S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/25/2016 - 12:34

గుంటూరు: సాంకేతికత సాయంతోనే రాష్ట్రాన్ని అభివృద్థి పథంలో నడిపిస్తున్నామని సిఎం చంద్రబాబు చెప్పారు. వెలగపూడిలో సోమవారం ఉదయం తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి తాత్కాలిక సచివాలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. జూన్ 15 నాటికి భవన నిర్మాణాలన్నీ పూర్తవుతాయన్నారు.

04/25/2016 - 12:32

గుంటూరు: రాష్ట్రంలో రైతులకు రెండో విడత రుణమాఫీ కింద 3,250 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఎపి సిఎం చంద్రబాబు సోమవారం ఉదయం సంతకం చేశారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం ప్రారంభం సందర్భంగా రుణమాఫీ ఫైలుపై ఆయన సంతకం చేసి, రాజధాని నిర్మాణానికి తనపై ఎంతో నమ్మకం ఉంచి రైతులు భూములు ఇచ్చారని కొనియాడారు.

04/25/2016 - 12:31

గుంటూరు: వెలగపూడి వద్ద సోమవారం తెల్లవారు జామున 4.01 గంటలకు తాత్కాలిక సచివాలయం భవనాన్ని ఎపి సిఎం చంద్రబాబు ప్రారంభించారు. దీనికి ‘ఎపి గవర్నమెంట్ ట్రాన్సిషనల్ హెడ్‌క్వార్టర్స్’గా ఆయన నామకరణం చేశారు. ఇక్కడ సిఎం కార్యాలయం కోసం నాలుగో బ్లాకులో రెండు గదులను సిద్ధం చేశారు. జూన్‌లోగా మిగిలిన నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

04/25/2016 - 08:36

గుంటూరు, ఏప్రిల్ 24: తుని ఘటనలో రౌడీషీటర్ల ప్రమేయం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలో తేలిందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. విచారణ పూర్తయిన వెంటనే నిందితులు ఎంతటి వారయినా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశానికి హాజరైన సందర్భంగా ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

04/25/2016 - 08:35

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఆంధ్ర రాష్ట్ర రవాణా శాఖ ద్వారా ఈ ఏడాది రూ.2555 కోట్ల ఆదాయాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రెవెన్యూ రాబడి 20 శాతం వృద్ధిరేటు ఉంటుందని ఆయన చెప్పారు. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది 365 కోట్ల రెవెన్యూ పెరిగిందన్నారు. పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేసి రూ.

04/25/2016 - 08:34

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఎపి జెన్‌కో సిఎండి కె.విజయానంద్‌కు ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు లభించింది. విజయానంద్ ఎపిజెన్‌కో, ట్రాన్స్‌మిషన్ విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు. నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు అత్యద్భుతమైన నిర్వహణ సామర్ధ్యాన్ని కనబర్చి ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించినందుకు ఈ అవార్డును న్యూఢిల్లీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ స్టడీస్ సంస్థ విజయానంద్‌కు అందజేసింది.

04/25/2016 - 08:25

ఒంటిమిట్ట, ఏప్రిల్ 24: మరో అయోధ్యగా పేరుగాంచి, ఏకశిలా నగరంగా పిలువబడే ఒంటిమిట్ట కోదండ రామస్వామికి ఆదివారం నిర్వహించిన పుష్పయాగం కన్నుల పండువగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందుగా శ్రీసీతారాముల ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక అభిషేకాలు జరిపారు. ఆలయ ఆగ్నేయ భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీసీతారామలక్ష్మణులను ప్రత్యేకంగా అలంకరించారు.

04/25/2016 - 08:25

పుట్టపర్తి, ఏప్రిల్ 24: ప్రపంచ ఖ్యాతి గడించిన అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో ఆదివారం సత్యసాయిబాబా 5వ ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే ఆయన చూపిన మార్గాన్ని సందేశాత్మక అవతార విశిష్టతను మననం చేసుకుంటూ అవతార ఆరాధనోత్సవ వేడుకలను భక్తజనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

04/25/2016 - 08:24

పుట్టపర్తి, ఏప్రిల్ 24: గ్రామాభివృద్ధే దేశానికి శ్రీరామరక్ష అని, వాటి బలోపేతానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

04/25/2016 - 08:23

కాకినాడ, ఏప్రిల్ 24: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో వడ దెబ్బ మరణాలను నిర్ధారించేందుకు మండల స్థాయిలో త్రిసభ్య కమిటీలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వడ దెబ్బకు గురై మృతి చెందిన వారి వివరాలను పోస్ట్‌మార్టం నివేదికతో సంబంధం లేకుండా, మృతి చెందిన 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోను మండలస్థాయిలో త్రిసభ్య కమిటీలను నియమించారు.

Pages