S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/14/2018 - 06:30

విజయనగరం, నవంబర్ 13: రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల కోసం ఎవరూ తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీజీఎస్ విధానం కొంప ముంచింది. తెల్ల రేషన్ కార్డుల కోసం ఆర్టీజీఎస్‌కు అందిన సమాచారంతో ప్రజాసాధికార సర్వేను ఆధారం చేసుకొని తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేయడంతో ఎక్కువ మంది అనర్హులు జాబితాలో చేరారు.

11/14/2018 - 05:27

విశాఖపట్నం, నవంబర్ 13: స్వాతంత్య్రోద్యమంలో మనకు తెలియని, బహిర్గతం కాని అంశాలు ఎన్నో ఉన్నాయని, ముఖ్యంగా దేశ విభజన జరిగిన విధానంలో కూడా కొన్ని అంశాలు వెలుగుచూడలేదని మేఘాలయ గవర్నర్, ప్రఖ్యాత చరిత్ర విశే్లషకులు తధాగత రాయ్ అన్నారు. ‘రక్షణరంగ పరిశోధనలకు కేంద్రంగా భారతదేశ విశ్వవిద్యాలయాల సామర్ధ్యం పెంపు’ అంశంపై విశాఖ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగిన సదస్సుకు ఆయన హాజరయ్యారు.

11/14/2018 - 05:23

అమలాపురం, నవంబర్ 13: నేర చరిత్రకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి కుటుంబాన్ని వివేకవంతులైన ప్రజలు ఎలా కాపాడతారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. జగన్ తాత దగ్గర నుండి ఆ కుటుంబానిదంతా క్రిమినల్ చరిత్రేనని, అటువంటి కుటుంబాన్ని ప్రజలు ఎలా నమ్ముతారన్నారు. జగన్ తల్లి విజయలక్ష్మి తన కుమారుడిని కాపాడమని ప్రజలను కోరడం విడ్డూరంగా ఉందన్నారు.

11/14/2018 - 05:22

విజయవాడ, నవంబర్ 13: అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా చేస్తుంటే ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి నాటకాలు, డ్రామాలు ఆడుతూ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

11/14/2018 - 05:21

విజయవాడ, నవంబర్ 13: రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాల్లో ముస్లింలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ హిదాయత్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మైనారిటీ వర్గాలు సుఖంగా ఉండటం ప్రతిపక్ష నేత జగన్‌కు ఇష్టం లేదా అని ప్రశ్నించారు.

11/14/2018 - 05:21

చిత్తూరు, నవంబర్ 13: దేశంలో నోటు రద్దు వల్ల యాబై రోజుల్లో ప్రయోజనం కలగకపోతే నన్ను కాల్చి చంపాలని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీని నేడు 24 సార్లు కాల్చి చంపాలని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ఆరోపించారు. మంగళవారం చిత్తూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నోట్ల రద్దు వల్ల దేశంలో అనేక మంది పేదలు చనిపోయినట్లు ఆరోపించారు.

11/14/2018 - 05:19

విజయవాడ, నవంబర్ 13: జగన్ పాదయాత్ర వల్ల దుబారా ఖర్చు తప్ప రాష్ట్రానికి రాగి దమ్మిడీ అంత ప్రయోజనం కూడా లేదని పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ తులసీరెడ్డి, ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ ధ్వజమెత్తారు. ఆంధ్రరత్నభవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు.

11/13/2018 - 13:35

తిరుమల: ఇస్రో చైర్మన్ శివన్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వారికి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ఇస్రో శాస్తవ్రేత్తలతో తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. జీశాట్ -29 ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత పెట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

11/13/2018 - 13:32

చిత్తూరు: గజ తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అధికారులు అప్రమత్తమయ్యారు. ఈమేరకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేశారు.

11/13/2018 - 12:33

విశాఖపట్నం: పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కొనసాగుతున్న తుపాను ‘గజ’ తీవ్ర తుపానుగా మారనున్నది. రాగల 12 గంటల్లో అది తీవ్ర తుపానుగా మారటం వల్ల తీరప్రాంతంలో గంటకు 60-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 7 కి.మీ వేగంతో పయనిస్తూ 15వ తేదీ మధ్యాహ్నాంనాటికి తమిళనాడులోని పంబన్-కడలూరు మధ్య తీరందాటే అవకాశం ఉంది.

Pages