S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/04/2018 - 00:46

ముంబయి, నవంబర్ 3: గత వారం కుంటుపడిన బుల్ రన్ ఈవారం కోలుకోవడమేగాక, దూకుడును పెంచింది. అన్ని విధాలా మెరుగైన వాతావరణం కొనసాగడంతో బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో లావాదేవీలు దాదాపుగా స్థిర ఫలితాలనిచ్చాయి. మార్కెట్ కుదుటపడంతో, సెనె్సక్స్ చాలాకాలం తర్వాత మళ్లీ 35,000 పాయింట్ల సూచీని అధిగమించింది. గత నెల 26వ తేదీన సెనె్సక్స్ 33,349.31 పాయింట్ల వద్ద ముగిసింది.

11/04/2018 - 00:20

కోల్‌కతా, నవంబర్ 3: ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద సెప్టెంబర్ చివరి నాటికి సుమారు 212 సంస్థలు లిక్విడేషన్‌కు వెళ్లాయని ఓ ఉన్నతాధికారి శనివారం ఇక్కడ తెలిపారు. 1,198 కార్పొరేట్ కంపెనీల రెజల్యూషన్ ప్రక్రియకు అంగీకరించగా, అందులో 52 సంస్థలు విజయవంతంగా పరిష్కారమయ్యాయని ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) హోల్-టైమ్ మెంబర్ సవ్‌రంగ్ సాయిని తెలిపారు.

11/04/2018 - 00:19

న్యూఢిల్లీ, నవంబర్ 3: సరళీకృత వాణి జ్య విధానాలే ఆర్థికాభివృద్ధికి మూలమని, అలాం టప్పుడే వృద్ధిరేటు సాధ్యమవుతుందని ప్రము ఖ ఆర్థికవేత్త అరవింద్ పనగా రియా అన్నారు.

11/03/2018 - 02:28

ముంబయి: ఫైనాన్సియల్, వాహన రంగాల షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం బలపడ్డాయి. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడంతో పాటు రూపాయి బలపడటం, విదేశీ ఇనె్వస్టర్లు తాజా కొనుగోళ్లకు పూనుకోవడం ఈ రెండు రంగాల షేర్ల ధరలు పుంజుకోవడానికి దోహదపడింది. దీంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 580 పాయింట్లు పుంజుకొని నెల రోజుల గరిష్ఠ స్థాయి 35,011.65 పాయింట్ల వద్ద ముగిసింది.

11/03/2018 - 00:03

ముంబయి, నవంబర్ 2: వచ్చే మూడు సంవత్సరాల కాలంలో, మహారాష్టల్రో సుమారు పదివేల మందికి ఉద్యోవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎంచుకున్నట్టు స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఫర్నీచర్ సంస్థ ఐకియా ప్రకటించింది. దేశంలోనే ఐకియా మొట్టమొదటి షోరూమ్‌ను హైదరాబాద్‌లో, ఆగస్టు మాసంలో ప్రారంభించిన విషయం తెలిసిందే.

11/03/2018 - 00:05

న్యూఢిల్లీ, నవంబర్ 2: గురుగ్రామ్‌లో నిర్మించబోయే భారీ వాణిజ్య సముదాయ ప్రాజెక్టులో 49 శాతం వాటాలను అమెరికాకు చెందిన హైనెస్ కంపెనీకి అమ్మాలని ప్రముఖ రియాలిటీ సంస్థ డీఎల్‌ఎఫ్ నిర్ణయించింది. 900 కోట్ల రూపాయల విలువైన ఈ వాటాల అమ్మక ప్రక్రియ ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

11/02/2018 - 23:46

ముంబయిలో:
==========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,110.00
8 గ్రాములు: రూ.24,880.00
10 గ్రాములు: రూ. 31,100.00
100 గ్రాములు: రూ.3,11,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,115.00
8 గ్రాములు: రూ. 24,920.00
10 గ్రాములు: రూ. 31,150.00
100 గ్రాములు: రూ. 3,11,500.00
వెండి
8 గ్రాములు: రూ. 330.00

11/02/2018 - 23:44

న్యూఢిల్లీ, నవంబర్ 2: జాతీయ మార్కెట్‌లో బంగారం ధర శుక్రవారం స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల బంగారం 150 రూపాయలు తగ్గడంతో, 32,630 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ ట్రేడింగ్ మండకొడిగా సాగడంతోపాటు దేశీయ వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర తిగి వచ్చింది. గత నెల చివరి వారంలో 32,590 రూపాయలు పలికిన పది గ్రాముల బంగారం ఆతర్వాత 32,550 రూపాయలకు పడిపోయింది. అనంతరం కోలుకొని, 32,620 రూపాయలకు చేరింది.

11/02/2018 - 23:43

న్యూఢిల్లీ, నవంబర్ 2: చాలాకాలంగా ట్రేడింగ్ జరగకుండా, స్తబ్దంగా ఉన్న కంపెనీలను డీలిస్ట్ చేస్తున్న బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) తాజాగా మరో తొమ్మిది కంపెనీలను ఈ జాబితాలో చేర్చింది. సోమవారం నుంచి వీటి షేర్లను ఆరు నెలల పాటు డీలిస్ట్ చేస్తున్నట్టు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

11/02/2018 - 12:42

ముంబయి:దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెనె్సక్స్ 427 పాయింట్లతో 34,859 వద్ద ముగిసింది. నిఫ్టీ 133 పాయింట్లతో 10,500 వద్ద అధిగమించింది. రూపాయి మారకం విలువ రూ.73.10గా కొనసాగుతోంది.

Pages