముద్దీన్, అగముదీర్, అగముదీ వెల్లలార్, అగముదీ మొదిలియార్ (తుళువ వెల్లలాస్‌తో కలిపి) సామాజిక వర్గ, కులాలకు చెందిన వారిని ‘మొదలియార్’గా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2008లోనూ దీనిపై వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది.

12/12/2016 - 05:16

విజయవాడ, డిసెంబర్ 11: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా 16 వేల ఈ-పోస్ మిషన్ల కోనుగోలుకు ఎపిఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. రూపే, క్రెడిట్, డెబిట్ కార్డులను అంగీకరించేందుకు నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఎండి మాలకొండయ్య తెలిపారు. ఈ-పోస్ యంత్రాలను తెలుగువెలుగు, సిటి బస్సులు, ఎక్స్‌ప్రెస్, ఎసి, అమరావతి, తదితర సర్వీసుల్లో ప్రవేశపెట్టనున్నారు.

12/12/2016 - 05:15

విజయవాడ, డిసెంబర్ 11: పెద్దనోట్ల రద్దుతో పేదోళ్లు, సామాన్యులు ఇంకా కోలుకోలేదని, నెలరోజులు దాటినా బ్యాంకులు, ఏటిఎంల ఎదుట ప్రజలు క్యూలు కడుతున్నారని, కొన్ని సందర్భాల్లో తోపులాట జరగడంతో పలువురికి గాయాలవుతున్నాయని ఎపిపిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

12/12/2016 - 05:15

కర్నూలు సిటీ, డిసెంబర్ 11 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కౌంట్‌డౌన్ మొదలైందని, ఎక్కువ కాలం ప్రజలు ఓపికతో ఉండలేరని ఖచ్చితంగా తగిన బుద్ధి చెబుతారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి జోస్యం చెప్పారు. కర్నూలు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం డిసిసి అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

12/12/2016 - 05:14

హిరమండలం, డిసెంబర్ 11: శ్రీకాకుళం జిల్లాలో కొద్ది రోజులుగా గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా, హిరమండలం మండలంలోని రుగడ గ్రామ పంచాయతీ పరిధిలోని బొమ్మికగూడ గిరిజన గ్రామంలో 13 పూరిళ్లును ధ్వంసం చేశాయి. క్రైస్తవ మందిరాన్ని, పంటలను ధ్వంసం చేశాయి. దీంతో ప్రమాదం అంచుల్లో ఉన్న గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. బొమ్మికగూడ గిరిజన గ్రామం కొండప్రాంతానికి సమీపంలో ఉంది.

12/12/2016 - 05:14

కందుకూరు, డిసెంబర్ 11: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగాల్సి ఉన్న పలు కార్పొరేషన్లు, పురపాలక సంఘాలకు త్వరలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆదివారం ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. కోర్టు వివాదాలు, రిజర్వేషన్లు తదితర సమస్యలపై కొన్ని కోర్టు పరిధిలో ఉన్న కారణంగా ఎన్నికలు నిలిచిపోయాయని అన్నారు.

12/12/2016 - 03:00

మచిలీపట్నం, డిసెంబర్ 11: బందరు పోర్టు భూసేకరణ వ్యతిరేక ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళతానని రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు చెప్పారు. కృష్ణా జిల్లా బందరు మండలంలోని పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో ఆదివారం పర్యటించిన ఆయన పోర్టు పేరుతో జరుగుతున్న ప్రభుత్వ భూదోపిడీని ఎదుర్కొని రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

12/12/2016 - 02:50

విజయవాడ, డిసెంబర్ 11: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు భాగస్వాములై ప్రతినెలా కనీసం వెయ్యి నుంచి రెండు వేల కోట్ల ఆస్తులను వేలం వేయించడం ద్వారా బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని బాధితుల సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేసారు. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తున్నామని తెలిపారు.

12/11/2016 - 07:11

విజయవాడ, డిసెంబర్ 10: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు, అన్నాడిఎంకె నేత శేఖర్‌రెడ్డి, అతని బంధువుల ఇళ్లల్లో ఆదాయం పన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం పట్టుబడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. టిటిడి పాలక మండలి నుంచి శేఖర్‌రెడ్డిని తొలగించాలని అధికారులను ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

Pages