S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/04/2020 - 23:37

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) ప్రతి ఏటా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గడచిన నవంబ ర్ వరకు 34.90 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం పార్లమెంటుకు తెలిపారు. గడచిన 2017-18లో 60.22 బిలియన్ డాలర్లు, 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 62 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయన్నారు.

02/04/2020 - 23:34

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కేంద్ర బడ్జెట్‌లోప్రతిష్టకుపోయి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు అంచనాలను అధికంగా చూపారని అంతర్జాతీయ అధ్యయన సంస్థ ‘మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్’ నివేదిక మంగళవారం నాడిక్కడ పేర్కొంది. వాస్తవానికి అలాంటి ఆర్థికాభివృద్థి అంచనాల వల్ల 2020-12 లో ఆర్థిక రంగం నిర్మాణాత్మక, వలయ ప్రయోజనాత్మక అంశాల్లో సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించింది.

02/04/2020 - 23:33

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఈ ఏడాది గడచిన ప్రథమార్థంలో మనదేశంలో జరిగిన నియామకాలు, ఉ ద్యోగులకు కల్పిస్తున్న జీతభత్యాలు, సదుపాయాలపై 55 శాతం యాజమాన్యాలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆరు నెలల్లో 55 శాతం ఉద్యోగ నియామకాల్లో కొత్త నియామకాలతోబాటు మరొకరి స్థానంలో నియమించుకోవడం వంటివి చోటుచేసుకున్నాయి.

02/04/2020 - 06:41

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మాం ద్యం లేదని, జీ-20 దేశాల ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే 2014-19 మధ్యకాలంలో భారత్ అత్యధిక సగటు వృద్ధిని సాధించిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు.

02/03/2020 - 23:27

ముంబయి, ఫిబ్రవరి 3: తగ్గుతున్న స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి ద్రవ్య విధానాన్ని రిజర్వు బ్యాంకు గురువారం ప్రకటించనుంది. విధాన సమీక్ష కోసం 4-6 తేదీల మధ్య ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశమవుతుంది.

02/03/2020 - 23:25

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: కొత్త బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పొందుపరచిన కొత్త ఆదాయ పన్ను రేట్ల వల్ల పన్ను రాయితీలు పొందేందుకు నిర్బంధంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండదని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలిపారు. దీనివల్ల ఆదాయ పన్ను చెల్లింపుదారుల చేతుల్లో మరింతగా నగదు మిగిలే అవకాశం ఉంటుందని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో తెలిపారు.

02/03/2020 - 23:23

ముంబయి, ఫిబ్రవరి 3: ఐసీసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్ వంటి సంస్థలు బలంగా పుంజుకున్న నేపథ్యంలో బీఎస్‌ఈ సెనె్సక్స్ సోమవారం జరిగిన లావాదేవీల్లో 137 పాయింట్లు పుంజుకుంది. మార్కెట్‌లో నెలకొన్న కొనుగోళ్ల వాతావరణం సెనె్సక్స్ కొంతమేర కోలుకోవడానికి దారితీసింది.

02/03/2020 - 07:50

న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులకు వచ్చే అంతర్జాతీయ ఆదాయాలపై పన్ను విధించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని, కేవలం భారత్ నుంచి వచ్చే ఆదాయంపైనే పన్ను విధించడం జరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. శనివారం నాటి బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రవాస భారతీయుల అంతర్జాతీయ ఆదాయ పన్ను విషయంలో నెలకొన్న అమోమయాన్ని తొలగించడానికే తానీ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆమె తెలిపారు.

02/02/2020 - 23:46

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: బీమా రంగ దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)ని స్టాక్ ఎక్చేంజీల జాబితాలోకి చేర్చే కార్యక్రమం వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో జరిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ఆదివారం నాడిక్కడ ఆయన పీటీఐకి ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు.

02/02/2020 - 23:44

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వ తగ్గించుకుంది. ఈమేరకు తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో సవరించిన ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని రూ. 11.80 లక్షల కోట్లుగా నిర్దేశించుకుంది.

Pages