S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/21/2019 - 02:31

న్యూఢిల్లీ, జనవరి 20: బంగాళా ఖాతంలోని కేజీ-డీ 6 బ్లాక్‌లో భాగస్వామ్యం నుంచి వైదొలగాల్సిందిగా నికో రిసోర్సెస్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) సూచించింది. గ్యాస్ క్షేత్ర అభివృద్ధికి పెట్టుబడులను ఇవ్వలేకపోతున్న నికో వల్ల ఉత్పత్తి ఆలస్యమవుతున్నదని రిల్ అభిప్రాయపడుతున్నది.

01/21/2019 - 02:30

న్యూఢిల్లీ, జనవరి 20: దేశ ఆర్థిక వ్యవస్థను శా సించే పది భారీ కంపెనీల్లో ఆరు కంపెనీలు గత వా రం భారీ లాభాలను ఆర్జించాయ. ఫలితంగా మా ర్కెట్‌లో వీడి విలువ 1,08,274.79 కోట్ల రూపాయ లకు పెరిగింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమి టెడ్ (రిల్) అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

01/20/2019 - 05:36

ప్యారిస్: పడిపోతున్న ముడి చమురు ధరలు మరింతగా పడిపోకుండా అదుపుచేసేందుకు ఉత్పత్తిని తగ్గించుకోవాలని తీర్మానించినట్టు సౌదీ అరేబియా వెల్లడించింది. ఒపెక్ దేశాల నూతన ఒప్పందం మేరకు చమురు ధరలను పెంచేందుకు తమవంతు యత్నంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.

01/19/2019 - 22:54

ముంబయి, జనవరి 19: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ఈ వారం రికార్డు స్థాయిలో లాభాలు నమోదు కాకపోయినప్పటికీ, భారీ నష్టాల నుంచి మార్కెట్ బయటపడింది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, వరుసగా నాలుగు రోజుల పాటు స్వల్ప లాభాలను ఆర్జించి, నిలదొక్కుకుంది. 36,000 పాయింట్ల మైలురాయిని ఈవారం మరోసారి అధిగమించింది. అదే విధంగా నిఫ్టీ 10,900 పాయింట్లకు తగ్గకుండా లావాదేవీలను సాగించింది.

01/19/2019 - 22:53

ఇరాక్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తరుగుతున్న ఉద్యోగావకాశాలకు నిరసనగా ఆందోళనకు దిగిన ప్రజలు శనివారం బాస్రాలోని స్థానిక పాలక మండలి భవనం ముందున్న బారికేడ్లను దగ్ధం చేశారు. ఇరాక్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమవుతోంది. దీనితో నిరుద్యోగులు, నష్టాలను ఎదుర్కొంటున్న చిరు వ్యాపారులు ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ భారీ ప్రదర్శలు నిర్వహిస్తున్నారు.

01/19/2019 - 22:50

న్యూఢిల్లీ, జనవరి 19: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సుమారు 8,800 కోట్ల రూపాయలు (1.25 బిలియన్ డాలర్లు) అంతర్జాతీయ మార్కెట్ నుంచి బాండ్లద్వారా సేకరించనుంది. ఈమొత్తాన్ని బ్యాంకు వాణిజ్య విస్తరణకు వినియోగించడం జరుగుతుందని ఆ బ్యాంకు అధికారులు వెల్లడించారు.

01/19/2019 - 22:48

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,182.00
8 గ్రాములు: రూ.25,456.00
10 గ్రాములు: రూ. 31,820.00
100 గ్రాములు: రూ.3,18,200.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,403.209
8 గ్రాములు: రూ. 27,225.672
10 గ్రాములు: రూ. 34,032.09
100 గ్రాములు: రూ. 3,40,320.9
వెండి
8 గ్రాములు: రూ. 332.00

01/19/2019 - 22:47

న్యూఢిల్లీ, జనవరి 19: పర్యావరణానికి హాని కలిగించే కంపెనీలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్‌జీటీ) కొరడా ఝళిపిస్తున్నది. అందుకు నిదర్శనంగా ఇటీవలే జర్మనీ కార్ల కంపెనీ వోక్స్‌వ్యాగన్‌కు పరిహారం కోరుతూ ఆదేశాలు జారీ చేయడాన్ని పేర్కోవాలి. వోక్స్‌వాగన్ తయారు చేస్తున్న డీజిల్ కార్లు పర్యావరణానికి హాని కల్గిస్తున్నాయని ఎన్‌జీటీ మండిపడింది. 100 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

01/18/2019 - 20:23

న్యూఢిల్లీ, జనవరి 18: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్)కు చెందిన చెందిన షేర్లు శుక్రవారం రెండు శాతం లాభాల వృద్ధిని నమోదు చేసి, మార్కెట్‌కు ఊతమిచ్చాయ. ప్రైవేటు రంగంలో కేవలం త్రైమాసికంలోనే రూ.10వేల కోట్ల లాభాలు గడించిన సంస్థగా రికార్డు సృష్టించడంతో ఈ సంస్థ వాటాల పెరుగుదలకు ఊతం లభించింది.

01/18/2019 - 20:21

ముంబయి, జనవరి 18: భారత స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలకు ఈవారం చివరి రోజైన శుక్రవారం కూడా అనిశ్చితి కొనసాగింది. లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సెనె్సక్స్ చివరికి నామమాత్రపు లాభంతో బయటపడింది. మొదటి నుంచి మదుపరులు అనాసక్తిని ప్రదర్శించడం, అంతర్జాతీయ సూచీల్లో సానుకూల ధోరణులు లేకపోవడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి.

Pages