S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/13/2018 - 02:20

కర్నూలు, నవంబర్ 12: తెలంగాణ శాసనసభకు జరుగనున్న ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దృష్టి సారించారు. అక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రచారాన్ని ఏపి ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. నాలుగున్నర సంవత్సరాల క్రితం వరకు కలిసి ఉన్న రాష్ట్రం 2014లో విడిపోయింది. అప్పుడు జరిగిన తొలి ఎన్నికల్లో కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించి ప్రభుత్వాన్ని నెలకొల్పింది.

11/12/2018 - 16:48

విజయవాడ: ఆదరణ-2 కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్, లోగోను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విడుదల చేశారు. ఆయన సోమవారంనాడు స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్డేడియంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులను ఎంపికచేశామని అన్నారు.

11/12/2018 - 12:24

విజయనగరం: వైకాపా అధినేత జగన్ పాదయాత్ర తిరిగి సోమవారంనాడు ప్రారంభమైంది. విజయనగరం జిల్లా మక్కువ మండలం మేళాపువలస శిబిరం నుంచి ఆయన తన పాదయాత్రను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయనకు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.

11/12/2018 - 02:46

నంద్యాల టౌన్, నవంబర్ 11: రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటని భారతీయ జనతా పార్టీ జాతీయ మహిళామోర్చా ఇంచార్జి దగ్గుబాటి పురంధ్రీశ్వరి అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఒకే వేదికపై చేరాయంటే మరోసారి ద్రోహం చేయడానికే అని అన్నారు.

11/12/2018 - 02:45

విశాఖపట్నం, నవంబర్ 11: విశాఖ భూ కుంభకోణంలో దోషులపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సిఫారసులను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదంటూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(ఏపీఆర్‌ఎస్‌ఏ) అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. విశాఖలో ఆదివారం జరిగిన ఏపీఆర్‌ఎస్‌ఏ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈమేరకు తీర్మానాన్ని ఆమోదించినట్టు ఆయన వెల్లడించారు.

11/12/2018 - 02:43

విజయవాడ (సిటీ), నవంబర్ 11: రాజ్యాంగాన్ని, ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ పైనే ఉందని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం పెద్దఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని, గవర్నర్ దీనిపై వెంటనే స్పందించాలని కోరారు. ఇదే సమయంలోప్రజాధనం దర్వినియోగంపై కోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు.

11/12/2018 - 02:41

మడకశిర, నవంబర్ 11: దేశంలో భారతీయ జనతా పార్టీని ఓడించడమే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో కలుస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 2014లో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత దేశ రక్షణతోపాటు అన్ని రంగాల్లో విఫలం చెందిందన్నారు.

11/12/2018 - 02:40

తిరుపతి, నవంబర్ 11: కార్మిక వర్గానికి, దేశానికి తన ఒంటెత్తు పోకడలతో తీవ్ర నష్టం కలిగిస్తున్న ప్రధాని మోదీని దించి, దేశాన్ని కాపాడుకుందామని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ఏకే పద్మనాభన్ కార్మికులకు పిలుపునిచ్చారు. సీఐటీయూ చిత్తూరు జిల్లా (తూర్పు) కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతిలో ‘ఉద్యోగ, కార్మిక హక్కులపై ప్రభుత్వాల దాడి-కర్తవ్యం’ అనే అంశంపై సదస్సు జరిగింది.

11/12/2018 - 02:39

గుంటూరు, నవంబర్ 11: బీజేపీ డైరెక్షన్‌లో జగన్ నటిస్తున్న కోడికత్తి సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, సానుభూతి ప్రచారాలకు యత్నించి ప్రతిపక్ష నేత భంగపడ్డారని పాయకారావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత విమర్శించారు.

11/12/2018 - 02:39

అమరావతి, నవంబర్ 11: బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాష్ట్రంలో ఆంబోతులా సంచరిస్తూ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి అసత్య ఆరోపణలు చేస్తున్నారని శాసనమండలిలో ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న తీవ్రంగా ఖండించారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గవర్నర్ నరసింహన్ జీవీఎల్‌కు ఎలా అపాయింట్‌మెంట్ ఇచ్చారని ప్రశ్నించారు.

Pages