S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/13/2018 - 04:15

విజయవాడ (క్రైం), నవంబర్ 12: ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి రాష్టస్ధ్రాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు షెడ్యూలు విడుదల చేసింది. మొత్తం 3137 ఉద్యోగాలకు నియామకాలు చేపడుతున్నట్లు డీజీపీ ఆర్‌పి ఠాకూర్ తెలిపారు. ఇప్పటికే సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఈనెల 5వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించగా ఇప్పటి వరకు 21వేల అప్లికేషన్లు వచ్చినట్లు చెప్పారు.

11/13/2018 - 04:16

అమరావతి, నవంబర్ 12: ప్రకృతి వ్యవసాయం, రాష్ట్రంలో పంటల సాగు తదితర అంశాలపై ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌ను ఆధ్యయనం చేసేందుకు త్వరలో ఇండోనేషియా మంత్రి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు చెప్పారు. బంగాళాఖాతంలో తుపాను కదలికలను ముందుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

11/13/2018 - 03:11

గుంటూరు, నవంబర్ 12: ప్రతిపక్ష నేత జగన్ ఆడిన కోడికత్తి డ్రామా అట్టర్‌ఫ్లాప్ అయ్యిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. సోమవారం గుంటూరులోని తన కార్యాలయంలో ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కిడారి శ్రవణ్‌తో కలిసి విలేఖర్లతో మాట్లాడారు.

11/13/2018 - 03:10

విజయనగరం, నవంబర్ 12: పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు ఎంతోమేలు కలుగుతుందని జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ అన్నారు. విదేశాలకు వెళ్లిన జిల్లా కలెక్టర్ సోమవారం పారిస్‌లోని పీస్ ఫోరంలో పాల్గొన్న 116 దేశాల ప్రతినిధుల గ్రూపు డిస్కషన్ సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో ప్రకృతి వ్యవసాయం ఒక్కటే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తుందన్నారు.

11/13/2018 - 02:44

గుంటూరు, నవంబర్ 12: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, సైనికుడిలా పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకువస్తానని రాష్ట్ర ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి కిడారి శ్రవణ్‌కుమార్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమవారం తొలిసారిగా గుంటూరులోని మంత్రి నక్కా ఆనందబాబు క్యాంపు కార్యాలయానికి శ్రవణ్ వచ్చారు.

11/13/2018 - 02:42

నర్సీపట్నం(విశాఖ), నవంబర్ 12: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం ఏ విచారణకైనా సిద్ధంగా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేసారు. ఈకేసును టీడీపీ ప్రభుత్వం నీరుకార్చుతోందని జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ఆరోపించడం సరికాదన్నారు.

11/13/2018 - 02:41

అమరావతి, నవంబర్ 12: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సమర్థ నిర్వహణలో భాగంగా సమీకృత మానవ వనరుల విధానాన్ని అమలులోకి తీసుకురావాలని పాలకమండలి నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక ఏజన్సీని నియమించి పూర్తిస్థాయి నివేదిక కోరాలని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది.

11/13/2018 - 02:41

విజయనగరం, నవంబర్ 12: రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో మాత్రం ముందంజలో ఉందని భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. సోమవారం సాయంత్రం ఇక్కడ అయోధ్య మైదానంలో ఏర్పాటుచేసిన మెగా గ్రౌండింగ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా మేళాల ద్వారా 8 లక్షల మందికి సుమారు రూ.4కోట్ల ఆస్తులను పంపిణీ చేశామని తెలిపారు.

11/13/2018 - 02:40

విజయవాడ, నవంబర్ 12: రాష్ట్ర, దేశ ప్రజల ప్రయోజనాలే టీడీపీకి ముఖ్యమని, రాజకీయాలు తమకు అవసరం లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ అన్నారు. సోమవారంనాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రూపాయి ఖర్చు చేస్తే 100 రూపాయలు పెట్టుబడి తీసుకువస్తారని అన్నారు.

11/13/2018 - 02:40

అమరావతి, నవంబర్ 12: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ 4వేల కోట్ల పెట్టుబడులతో వివిధ పరిశ్రమలు స్థాపించేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. సోమవారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. కొత్తగా అనుమతి పొందిన పరిశ్రమల ఏర్పాటు ఏయే దశల్లో ఉన్నాయో ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా రూ.

Pages