S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/12/2016 - 05:23

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 11: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కాపు ఉద్యమాన్ని నిర్మించాలని కాపు నేతలు నిర్ణయించారు. జాయింట్ యాక్షన్ కమిటీలు (జెఎసి) ఏర్పాటుచేసి, క్షేత్రస్థాయిలో ఉద్యమ నిర్మాణ వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం 13 జిల్లా కాపు ప్రతినిధుల సమావేశం జరిగింది.

09/12/2016 - 05:14

విశాఖపట్నం, సెప్టెంబర్ 11:పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, ఒడిశాను ఆనుకొని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

09/12/2016 - 01:28

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ప్రత్యేక హోదా సెంటిమెంట్ కాదని, ఇందులో ఎకనామిక్స్ ఉందని, తెలంగాణ ఉద్యమంలో సెంటిమెం ట్ ఉందని, ఎకనామిక్స్ లేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. హోదా కంటే ప్యాకేజీ వల్ల రాష్ట్రం లో మంచి అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రత్యేక ప్యాకేజీని ఏడాదిన్నర క్రితం తెచ్చి ఉంటే బాగుండేదని, ఆలస్యమైందని ఆయన అన్నా రు.

09/11/2016 - 23:50

విజయవాడ/గుంటూరు, సెప్టెంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించి విభజన హామీలన్నింటిని అమలుచేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి, కాంగ్రెస్, వైసిపి ఆధ్వర్యంలో శనివారం జరిగిన రాష్ట్ర వ్యాప్త బంద్ ఎంతో ప్రశాంతంగా, స్వచ్ఛందంగా విజయవంతమైంది.

09/11/2016 - 23:48

హైదరాబాద్, సెప్టెంబర్ 10: అది మధురమైన జ్ఞాపకాలకు,ఘటనలకు మరపురాని వేదిక. రెండు మహా ఉద్యమాలను చవిచూసింది. ఎందరెందరో మహామహులను తెలుగు రాష్ట్రాలకు అందించింది. వెన్నుపోటు చరిత్రను చూసింది అక్కడే. ప్రజాస్వామ్యాన్ని కాపాడి చరిత్రను తిరగరాసిందీ అక్కడే. మడపతిప్పని యోధులను తయారుచేసింది అక్కడే. రాజకీయ చాణక్యుల ఆలోచనలకు పదును మొదలయిందీ అక్కడే.

09/11/2016 - 23:45

విశాఖపట్నం, సెప్టెంబర్ 10: రాష్ట్ర విభజన విషయంలో బిజెపి వైఖరిని ద్రోహంగా పేర్కొంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆనాటి విభజన పాపంలో మీ అన్న చిరంజీవి పాత్రను గుర్తుకు తెచ్చుకోవాలని బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి హితవు పలికారు.

09/11/2016 - 23:44

కాకినాడ/ఏలూరు, సెప్టెంబర్ 10: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలన్న డిమాండ్‌తో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పిలుపుమేరకు ఉభయ గోదావరి జిల్లాల్లో శనివారం బంద్ ప్రశాంతంగా ముగిసింది. వామపక్ష పార్టీలు కూడా ఈ బంద్‌లో పాల్గొన్నాయి. కాకినాడ సహా పలుచోట్ల బంద్‌ను విజయవంతం చేసేందుకు వైకాపా, వామపక్ష పార్టీలు కృషి చేశాయి.

09/11/2016 - 23:42

విశాఖపట్నం/శ్రీకాకుళం/విజయనగరం, సెప్టెంబర్ 10: రాష్ట్రానికి ప్రత్యేక హోదా స్థానే ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం, అందుకు సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా కాంగ్రెస్, వైకాపా, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర బంద్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాక్షికంగా, ప్రశాంతంగా జరిగింది.

09/11/2016 - 23:40

కడప/అనంతపుం.కర్నూలు, సెప్టెంబర్ 10: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైకాపా, వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం సీమలో బంద్ ప్రశాంతగా జరిగింది. కడప ,అనంతపురం, కర్నూలు జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరిగింది. పలువురు వైకాపా, కాంగ్రెస్, వామపక్షాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

09/11/2016 - 18:51

విజయవాడ: కాపులను బీసీల్లో చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలగా ఉన్నట్లు, ముద్రగడ పద్మనాభం తీరుతో కాపులు అప్రతిష్ఠ పాలవుతున్నారని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం విమర్శించారు. ముద్రగడలా రైలు తగలబెట్టించే సంస్కృతికి మాత్రం దిగజారబోమన్నారు. తుని ఘటనతో వైకాపా నాయకుడు భూమన కరుణాకర్‌రెడ్డికి సంబంధం ఉందని ఆయన స్పష్టం చేశారు.

Pages