S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/26/2016 - 14:44

విజయవాడ: ప్రతి వాన చినుకునూ ఒడిసిపట్టుకునేలా ప్రజలంతా ఇంకుడుగుంతలు, పంటకుంటల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టాలని ఎపి సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు చొరవ చూపాలని ఆయన మంగళవారం టెలీకాన్ఫరెన్స్‌లో సూచించారు. ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును ఆయన సమీక్షించారు.

04/26/2016 - 14:44

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో సూపరింటెండెంట్లు మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, కల్యాణకట్ట ఉద్యోగి తంగవేలుకు చెందిన ఇళ్లపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు ప్రారంభించారు. అక్రమాస్తులకు సంబంధించి వీరిపై ఆరోపణలు రావడంతో ఈ దాడులు ప్రారంభించారని తెలిసింది.

04/26/2016 - 12:14

విశాఖ: తన పార్టీ ఎమ్మెల్యేలను టిడిపి డబ్బిచ్చి కొంటోందని గొంతు చించుకుంటున్న వైకాపా అధినేత జగన్‌కు తెలంగాణలో జరుగుతున్న ఫిరాయింపులు కనబడడం లేదా? అని సిపిఐ రాష్ట్ర నేత రామకృష్ణ విమర్శించారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, రాజకీయాల్లో చంద్రబాబు, జగన్‌లు దొందూదొందే అని వ్యాఖ్యానించారు.

04/26/2016 - 12:13

గుంటూరు: వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి ఎపి సిఎం చంద్రబాబు వరసగా రెండో రోజు మంగళవారం కూడా వచ్చారు. సచివాలయ భవనాలను సోమవారం తెల్లవారుజామున ఆయన ప్రారంభించింన సంగతి తెలిసిందే. ద్వితీయ విఘ్నం కాకుండా రెండోరోజు కూడా సచివాలయానికి రావాలని పండితులు చేసిన సూచనను ఆయన పాటించారు. సిఆర్‌డిఎ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

04/26/2016 - 12:13

నెల్లూరు: విజయవాడ నుంచి నెల్లూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు కావలి మండలం గౌరారం వద్ద సోమవారం అర్ధరాత్రి వేళ రోడ్డుపక్క ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఇద్దరు ప్రయాణీకులు మరణించారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

04/26/2016 - 12:12

విశాఖ: పరవాడ మాజీ ఎమ్మెల్యే, వైకాపా నాయకుడు ఈనెల 28న విజయవాడలో ఎపి సిఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలకు చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలతో ఆయన సోమవారం ఒక సమావేశాన్ని నిర్వహించి పార్టీ మారేందుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. భారీ సంఖ్యలో కార్యకర్తలను వెంటపెట్టుకుని విజయవాడ వెళ్లేందుకు బాబ్జీ ఏర్పాట్లు చేస్తున్నారు.

04/26/2016 - 06:52

ఖమ్మం, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్ర సమితి 15వ ప్లీనరీకి ఖమ్మంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 27న జరగనున్న ప్లీనరీకి పార్టీ ప్రధాన నేతలంతా హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు పార్టీ ప్రధాన నేతలంతా 26న సాయంత్రానికే ఖమ్మం చేరుకోనున్నట్లు స్థానిక నాయకులు వెల్లడించారు.

04/26/2016 - 06:50

హైదరాబాద్, ఏప్రిల్ 25: బ్యాంకులకు అప్పులు ఉంటే ఉద్యోగం ఇవ్వబోమని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగ ప్రకటనలో పేర్కొనడం విడ్డూరమని యువజన, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

04/26/2016 - 06:48

హైదరాబాద్, ఏప్రిల్ 25: వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల సేవలను వివిధ రూపాల్లో వినియోగించుకుంటున్నందున విద్యాశాఖను నాన్ వెకేషన్ డిపార్టుమెంట్‌గా ప్రకటించాలని ఎన్‌జిఓల మాదిరి ముప్పై రోజుల సంపాదిత సెలవులను మంజూరు చేయాని ఎస్‌టియు ఎపి అధ్యక్షుడు కత్తి నర్సింహారెడ్డి, ప్రధానకార్యదర్శి సిహెచ్ జోసఫ్ సుధీర్‌బాబు ప్రభుత్వాన్ని కోరారు.

04/26/2016 - 06:47

హైదరాబాద్, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న ఇంటెరిమ్ ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.530 కోట్లను మంజూరు చేస్తూ పరిపాలనపరమైన ఆమోదాన్ని తెలిపింది. ఈ కాంప్లెక్స్‌లో మరో రెండు అంతస్తుల నిర్మాణానికి కూడా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టలని ఎపిసిఆర్‌డిఏ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

Pages