S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/11/2018 - 23:24

న్యూఢిల్లీ, జూలై 11: ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియా విలీనాన్ని ప్రభుత్వం ఆమోదించిందని టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. అయితే ఈ ఒప్పందం పూర్తి కావాలంటే రెండు కంపెనీలు కొన్ని లాంఛనాలను పూర్తి చేయవలసిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు.

07/11/2018 - 23:23

సత్యవేడు, జూలై 11: జపాన్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ టోరే ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన ఉత్పత్తి కేంద్రం నెల్లూరు, చిత్తూరు జిల్లా సరిహద్దులోని శ్రీసిటీ సెజ్‌లో ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యాక్టరీ నిర్మాణానికి బుధవారం శ్రీసిటీలో భూమిపూజ జరిగింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాథరెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించి లాంఛనంగా నిర్మాణాన్ని ప్రారంభించారు.

07/11/2018 - 16:22

ముంబయి: దేశీయ సూచీలు మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 26 పాయింట్ల స్వల్ప లాభంతో 36,266 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా ఒకే ఒక్క పాయింట్‌ లాభపడి 10,948 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.82గా కొనసాగుతోంది.

07/11/2018 - 04:42

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా విహంగ వీక్షణ పర్యాటక ప్రాజెక్టు మొదలైంది. తమిళనాడుకు చెందిన కూనాల్ ఎయిర్ చార్టర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సెస్నా ఎయిర్‌క్రాఫ్ట్‌తో పర్యాటక ప్యాకేజీ సర్వీసును ప్రవేశపెట్టింది.

07/11/2018 - 00:20

నోయడాలో మంగళవారం జరిగిన స్మార్ట్ఫోన్ ఫ్యాక్టరీ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద స్మార్ట్ఫోన్ ఫ్యాక్టరీ కావడం గమనార్హం.

07/11/2018 - 00:15

ముంబయి, జూలై 10: ప్రోత్సాహకరంగా ఉన్న కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఆదాయాల దన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు మంగళవారం బాగా బలపడ్డాయి.

07/11/2018 - 00:11

న్యూఢిల్లీ, జూలై 10: దేశంలో జూన్ నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 37.54 శాతం వృద్ధితో పెరిగాయి. సుమారు పదేళ్ల కాలంలో ఒక నెలలో అమ్మకాల వృద్ధి ఇంత ఎక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారి. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు తరువాత వాహనాల ధరలు తగ్గుతాయని భావించిన కస్టమర్లు నిరుడు జూన్ నెలలో వాహనాల కొనుగోలును వాయిదా వేసుకోవడం కూడా ఇప్పుడు అమ్మకాల వృద్ధి రేటు బాగా పెరగడానికి దోహదపడింది.

07/11/2018 - 00:10

న్యూఢిల్లీ, జూలై 10: దీపక్ పరేఖ్ నేతృత్వంలోని ఆర్థిక సేవల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌నకు చెందిన లిస్టయిన సంస్థల మార్కెట్ విలువ (ఎంక్యాప్) మంగళవారం రూ. పది లక్షల కోట్ల మైలురాయిని దాటింది. టాటా గ్రూప్ ఇప్పటికే ఈ ఘనతను సాధించగా, హెచ్‌డీఎఫ్‌సీ ఈ ఘనత సాధించిన రెండో భారతీయ వాణిజ్య సంస్థగా నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ ప్రస్తుతం నాలుగు లిస్టయిన అనుబంధ సంస్థలను కలిగి ఉంది.

07/11/2018 - 00:09

న్యూఢిల్లీ, జూలై 10: జాతీయ బ్యాంకు ఐడీబీఐలో 52 శాతం వాటా తీసుకోవాలన్న బీమా యాజమాన్యం ప్రతిపాదనలు జీవిత బీమా ఉద్యోగుల యూనియన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రీమియంల కింద రూపాయి రూపాయి కూడబెట్టిన సొమ్ములు వాటాల కొనడాని ఉపయోగించడం అంటే ఖాతాదారుల ప్రయోజనాలను దెబ్బతీయడమేనని ఎల్‌ఐసీ క్లాస్-1 అధికారుల అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

07/11/2018 - 00:08

న్యూఢిల్లీ, జూలై 10: ఐడియా సెల్యులార్‌తో విలీనం తరువాత భారత మార్కెట్‌లో తమ సంస్థ గట్టి పోటీదారుగా నిలుస్తుందని బ్రిటన్‌కు చెందిన టెలికం దిగ్గజం వొడాఫోన్ మంగళవారం పేర్కొంది. రిలయన్స్ జియో కొత్తగా మార్కెట్‌లోకి ప్రవేశించిన తరువాత టెలికం రంగంలో టారిఫ్ వార్ మొదలయి, పలు సంస్థలు ఆర్థికంగా ఎడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.

Pages