S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/07/2020 - 07:13

ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా, యథాతథంగా కొనసాగించాలని నిర్ణియించింది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్య పరిస్థితులపై దృష్టి పెట్టిన ఆర్బీఐ, ప్రస్తుత ద్రవ్య లోటును భర్తీ చేయడానికి వీలుగా కరెన్సీని ముద్రించాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటును 6 శాతంగా అంచనా వేసింది.

02/07/2020 - 06:42

ముంబయి, ఫిబ్రవరి 6: ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచకపోవడంతో మదుపరుల సానుకూల స్పందన భారత మార్కెట్లకు ఊతమిచ్చాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 163.37 పాయింట్లు పెరిగి, 41,306.03 పాయింట్లకు చేరుకోగా, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 48.80 పాయింట్లు మెరుగుపడి, 12,137.95 పాయింట్లుగా నమోదైంది.

02/06/2020 - 23:35

విజయవాడ, ఫిబ్రవరి 6: రాష్ట్రానికి కొత్తగా 3 బిలియన్ డాలర్ల మేర రుణాన్ని ఇచ్చేందుకు ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్టుమెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ముందుకు వచ్చింది. గతంలో ఇచ్చిన రుణానికి ఇది అదనమని తెలిపింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో ఏఐఐబీ ప్రతినిధులు గురువారం సమావేశమయ్యారు. నిర్ణయించుకున్న ప్రాధాన్యతల మేరకు ఈ రుణాన్ని ఖర్చు చేసుకోవచ్చని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.

02/06/2020 - 23:28

విజయవాడ, ఫిబ్రవరి 6: తపాలాశాఖ బ్యాంకుల్లో పదేళ్లుగా రూ. 500 లోపు నిల్వలున్న ఖాతాలను రద్దు చేస్తామని ఏపీ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత సంవత్సరానికి రూ. 100లు చొప్పున మినహాయిస్తామన్నారు. చివరకు నిర్దేశిత మొత్తం కంటే తక్కువ ఉన్న ఖాతా దానంతట అదే రద్దవుతుందన్నారు.

02/06/2020 - 21:51

హైదరాబాద్, ఫిబ్రవరి 5: సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 10 ప్రైవేట్ రైళ్లు నడపడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రైవేట్ సంస్థలకు పిలుపు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ద.మ రైల్వే జోన్ జీఎం గజానన్ మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 10 ప్రైవేట్ రైళ్లు నడపడానికి ఉత్సాహవంతులైన ఔత్సాహికులు ప్రైవేట్ రైళ్లు నడపడానికి ముందకు రావాలని ఆయన సూచించారు.

02/06/2020 - 06:07

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెన్సెక్స్ వరుసగా మూడో రోజు పైకి ఎగబాకింది. చైనాలో వేగంగా విస్తరిస్తూ వివిధ దేశాలను కలవరపరుస్తున్న కొత్త కరోనా వైరస్‌కు చికిత్సలో పురోగతి సాధించినట్టు వచ్చిన వార్తలు ప్రపంచ ఇనె్వస్టర్లలో ఉత్సాహాన్ని నింపడంతో సెనె్సక్స్ బుధవారం 353 పాయింట్లు పుంజుకుంది.

02/05/2020 - 23:17

*చిత్రం...గ్రేటర్ నోయిడాలో బుధవారం ఆటో ఎక్స్‌పో-2020ను ప్రారంభిస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా

02/05/2020 - 23:15

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: క్యాపిటల్ మార్కెట్లలో అధునాతన ఫైనాన్షియల్ టెక్నాలజీ (్ఫన్‌టెక్) నవకల్పనలను ఉపయోగించుకోవడానికి వీలు కల్పించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కసరత్తు చేస్తోంది. ఎంపిక చేసిన కస్టమర్ల కోసం కొత్త ప్రోడక్టులు, సర్వీసులు, బిజినెస్ మోడళ్ల ను లైవ్ టెస్టింగ్ చేయడానికి అనుమతించాలని యోచిస్తోంది.

02/05/2020 - 23:14

గ్రేటర్ నోయిడా, ఫిబ్రవరి 5: ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ బుధవారం నాడిక్కడ జరిగిన ఆటో ఎక్స్‌పోలో తన ట్రైబర్ వాహనం ఏఎంటీ (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) వెర్షన్‌ను ప్రారంభించింది. రెనాల్ట్ గ్రూప్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, ఆఫ్రికా-మధ్యప్రాచ్యం-్భరత్-పసిఫిక్ రీజియన్ చైర్మన్ ఫాబ్రిస్ కాంబోలైవ్..

02/05/2020 - 06:00

ముంబయి: అంతర్జాతీయ సానుకూలతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల పరుగులు పెట్టాయి. కేంద్ర బడ్జెట్ రోజున జరిగిన నష్టాలను సైతం అధిగమించి సూచీలు రికార్డు స్థాయి లాభాలను నమోదు చేశాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఏకంగా 917.07 పాయింట్లు ఎగబాకి నాలుగు నెలల గరిష్ట లాభాన్ని (ఒక రోజు) సంతరించుకుని 40,789.38 పాయింట్ల ఎగువన స్థిరపడింది.

Pages