S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/04/2019 - 22:39

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: జాతీయ స్టాక్ ఎక్చ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఈ నెల 7న నమూనా ట్రేడింగ్‌ను నిర్వహించనున్నది. స్టాక్ మార్కెట్ లావాదేవీలు ఇతర అంశాలపై అవగాహన కల్పించడానికి ఈ నమూనా ట్రేడింగ్‌ను నిర్వహించనుంది. మార్కెట్‌లో రుణా లు, చెల్లింపులు, సెక్యురిటీలు, ప్యూచర్ సెగ్మెంట్స్ వంటి అనేక అంశాలపై ఈ నమూనా ట్రేడింగ్ కొనసాగుతుంది.

09/04/2019 - 22:39

బీజింగ్‌లోని హువావై రిటైల్ షోరూమ్ ఇది. టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులను మభ్యపెట్టి వారి నుంచి కీలక సమాచారాన్ని పొందుతున్నట్టు ఆరోపిస్తోంది.

09/04/2019 - 22:37

హాంకాంగ్ స్టాక్ మార్కెట్ వద్ద సెనె్సక్స్ పాయింట్ల పెరుగుదలను సూచిస్తున్న బోర్డు. హాంకాంగ్‌లో అరెస్టయిన వారిని చైనాలో విచారించాలన్న చట్టాన్ని తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఊపందుకుంది. 990.97 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్ 26,518.52 పాయింట్ల వద్ద ముగిసింది.

09/04/2019 - 04:53

న్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యం, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి నేపథ్యంలో మంగళవారం నాడు దేశీయ మార్కెట్లు కుదేలయ్యాయి. సూచీలు దాదాపు రెండు నెలల కనిష్టాన్ని నమోదు చేయడంతో మదుపర్ల సంపద రూ. 2.55 లక్షల కోట్ల మేర ఆవిరైంది. బీఎస్‌ఈలో దాదాపు 200 స్టాక్స్ 52 వారాల కనిష్టానికి చేరాయి. ఎటూ తేల్చుకోలేని పెట్టుబడిదారులు వేచిచూసే దోరణిని అవలంబించడంతోబాటు పెద్దయెత్తున వాటాల విక్రయాలకు పాల్పడ్డారు.

09/04/2019 - 03:37

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: బ్యాంకుల స్థూల మొండి బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరాంతానికి రూ. 9.1 లక్షల కోట్లకు తగ్గనున్నాయి. మంగళవారం నాడిక్కడ విడుదలైన ‘బోల్‌స్టరింగ్ ఏఆర్‌సీ’ సంస్థ అధ్యయన నివేదిక ఈవిషయం వెల్లడించింది. ‘అసోచెం-క్రైసిల్’ సంస్థతో కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్టు బోల్‌స్టరింగ్ ఏఆర్‌సీ సంస్థ ప్రకటించింది.

09/04/2019 - 02:31

అమరావతి, సెప్టెంబర్ 3: పరిశ్రమలకు అవసరమైన అనుమతులు, రాయితీలు, ప్రోత్సాహకాలపై పారిశ్రామిక వేత్తలతో చర్చించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పరిశ్రమలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.

09/02/2019 - 04:47

విజయవాడ : గాలి, ధ్వని, వాతావరణ కాలుష్యం నివారణకు ఏపీఎస్ ఆర్టీసీ దశలవారీగా ఎలక్ట్రానిక్ బస్సులను ప్రవేశపెట్టబోతోంది. త్వరలో కనీసం వెయ్యి ఎలక్ట్రానిక్ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. వీటిల్లో 300 బస్సులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీకి కేటాయించింది. డీజిల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీ ఏటా రూ. 300కోట్ల వరకు నష్టాల్ని చవిచూడాల్సి వస్తోంది.

09/02/2019 - 04:28

చెన్నై : భారతీయ బ్యాంకులను పటిష్టపరచాలన్న ఉద్దేశంతోనే విలీన నిర్ణయం తీసుకున్నామని, దీనివల్ల ఏ ఒక్కరి ఉద్యోగమూ పోదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పలు బ్యాంకుల విలీనం నేపథ్యంలో అనేక పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు తలెత్తుతున్న దృష్ట్యా సీతారామన్ ఈ వివరణ ఇచ్చారు. ‘ఉద్యోగాలు పోతాయన్న మాటలు ఒట్టి వదంతులే.

09/02/2019 - 02:12

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 1: ఇసుక కావలసిన వారు ఇక కంప్యూటర్, స్మార్ట్ఫోన్లలో క్లిక్ చేస్తే సరిపోతుంది. రాష్ట్రంలో 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఇసుక విధానంలో అధునాతన సాంకేతిక విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది.

09/02/2019 - 01:48

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు మెగా బ్యాంకులుగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు దేశాన్ని 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తయారు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు తోడ్పడతాయని ఆర్థిక కార్యదర్శి రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు.

Pages