S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/17/2020 - 06:43

ముంబయి: ఎస్ బ్యాంక్ ఖాతాదారుల డిపాజిట్లు సురక్షితమని, వీటి విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం స్పష్టం చేశారు. సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్ బ్యాంక్ లిక్విడిటీ పరంగా పూర్తిగా ఆదుకుంటామని మీడియా సమావేశంలో తెలిపా రు. ఈ సంక్షోభాన్ని సత్వరమే పరిష్కరించేందుకు ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుందని వెల్లడించారు.

03/17/2020 - 05:55

ముంబయి, మార్చి 16: కరోనా వైరస్ భయంతో విమాన ప్రయాణాలపై అన్ని దేశాల్లోనూ ఆంక్షలు తీవ్రం కావడంతో భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య జూన్ వరకు 50 శాతం మేర తగ్గిపోవచ్చునని తాజాగా వెలువడిన ఓ నివేదిక స్పష్టం చేస్తోంది. రోజురోజుకూ పరిస్థితి తీవ్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని విమానయాన సంస్థలు నష్టాల్లో మునిగిపోయాయి. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

03/17/2020 - 05:52

ముంబయి, మార్చి 16: కరోనా వైరస్ మరోసారి స్టాక్ మార్కెట్లను కకావికలు చేసింది. మదుపరులకు కునుకు లేకుండా చేసింది. ఊపిరి పీల్చుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా రెండు రోజుల వ్యవధిలోనే మార్కెట్‌ను మరో భారీ పతనంలోకి నెట్టేసింది. కోలుకున్నట్టే కోలుకున్న స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా సోమవారంనాడు మళ్లీ చతికిలపడ్డాయి.

03/17/2020 - 05:49

న్యూఢిల్లీ, మార్చి 16: దేశంలో రెండు వేల రూపాయల నోట్ల మార్కెట్ నుంచి తొలగించాలన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సోమవారం లోక్‌సభలో ప్రకటించారు. ప్రభుత్వరంగంలోని ఎస్‌బీఐ, ఇండియన్ బ్యాంక్ 500 నోట్లు, 200 నోట్లకు వీలుగా ఏటీఎంలలో మార్పులు తీసుకువస్తున్నాయని ఆయన వెల్లడించారు. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు.

03/17/2020 - 01:03

అమరావతి, మార్చి 16: పేదలకు ఇళ్ల నిర్మాణం సహా ప్రభుత్వం చేపట్టే పనులు, పోలవరం ప్రాజెక్ట్‌కు సరఫరా చేసే సిమెంట్ ధరలు తగ్గిస్తున్నట్లు సిమెంట్ కంపెనీలు ప్రకటించాయి. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో వివిధ సిమెంట్ కంపెనీల యజమానులు, ప్రతినిధులు సమావేశమయ్యారు. సిమెంట్ ధరలు తగ్గించాలని సీఎం జగన్ వారిని కోరారు.

03/16/2020 - 05:53

*జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో నిలిచి ఉన్న లుఫ్తాన్సా ఎయిర్ క్రాఫ్ట్‌లు. కరోనా కారణంగా, ప్రయాణికుల సంఖ్య దారుణంగా పడిపోవడంతో, విమానయాన రంగం గడ్డు సమస్యను ఎదుర్కొంటున్నది. భారీగా నష్టపోయిన విమానయాన సంస్థల్లో లుఫ్తాన్సా మొదటి వరుసలో ఉంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే కొత్త వారంలోనూ పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పు ఉండకపోవచ్చని విశే్లషకులు జోస్యం చెప్తున్నారు.

03/16/2020 - 05:51

*ఇరాక్‌లోని పవిత్ర యాత్రాస్థలం నజాఫ్‌లో ముఖాలకు మాస్క్‌లు కట్టుకొని, ఉత్పత్తి పనుల్లో నిమగ్నమైన ఓ ఫ్యాక్టరీ వర్కర్లు. కరోనా వైరస్ ఇరాన్‌ను భయపెడుతుండగా, దాని ప్రభావం తమకు కూడా తప్పదని ఇరాక్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ముఖానికి ఎయిర్ మాస్క్‌లు ధరించడం అత్యవసరమని ఆదేశాలు జారీ చేశారు.

03/16/2020 - 05:48

ఫ్రాన్స్‌లోని కింగెర్‌షెమ్ పట్టణంలోని ఒక రెస్ట్రాంట్ ముందు కనిపిస్తున్న నోటీసు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెస్ట్రాంట్‌ను నిరవధికంగా మూసేస్తున్నామని, తదుపరి ఆదేశాలు అందే వరకూ తెరవడం లేదని ఆ నోటీసు బోర్డులోని సారాంశం. కరోనా వైరస్ బాధిత ఐరోపా దేశాల్లో ఫ్రాన్స్, స్పెయిన్ కూడా చేరాయి. వైరస్ కారణంగా, అత్యవరస పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని న్యూజిలాండ్ సర్కారు ప్రజలను కోరింది.

03/16/2020 - 05:46

న్యూఢిల్లీ, మార్చి 15: గత వారం భారత స్టాక్ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాలు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఒక్కసారిగా లాభాలు, అంతే హఠాత్తుగా నష్టాలు, కొనుగోళ్లకు క్యూ కట్టడం, ఆ వెంటనే అమ్మకాల ఒత్తిళ్లు పెంచడం వంటి పరస్పర విరుద్ధమైన అంశాలు బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో లావాదేవీలను అతలాకుతలం చేస్తున్నాయి.

03/16/2020 - 05:44

న్యూఢిల్లీ, మార్చి 15: భారత్‌కే పరిమితం కాకుండా యావత్ ప్రపంచంలోనూ అన్ని రంగాలపై కరోనా వైరస్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. భారీ నష్టాలతో వివిధ రంగాలు అల్లాడుతున్నాయి. గత వారం భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. దేశంలోని పది పెద్ద కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 4,22,393.44 కోట్ల రూపాయలు పతనమైంది.

Pages