S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/04/2016 - 07:38

విజయవాడ, ఆగస్టు 3: ప్రత్యేక హోదాకై సిఎం, కేంద్ర మంత్రుల నివాస గృహాల ఎదుట రోడ్లు ఊడ్చాలంటూ పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు నందిగామ సమీపంలోని పొన్నవరంలోని కేంద్ర మంత్రి సుజనా చౌదరి నివాస గృహం ఎదుట రోడ్లను యువజన కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో చీపుర్లు చేతబట్టి ఊడ్చారు. గ్రామస్థులంతా తరలివచ్చి ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు.

08/04/2016 - 07:37

అద్దంకి, ఆగస్టు 3: ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఆది నుండి టిడిపిలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. బుధవారం బల్లికురవ మండల కేంద్రంలో పింఛన్ల పంపిణీలో చోటుచేసుకున్న ఉద్రిక్తత ఘటనలే నిదర్శనం.

08/04/2016 - 07:35

విజయవాడ, ఆగస్టు 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజల్లోకి తీసుకువెళ్లి, వాటికి ప్రచారం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడ సిఎం క్యాంపు కార్యాలయంలో సంక్షేమ పథకాలపై ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. సంక్షేమ శాఖల్లోని పథకాలన్నీ ఏకరూపత కలిగి ఉండాలని దిశా నిర్దేశం చేశారు.

08/04/2016 - 07:28

తిరుమల, ఆగస్టు 3: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని కృష్ణమ్మకు సమర్పించేందుకు తిరుమల వేంకటేశ్వర స్వామివారి సారెతో కూడిన పుష్కర యాత్రను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు బుధవారం తిరుమలలో ప్రారంభించారు. ముందుగా శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలను ఆలయం నుంచి శ్రీవారి వైభవోత్సవ మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు.

08/04/2016 - 07:26

రాజమహేంద్రవరం, ఆగస్టు 3: ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా గత ఏడాది 15వేల మందికి లబ్ధిచేకూర్చామని, ఈఏడాది 35వేల మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించామని కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

08/04/2016 - 07:25

హైదరాబాద్, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తులో అద్భుతమైన నగరంగా అవతరించేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, ప్రపంచ శ్రేణి నగరంగా ఎదిగే సామర్థ్యం ఉందని గ్లోబల్ ప్రోపర్టీ కనె్సల్టెంట్స్ నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. అమరావతి వ్యూహాత్మకమైన ప్రాంతంలో ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతాల్లో వౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు అనేక కంపెనీలు నిమగ్నమై ఉన్నాయని పేర్కొంది.

08/04/2016 - 07:24

విజయవాడ, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు ఒక విధానాన్ని రూపొందించేందుకు ఐదుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటుచేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఉత్తర్వులు జారీచేశారు.

08/04/2016 - 06:19

విజయవాడ, ఆగస్టు 3: రాష్ట్ర ప్రభుత్వం ఏటా రైతులకిచ్చే వ్యవసాయ రుణాల మొత్తాన్ని భారీగా పెంచింది. 2016-17 సంవత్సరానికి గాను మొత్తం 83 వేల కోట్ల రూపాయల రుణాలు అందజేయాలని నిర్ణయించింది.

08/04/2016 - 06:05

హైదరాబాద్, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ -2 సర్వీసులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలన్న పబ్లిక్ సర్వీసు కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. అందుకు సంబంధించి సిలబస్‌ను సైతం ప్రభుత్వం ఆమోదించింది. గ్రూప్-2 అభ్యర్ధులకు ఆన్‌లైన్‌లోనే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

08/04/2016 - 06:04

విజయవాడ, ఆగస్టు 3: ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్స వేడుకలను అనంతపురంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల నిర్వహణ కోసం రెండు కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Pages