S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/17/2018 - 06:14

విశాఖపట్నం, ఫిబ్రవరి 16: సవాళ్లు ఎదురైనప్పటికీ విశాఖ పోర్టు ట్రస్టు (వీపీటీ) కార్గో హ్యాండ్లింగ్‌లో లక్ష్యాన్ని అధిగమిస్తోందని చైర్మన్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్గో హ్యాండ్లింగ్‌లో వీపీటీ నాలుగవ స్థానం సాధించిందన్నారు.

02/17/2018 - 06:14

పనాజీ, ఫిబ్రవరి 16:దేశంలోని విమానాశ్రయాల్లో ప్రస్తుతం ఉన్న టెర్మినళ్లను విస్తరించడం, కొత్తగా నిర్మించడమే లక్ష్యంగా ఆ ఆర్థిక సంవత్సరంలో (2018-19) రూ. 15వేల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు పెట్టాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్ణయించింది.

02/17/2018 - 06:13

అమరావతి, ఫిబ్రవరి 16: రెండున్నరేళ్ల కాలానికి సరిపడా ప్రోత్సాహకాలు, ఐదు సమావేశాల్లో ఐదు నెలల్లో ఆమోదం పొంది విడుదల కావడంతో పరిశ్రమ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ్‌జైన్ నేతృత్వంలో జరిగిన 18వ రాష్టస్థ్రాయి కమిటీ సమావేశంలో 81 యూనిట్లకు రూ.151.4 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు.

02/17/2018 - 06:12

అనంతపురం, ఫిబ్రవరి 16: కరవుకు నిలయమైన అనంతపురం జిల్లాలో పంట పొలాలను సస్యశ్యామలం చేసేందుకు ఆటోమేషన్ సిస్టమ్ ద్వారా లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ (ఎత్తిపోతలు, తుంపర్ల సేద్యం)కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బృహత్తరమైన ఈ పథకం ఆసియా ఖండంలోనే తొలి అత్యాధునిక సేద్య విధానంగా రికార్డులకెక్కనుంది. కర్ణాటక రాష్ట్రంలోని భాగల్‌కోట్ జిల్లా రాంతాల్ గ్రామంలో లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ పథకం కొనసాగుతోంది.

02/16/2018 - 16:01

ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లకు పీఎన్‌బీ మెగా స్కాం సెగ తగిలింది. దీంతో ఫైనాన్షియల్‌ సంస్థలు,బ్యాంకింగ్‌ షేర్లలో సెల్లింగ్‌ ప్రెజర్‌ నెలకొంది. అలాగే మెటల్‌, ఆటో రంగాల నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఒక్క ఐటీ,పార్మ తప్ప అన్ని సెక్టార్లలో నష్టాలే.

02/16/2018 - 12:15

ముంబై: వరుసగా రెండో రోజు స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగా మొదలుపెట్టాయి. సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో ప్రారంభమవగా.. నిఫ్టీ కూడా 10,600 దిశగా కదులుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 130 పాయింట్ల లాభంతో 34,427 వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 10,586 వద్ద కొనసాగుతున్నాయి.

02/16/2018 - 01:55

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను రూ. 11,400 కోట్ల మేరకు ముంచినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీకి చెందిన జ్యుయెలరీ షోరూమ్ ఇది. ఢిల్లీలోని చాణక్యపురిలో గల ఈ షోరూమ్ సహా నీరవ్ మోదీ ఇల్లు, ముంబయి, ఢిల్లీ, సూరత్‌లలో గల అతని షోరూమ్‌లు, కార్యాలయాలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు

02/16/2018 - 01:50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: రూ. 11,400 కోట్ల భారీ మొత్తంలో మోసపోయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) రెండు రోజుల వ్యవధిలో రూ. 8వేల కోట్ల వరకు తన మార్కెట్ విలువను కోల్పోయింది. బ్యాంకు ఒక సంవత్సర కాలంలో సాధించిన లాభానికి ఇది ఆరు రెట్లు ఎక్కువ. దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు గురువారం కూడా పీఎన్‌బీ షేర్ల ధర పడిపోయింది.

02/16/2018 - 01:48

ముంబయి, ఫిబ్రవరి 15: ద్రవ్యోల్బణం తగ్గ డం వల్ల ఉత్సాహంతో ఉన్న మదుపరులు ఇటీవల ధరలు తగ్గిన విలువయిన షేర్లను కొనుగోలు చేయడంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 141 పాయింట్లు పుంజుకుంది. రూ. 11,400 కోట్ల భారీ కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) షేర్ల ధర 12 శాతం పతనమయింది.

02/16/2018 - 01:46

అమరావతి, ఫిబ్రవరి 15: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా సత్వరం అనుమతులు ఇస్తున్న విధానాన్ని, వౌలిక వసతులు కల్పిస్తున్న తీరును ప్రపంచానికి తెలిసేలా విశాఖ భాగస్వామ్య సదస్సును సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు.

Pages