S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/27/2016 - 03:55

విశాఖపట్నం, ఏప్రిల్ 26: విశాఖ జిల్లా ఏజెన్సీలో ఆంత్రాక్స్ మళ్లీ విజృంభించింది. హుకుంపేట మండలం పనసపుట్ గ్రామంలో ఏకంగా 13 మంది అంత్రాక్స్ వ్యాధి బారినపడ్డారు. వీరిలో ఓ మహిళ, ఏడాది బాలుడు ఉన్నారు. వీరందరినీ చికిత్స నిమిత్తం విశాఖ కెజిహెచ్‌కు మంగళవారం రాత్రి తరలించారు. ఆసుపత్రిలో వీరిని ప్రత్యేక విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

04/26/2016 - 17:55

విశాఖ: పవర్ గ్రిడ్‌లో పదే పదే సాంకేతిక లోపాలు తలెత్తడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో రెండు రోజులుగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పలు విద్యుత్ సబ్ స్టేషన్లలో, ఫీడర్లలో సాంకేతిక ఇబ్బందుల వల్ల అనధికారికంగా విద్యుత్ కోతను అమలు చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకూ విద్యుత్ సరఫరా లేనందున జనం ఉక్కపోతతో అలమటించారు.

04/26/2016 - 17:08

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా కారెం శివాజీ నియామకంలో నిబంధనలు పాటించలేదంటూ జేవీ ప్రసాద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. నియామకంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి, కారెం శివాజీకి నోటీసులు జారీ చేసింది. అంతరం ఈ కేసును వచ్చేనెల 7వ తేదీకి వాయిదా వేసింది.

04/26/2016 - 16:01

కాకినాడ: ఈనెల 29న జరిగే ఎంసెట్‌కు సకల సన్నాహాలు పూర్తయినట్లు ఎపి ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సాయిబాబా మంగళవారం మీడియాకు తెలిపారు. ఈ ఏడాది ఎంసెట్‌కు మొత్తం 2.92 లక్షల మంది దరఖాస్తు చేశారని, ఇందులో ఇంజనీరింగ్‌కు 1.89 లక్షలు, మెడిసిన్‌కు 1.03 లక్షల మంది ఉన్నారని, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించే ప్రసక్తే లేదన్నారు.

04/26/2016 - 16:00

విజయవాడ: ఎపిలో ఈనెల 29న జరిగే ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఎపిఎస్ ఆర్టీసీ ఎండి సాంబశివరావు తెలిపారు. పరీక్ష జరిగే జిల్లా కేంద్రాల్లో, ఇతర పట్టణాల్లో ప్రతి పది నిమిషాలకో బస్సు నడుపుతామన్నారు.

04/26/2016 - 15:58

కర్నూలు: శ్రీశైలం నుంచి పాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఈనెల 28న టిడిపిలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఆ రోజున విజయవాడలో చంద్రబాబు సమక్షంలో ఆయన టిడిపిలో చేరతారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున కార్యకర్తలు, నేతలతో తరలివెళ్లాలని ఆయన భారీ సన్నాహాలు చేస్తున్నారు.

04/26/2016 - 15:58

విజయవాడ: సొంత పార్టీ ఎమ్మెల్యేలంటే వైకాపా అధినేత జగన్ ఎంతో చులకనగా చూస్తారని ఇటీవల టిడిపిలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. జగన్ తీరు నచ్చనందునే వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని ఆయన మంగళవారం ఇక్కడ తెలిపారు. మే నెలాఖరు నాటికి కనీసం 30 మంది వైకాపా ఎమ్మెల్యేలు టిడిపి శిబిరంలో చేరడం ఖాయమన్నారు.

04/26/2016 - 14:46

తిరుపతి: కోయంబత్తూర్‌కు చెందిన సత్యవాణి, సంపత్‌కుమార్ దంపతులు తిరుమలలోని రామ్‌బగీచ అతిథిగృహంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగుచూసింది. మూడు రోజులుగా గది తలుపులు తెరవక పోవడంతో అతిథిగృహం ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బలవంతంగా తలుపులు తెరిచిచూడగా దంపతులు ఉరి వేసుకుని మరణించినట్లు కనుగొన్నారు.

04/26/2016 - 14:45

విశాఖ: ఇద్దరు పిల్లల మధ్య గొడవ ఫలితంగా రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయిన విషాద సంఘటన విశాఖ జిల్లా పెదబయలు మండలం చిముడుపల్లిలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు కొర్ర మత్స్యరాజు, కొర్ర కొట్టయ్యల కొడుకులిద్దరూ సోమవారం ఆడుకుంటూ ఒకరినొకరు కొట్టుకున్నారు. దీంతో తన కొడుకును ఎందుకు కొట్టావంతూ మత్య్యరాజు ఈరోజు తెల్లవారు జామున కొట్టయ్య కుమారుడు వినయ్‌పై కత్తితో దాడి చేశాడు.

04/26/2016 - 14:45

అనంతపురం: అనేక చోరీలతో సంబంధం ఉన్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి, వారి నుంచి 33 తులాల బంగారు నగలు, 5కిలోల వెండి, ఆరు పంచలోహ విగ్రహాలను మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీసులు తెలిపారు.

Pages