S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/12/2019 - 05:13

న్యూఢిల్లీ: రానున్న పది, పదిహేను సంవత్సరాల్లో భారతదేశం పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదన్న విశ్వాసాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యక్తం చేశారు.

11/12/2019 - 01:22

హైదరాబాద్, నవంబర్ 11: రాష్ట్రంలోని అన్ని పెట్రోలు బంకుల్లో బాటిళ్లలో ‘పెట్రో’ విక్రయాలను నిషేధిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

11/12/2019 - 05:48

న్యూఢిల్లీ, నవంబర్ 11: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లోని దాదాపు 70 వేలమంది ఉద్యోగులు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం ఇప్పటికే అంగీకారాన్ని తెలిపారని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ సోమవారం నాడిక్కడ తెలిపారు. గత వారం వీఆర్‌ఎస్ పథకం అమలులోకి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్ధలోని దాదాపు లక్ష మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌కు అర్హులుగా ఉన్నారని తెలిపారు.

11/12/2019 - 05:47

అబుదాబీ/న్యూఢిల్లీ, నవంబర్ 11: భారత్‌లోని చమురు, సహజ వాయువుల రంగంలో విరివిగా పెట్టుబడులు మదుపు చేయాలని సోమవారం నాడిక్కడ విదేశీ కంపెనీలకు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇంధన వినియోగదారైన భారత్ దేశీయంగా చమురు, సహజ వాయువుల ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన వౌలిక వసతులకోసం 100 బిలియన్ డాలర్లు వెచ్చించే ప్రణాళికలతో ముందుకెళుతోందన్నారు.

11/11/2019 - 23:18

ముంబయి, నవంబర్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్పంగా లాభపడ్డాయి. రోజంతా ఒడిదుడుకులతో సాగిన సూచీలు బ్యాం కింగ్ స్టాక్స్ తెచ్చిన లాభాలతో ఎట్టకేలకు లాభాలను నమోదు చేశాయి. హాంగ్‌కాంగ్‌లో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా ఈక్విటీలు స్వల్పంగా నష్టాల పాలవడం, అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో అనిశ్చితి నెలకొడం కూడా ఆసియా మార్కెట్లకు ప్రతికూలంగా మారింది.

11/11/2019 - 05:48

న్యూఢిల్లీ: కీలక స్థూలార్థిక అంశాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల దిశను నిర్దేశించే అవకాశం ఉంది. ఎందుకంటే, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల వెల్లడి సీజన్ దాదాపు ముగింపునకు వస్తోందని, అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మొత్తంమీద ఇనె్వస్టర్ల సెంటిమెంట్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని మార్కెట్ విశే్లషకులు అంచనా వేశారు.

11/11/2019 - 05:11

చండీగఢ్, నవంబర్ 10: హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో గల చురురు గ్రామానికి చెందిన సంజీవ్ కుమార్ అనే పెయింటర్‌కు భారీ బహుమతి లభించింది. పంజాబ్‌లో నిర్వహించిన లాటరీలో ఆయనను రూ. 2.5 కోట్ల బహుమతి వరించింది. పంజాబ్ స్టేట్ మా లక్ష్మీ దివాలీ-పూజా బంపర్-2019 సంజీవ్ కుమార్ జీవితంలో వెలుగులు నింపింది.

11/11/2019 - 04:03

ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ఓ పుస్తకాన్ని ఆదివారం ఢిల్లీలో ఆవిష్కరిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ డెబ్రో. ఈ పుస్తకాన్ని అనంత నాగేశ్వరరావు రాశారు (కుడి వైపుఉన్న వ్యక్తి)

11/11/2019 - 03:58

న్యూఢిల్లీ, నవంబర్ 10: దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో విదేశీ ఇనె్వస్టర్లు నవంబర్ తొలి వారంలో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడటంతో విదేశీ ఇనె్వస్టర్లు నవంబర్ తొలి వారంలో నికరంగా రూ. 12వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు.

11/11/2019 - 03:57

న్యూఢిల్లీ, నవంబర్ 10: మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) అక్టోబర్ నెలలో తన ఉత్పత్తిని 20.7 శాతం తగ్గించింది. దేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి తన ఉత్పత్తిలో కోత విధించుకోవడం ఇది వరుసగా తొమ్మిదో నెల. ఎంఎస్‌ఐ ఈ సంవత్సరం అక్టోబర్‌లో మొత్తం 1,19,337 యూనిట్లను ఉత్పత్తి చేసింది.

Pages