S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/25/2016 - 06:20

నెల్లూరుటౌన్, ఆగస్టు 24 : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో చేపడుతున్న స్విస్ ఛాలెంజ్ విధానంలో మార్పులు చేయాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి డిమాండ్ చేశారు.

08/25/2016 - 06:19

అమలాపురం, ఆగస్టు 24: మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వ్యవహార శైలి కాపు జాతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. తునిలో రైలు, పోలీసు స్టేషన్ దగ్ధం ఘటనలో సంబంధం ఉన్న ఏడుగురు వ్యక్తుల ఆరెస్టుకు నిరసనగా ముద్రగడ దీక్ష చేపట్టి, 70 కేసులు నమోదుకు కారకుడయ్యారన్నారు.

08/25/2016 - 06:18

కొల్లిపర/ తెనాలి రూరల్, ఆగస్టు 24: గుంటూరు జిల్లా కొల్లిపర మండలం సిరిపురం- నేలపాడు రోడ్‌లో బుధవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

08/25/2016 - 06:09

హైదరాబాద్, ఆగస్టు 24: తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ విధానంపై ఒక భవన నిర్మాణ సంస్థ వేసిన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేయటం సర్కారుకు ఆందోళనగా మారింది.

08/25/2016 - 06:05

విశాఖపట్నం, ఆగస్టు 24: విశాఖలో బుధవారం సాయంత్రం స్వల్పంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సాయంత్రం 4.05 గంటల నుంచి 4.15 గంటల మధ్య రెండుసార్లు భూమి స్వల్పంగా కంపించింది. అయితే రిక్టర్ స్కేల్‌పై ఈ ప్రకంపనలు నమోదు కాలేదు. సాగర్‌నగర్, ఎంవిపి కాలనీ, వెంకోజీపాలెం, అక్కయ్యపాలెం, ప్రాంతాల్లో 10 నిముషాల కాల వ్యవధిలో రెండుసార్లు నాలుగు సెకన్లపాటు భూమి కంపించింది.

08/25/2016 - 00:46

అమలాపురం, ఆగస్టు 24: శాసన సభ వర్షకాల సమావేశాలు సెప్టెంబర్ 8 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమవుతాయని రాష్ట్ర ఆర్థిక శాఖ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. అమరావతిలోనే వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని భావించినా పూర్తి స్థాయి సౌకర్యాలు లేని కారణంగా సమావేశాలు ఈసారి హైదరాబాద్‌లోనే నిర్వహిస్తామన్నారు.

08/25/2016 - 00:44

విజయవాడ, ఆగస్టు 24:‘‘కృష్ణా పుష్కరాల విజయవంతంలో నా జీవితంలో ముందెన్నడూ లేని సంతోషం, ఆనందం చోటు చేసుకుంది. నాలోనే కాదు పుష్కర విధులు నిర్వర్తించిన ప్రతి ఒక్కరి ముఖారవిందాల్లోనూ కన్పిస్తోంది. ఈ కిక్ ఇలానే నిరంతరం కొనసాగిస్తూ రాష్ట్భ్రావృద్ధి కోసం పాటుబడాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘నేను టీంలీడర్‌ను మాత్రమే...

08/24/2016 - 16:41

విశాఖ : విశాఖ నగరంలో బుధవారం సాయంత్రం 4:08 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. నాలుగు సెకన్ల తర్వాత పరిస్థితి సర్దుమణగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

08/24/2016 - 16:27

హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్ నయీంతో సంబంధాలున్నాయని ఏపీ మంత్రిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని నిర్మాత నట్టికుమార్ బుధవారం స్పష్టం చేశారు. విశాఖకు చెందిన జగ్గిరెడ్డి వేలకోట్లు సంపాదించింది- నయీం, ఏపీ మంత్రి అండతో కాదా? అని ప్రశ్నించారు. తాను అప్పు తీసుకున్న మాట వాస్తవమేనని, అప్పు వసూలుకు నయీం ద్వారా నన్ను బెదిరించారని , సీబీఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు.

08/24/2016 - 14:23

విశాఖ : 4,009 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ బుధవారం వెల్లడించారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్లైన్ పద్దతిలో నిర్వహిస్తామని, ప్రతి ఏడాది పరీక్షల ఇయర్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు.

Pages