S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/26/2016 - 06:46

హైదరాబాద్, ఏప్రిల్ 25: ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఉత్తర భారతదేశంలో విహారయాత్రకు తీసుకువెళ్తున్నారని, ఢిల్లీ టూర్ పేరుతో ఎమ్మెల్యేలకు విహారయాత్ర ఎంత తిప్పినా తమ మనసులో ఉన్న అభిప్రాయాల మేరకే వారు నిర్ణయాలు తీసుకుంటారని గుర్తించాలని టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాదరావు అన్నారు. సోమవారం నాడు ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో పాత్రికేయులతో మాట్లాడారు.

04/26/2016 - 06:44

హైదరాబాద్, ఏప్రిల్ 25: వివిధ అవసరాల కోసం భూ సేకరణ చేపట్టే సమయంలో భూసేకరణ, పునరావాసం, రీసెటిల్‌మెంట్ చట్టం 2013 ప్రకారం చెల్లించే పరిహారం కన్నా ఎక్కువ చెల్లించేందుకు వీలుగా ప్రతిపాదనలను ఆమోదించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని ఎపి ప్రభుత్వం నియమించింది.

04/26/2016 - 06:43

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద పంపిణీ చేసే ఎల్‌పిజి సిలెండర్లు దుర్వినియోగం కాకుండా పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం ఎంపీ కేశినేని శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

04/26/2016 - 06:37

విజయవాడ, ఏప్రిల్ 25: దేశ విదేశీ పవిత్ర స్థలాల నుంచి సేకరించిన పవిత్ర మట్టి, జలంతో శుద్ధి అయిన నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో కేవలం 62 రోజుల వ్యవధిలోనే ఓ కొలిక్కివచ్చిన ప్రభుత్వ భవనాల సముదాయంలోకి వేదమంత్రాలతో మంగళవాయిద్యాలు, శాస్త్రోక్తంగా జరుగుతున్న హోమాలు, పూజాదికాల మధ్య సోమవారం తెల్లవారుఝామున సరిగ్గా 4.01 నిమిషాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారు.

04/26/2016 - 06:35

కడప,ఏప్రిల్ 25: రాష్టవ్య్రాప్తంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.13,241కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కడప జిల్లాను రాష్ట్రంలోనే హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని, జిల్లాలోని చిత్రావతి, పెన్న, పాపాగ్ని నదులతో పాటు 644 చెరువులను అనుసంధానంచేసి నీటి సమస్య లేకుండా చేస్తానని పేర్కొన్నారు.

04/26/2016 - 06:32

దర్శి, ఏప్రిల్ 25: ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలం పల్లె గ్రామంలో డ్రైవింగ్ శిక్షణ, ట్రాపిక్ పరిశోధన సంస్ధకు మంత్రులు రావెల, శిద్దా సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర రవాణాశాఖామంత్రి శిద్దా మాట్లాడుతూ ఈ డ్రైవింగ్ శిక్షణ, ట్రాఫిక్ పరిశోధన సంస్థను 18.51కోట్లరూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు.

04/26/2016 - 06:32

విశాఖపట్నం, ఏప్రిల్ 25: ఉత్తరాంధ్రవాసులను విద్యుత్ సమస్య సోమవారం కూడా ఇబ్బందులకు గురిచేసింది. ఆదివారం 12 గంటల పాటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖ కలపాకలోని 400 కె.వి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కెపాసిటర్ ఓల్టేజి ట్రాన్స్‌ఫార్మర్(సివిటి) పూర్తిగా దెబ్బతినింది.

04/26/2016 - 06:30

అనంతపురం సిటీ, ఏప్రిల్ 25: అనంతపురం జిల్లా శింగనమల మండలం పరిధిలోని లోలూరు క్రాస్ వద్ద సోమవారం తెల్లవారు జూమున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో డ్రైవర్ రవి(20), మంజునాథ్ (46), అతని భార్య మంజూషా(42)లు ఉన్నారు.

04/26/2016 - 06:29

తిరుపతి, ఏప్రిల్ 25 : చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఈ నెలాఖరులోగా సుమారు 700 సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేయనున్నట్లు సదరన్ డిస్కమ్ సిఎండి హెచ్‌వై దొర తెలిపారు.

04/26/2016 - 06:29

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 25: ప్రపంచ స్థాయి టెక్నాలజీతో ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. బడ్జెట్ కేటాయింపుల నేపథ్యంలో పోలవరం పనులు ఊపందుకున్నాయి. హెడ్‌వర్క్స్ అన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ పరీక్షలు పూర్తయ్యాయి. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఆధునిక టెక్నాలజీ కలిగిన విదేశీ భారీ యంత్ర సామాగ్రితో పనులు చకచకగా సాగుతున్నాయి.

Pages