S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/11/2020 - 23:08

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 11: ప్రస్తుతం మార్కెట్లో భారీ స్థాయిలో వియత్నాం, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటున్న జీడిపప్పు ఆవరించింది. సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో ఎక్కడి పంట ఎక్కడికైనా సరఫరా చేసుకోవచ్చనే నిబంధన నేపథ్యంలో విదేశాల నుంచి ఇబ్బడిముబ్బడిగా జీడి గింజలు పెద్దఎత్తున భారత మార్కెట్‌కు దిగుమతి అవుతున్నాయి.

02/11/2020 - 23:06

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: అంతర్జాతీయ సూచీల ప్రతికూల ధోరణుల కారణంగా దేశంలో బంగారం ధర మంగళవారం తగ్గింది. పది గ్రాముల బంగారం 245 రూపాయలు తగ్గి, 40,434 రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లో అనిశ్చితి నెలకొనడంతో, దాని ప్రభావం భారత్‌పైన కూడా పడింది. మొత్తం మీద బులియన్ టర్నోవర్ 1,425 లాట్లుగా నమోదైంది.

02/11/2020 - 05:37

ముంబయి: చైనాలో ఉద్భవించిన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య పెరగడం, అలాగే ఆర్థికపరంగా కూడా నష్టం వాటిల్లడంతో మార్కె ట్లు కకావికలమవుతున్నాయి. సోమవారం భారతీయ మార్కెట్ల లావాదేవీల తీరే ఇందుకు అద్దం పడుతోంది. తాజా వాతావరణాన్ని ప్రతిబింభిస్తూ సెనె్సక్స్ 162.23 పాయింట్లు పతనమై 40 వేల 979.62గా ముగిసింది.

02/11/2020 - 06:00

హైదరాబాద్, ఫిబ్రవరి 10: సింగరేణిలో సోమవారం నుంచి 5 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఒకవైపు బొగ్గు ఉత్పత్తి మరోవైపు సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడం దేశంలో తొలి ప్రయత్నమని సంస్థ ప్రకటించుకుంది. ఉత్పత్తి అవుతున్న సోలార్ విద్యుత్‌ను శ్రీరాంపూర్ ఏరియా 33 కేవీ లైన్‌కు అనుసంధానం చేశారు.

02/11/2020 - 01:27

వరదాయపాళెం, ఫిబ్రవరి 10: ఇసుజు మోటార్స్ ఇండియా తన రెండవ దశ కార్యక్రమాలను సోమవారం శ్రీసిటీలో ప్రారంభించింది. నూతన అత్యాధునిక ప్రెస్ షాప్ సదుపాయాన్ని కౌన్సిల్ జనరల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ జపాన్ కొజిరో యుఖియామా, ఇసుజూ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టోరు నకాటా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ, మిత్సుబిషి కార్పొరేషన్, శ్రీసిటీ సంబంధిత అధికారుల సమక్షంలో ప్రారంభించింది.

02/11/2020 - 01:25

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: గత ఆర్థిక సంవత్సరంలో అత్యంత లాభదాయకంగా నడిచిన ప్రభుత్వ రంగ సంస్థల్లో ఓఎన్‌జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఎన్‌టీపీసీలు ఉన్నాయి. వరుసగా మూడో ఏడాది కూడా బీఎస్‌ఎన్‌ఎల్, ఏయిర్ ఇండియా, ఎంటీఎన్‌లు నష్టాన్ని చవి చూశాయని సోమవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఓ సర్వే నివేదిక స్పష్టం చేస్తోంది.

02/10/2020 - 06:24

న్యూఢిల్లీ: భారత దేశంలో రిటైల్ మార్కెట్‌ను విస్తరించుకోవడంపై స్మార్ట్ ఫోన్స్ కంపెనీ వివో దృష్టి సారించింది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో అదనంగా మరో 250 స్టోర్లను తెరవాలని లక్ష్యంగా ఎంచుకుంది. మహారాష్టల్రోని థానేలో ఇటీవలే సరికొత్త స్టోర్స్‌ను తెరచింది. అదే రాష్ట్రంలో సుమారు మరో 20 ఔట్‌లెట్స్‌ను తెరవనున్నట్టు వివో ఇండియా డైరెక్టర్ నిపుణ్ మార్య ఒక ప్రకటనలో తెలిపారు.

02/10/2020 - 06:15

హైదరాబాద్, ఫిబ్రవరి 9: వాహనదారులు తమకు కావాల్సిన ఫ్యాన్సీ నెంబర్ల కోసం సోమవారం నుంచి ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో దరఖాస్తు చేసుకోవడానికి రవాణాశాఖ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక నుంచి తమకు కావాల్సిన నెంబర్‌ను బహిరంగంగా దక్కించుకోవచ్చు. ఆన్‌లైన్ బిడ్డింగ్ అమలు చేయడంతో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు ఈ ఏడాది ఫ్యాన్సీ నెంబర్లతో కనీసం రూ.

02/10/2020 - 05:34

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: దేశంలోని పది ప్రధాన కంపెనీల్లో ఎనిమిది గత వారం అద్భుతంగా పుంజుకున్నాయి. వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) అత్యధికంగా మార్కెట్ విలువను పెంచుకొని కళకళలాడింది. మొత్తం మీద ఎనిమిది కంపెనల మార్కెట్ విలువ 1,57,270.80 కోట్ల రూపాయలు పెరగడం స్టాక్ మార్కెట్లలో బుల్న్ ఏ విధంగా కొనసాగిందనడానికి అద్దం పడుతుంది. రిల్ మార్కెట్ వాల్యూ 31,981.45 కోట్ల రూపాయలు పెరగడం విశేషం.

02/10/2020 - 05:32

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: వాణిజ్య రంగంలో ద్వైపాక్షిక ఒప్పందాలపై భారత్, చిలీ దేశాలు తాజా చర్యలు మొదలు పెట్టాయి. రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య రంగాల్లో మైత్రీ సంబంధాలు మరింత పెరుగుపడడమేగాక, పరస్పర సహకారంతో అద్భుత ఫలితాలను సాధించాలన్న లక్ష్యంతో ఈ చర్చలు జరుగుతున్నాయి. 2016 మార్చి 8న ఇరు దేశాలు ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ (పీటీఏ) కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం 2008 ఆగస్టులో అమల్లోకి వచ్చింది.

Pages