S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/03/2018 - 17:49

ముంబయి: స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. సెనె్సక్స్ చివరకు 114.19 పాయింట్లు లాభపడి 35,378.60 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 42.60 పాయింట్ల లాభంతో 10.699.90 వద్ద స్థిరపడింది.

07/03/2018 - 00:33

న్యూఢిల్లీ: అంతర్ ప్రాంతీయ వాణిజ్యం లేకపోవడం వల్లే దక్షిణాసియా ఆర్థికాభివృద్ధి వెనుకబడిందని నీతి ఆయోగ్ సీఇఓ అమితాబ్ కాంత్ అన్నారు. ఈ ప్రాంతంలోని దేశాల మధ్య అన్ని విధాలుగా పరస్పర సహకారం పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని, ముఖ్యంగా పరస్పర పెట్టుబడులు విస్తరించడంతో పాటు పర్యాటక రంగం కూడా గణనీయంగా అభివృద్ధి చెందితేనే ఈ ప్రాంతం అభివృద్ధి పరంగా వేగాన్ని పుంజుకోగలుగుతుందని తెలిపారు.

07/03/2018 - 00:29

ముంబయ, జూలై 2: ఓ పక్క విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, మరోపక్క అంతర్జాతీయ వాణిజ్యంలో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులు సోమవారం భారత మార్కెట్ లావాదేవీలపై తీవ్ర ప్రభావం కనబరిచాయి. ఈ స్లంప్ పరిస్థితుల్ని ప్రతిబింబిస్తూ ఇనె్వస్టర్లు కూడా తీవ్ర స్థాయిలో అమ్మకాలకు పాల్పడ్డారు. సెనె్సక్స్, నిఫ్టీలు నష్టాలతోనే ముగిశాయి.

07/03/2018 - 00:20

వాషింగ్టన్, జూలై 2: ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకోకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని చైనాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దారికి రాకపోతే, టారిఫ్ మోత తప్పదని తేల్చిచెప్పారు. సుమారు 50 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై పన్నును అమెరికా ఇటీవల 25 శాతం పెంచింది.

07/03/2018 - 00:32

న్యూఢిల్లీ, జూలై 2: ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్య కాంక్ష పెరుగుతోంది. ముఖ్యంగా తాము తినే ఆహారంపైనే తమ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్న భావన రోజురోజుకూ బలపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఎరువులు లేకుండా పండించే సేంద్రీయ ఆహార పదార్థాలపై జనం దృష్టి పడింది.

07/02/2018 - 03:07

హైదరాబాద్: హైదరాబాద్ జోన్ పరిధిలో ఉన్న పరిశ్రమల్లో అత్యధిక జీఎస్‌టీని చెల్లించిన సంస్థగా సింగరేణి టాప్‌లో నిలిచిందని జీఎస్‌టీ చీఫ్ ప్రిన్సిపల్ కమిషనర్ అగర్వాల్ అన్నారు. జీఎస్‌టీ డే ఉత్సవాలు ఆదివారం ప్యాప్సీ భవనంలో జరిగాయి. ఈ సందర్భంగా అగర్వాల్ కీలక ఉపన్యాసంలో మాట్లాడుతూ జీఎస్‌టీ చెల్లింపుల్లో సింగరేణి టాప్ స్థానం దక్కడం పట్ల ఆయన అభినంధించారు.

07/02/2018 - 00:59

న్యూఢిల్లీ, జూలై 1: భారత్ పన్నుల రంగంలో, ఆర్థికవ్యవస్థలో బృహత్తరమైన సంస్కరణలకు వస్తు సేవా పన్ను ద్వారా శ్రీకారం చుట్టామని, సంక్లిష్టమైన పన్ను విధానాలకు స్వస్తి చెప్పి ఏకీకృతమైన పరోక్ష పన్నుల విధానానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.

07/02/2018 - 00:45

అంబాజీపేట: ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన ఈ-రవాణా పర్మిట్ విధానంపై కొబ్బరి వ్యాపారులు భగ్గుమంటున్నారు. ఈ-పర్మిట్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి ఎగుమతులు నిలిపివేశారు. దీంతో తొలి రోజు రెండు జిల్లాల్లో సుమారు రూ.ఐదు కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళితే...

07/01/2018 - 23:51

ముంబయి, జూలై 1: మహారాష్ట్ర ప్రభుత్వం ఈ-వేబిల్ మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచింది. గతంలో 50,000 రూపాయలుగా ఉన్న ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది. వ్యాపారులు ముందుగా ఈ మొత్తాన్ని డిపాజిట్ చేసి, ఈ-వేబిల్‌ను పొందుతారు. దీని ద్వారా వ్యాపారులు తమతమ వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా చేసుకోవచ్చు.

07/01/2018 - 23:50

చెన్నై, జూలై 1: కేవలం ఒకే ఒక రూపాయి కోసం 138 గ్రాముల బంగారాన్ని తిరిగి ఇచ్చేందుకు ఒక బ్యాంక్ నిరాకరించిన విచిత్రం సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. దీనితో ఆ ఖాతాదారుడు న్యాయం కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే, కాంచీపురం సెంట్రల్ కోపరేటివ్ బ్యాంక్ పల్లవరం బ్రాంచీ నుంచి కుమార్ అనే వ్యక్తి గోల్డ్ లోన్ తీసుకున్నాడు.

Pages