S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/17/2020 - 04:54

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశంలోని ‘టాప్-10’ జాబితాలో ఉన్న ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ గత వారం సుమారు లక్ష కోట్ల రూపాయలు పెరిగింది. రిలియన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) అత్యధికంగా లాభపడింది. మార్కెట్ గణాంకాలను అనుసరించి, గత వారంలో ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ 1.09 లక్షల కోట్లు పెరిగింది.

02/17/2020 - 04:51

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ఆందోళన కలిగిస్తున్నది. వృద్ధిరేటు అంచనాల కంటే తక్కువగా నమోదుకావడం, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కూడా మందగించడం, మాంద్యం శాతం పెరగడం వంటి అంశాలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి.

02/17/2020 - 02:24

విజయవాడ పశ్చిమ, ఫిబ్రవరి 16: నగరంలో కోడిమాంసం విక్రయాలు డీలా పడ్డాయి. వేటమాంసం కోసం ఎ గబడ్డారు. కరోనా వైరస్ ప్రభావం నుం డి కోడి మాంసం విక్రయాలు ఇంకా బయట పడలేదు. కేంద్ర పశు సంరక్షణ శాఖ మంత్రి, అధికారులు కోడి మాంసం హానికారం కాదని దాన్ని తిన డం వల్ల హాని జరగదని ప్రకటించారు.

02/17/2020 - 00:54

హైదరాబాద్, ఫిబ్రవరి 16: దేశంలో 130 కోట్ల మంది ప్రజలకు కేంద్ర బడ్జెట్ ద్వారా సంక్షేమ ఫలాలు అందాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్రం పనిచేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. ఆదివారం ఇక్కడ ఆమె వివిధ పారిశ్రామిక, వాణిజ్య సంఘాల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ ఆదేశాలతో దేశంలోని పలు నగరాల్లో పర్యటించి వివిధ వర్గాలతో సమావేశమై బడ్జెట్ అంశాలను

02/16/2020 - 05:22

న్యూఢిల్లీ: బ్యాంకులు అందచేస్తున్న వ్యవసాయ రుణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమావేశంలో పాల్గొన్న తర్వాత ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో వివిధ బ్యాంకులు వ్యవసాయ రుణాలను ఏ విధంగా ఇస్తున్నాయన్న విషయంపై కేంద్ర దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పారు.

02/16/2020 - 02:42

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కుంటుపడిన వృద్ధిరేటును పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇందు కోసం అవసరమైతే 2020-2021 వార్షిక బడ్జెట్‌లో పేర్కొన్న ప్రతిపాదనలతో సంబంధం లేకుండా సరికొత్త నిర్ణయాలను తీసుకొని, అమలు చేసేందుకు వెనుకాడబోమని ప్రకటించారు.

02/16/2020 - 02:21

ముంబయి, ఫిబ్రవరి 15: ఈవారం భారత స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. ఆర్బీఐ రెపో రేట్లపై నిర్ణయం నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనల వరకూ ఎన్నో అంశాలు భారత మార్కెట్లను శాసించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి మరోసారి భారత్‌ను కూడా ప్రభావితం చేసింది.

02/16/2020 - 02:19

విజయవాడ, ఫిబ్రవరి 15: జీఎస్‌టీ విధానంలో కొత్త విధానాలు వచ్చాయని దీంతో సిబ్బందిపై బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పని చేస్తున్నారని సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఎం శ్రీహరిరావు తెలిపారు. ఆలిండియా అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ గెజిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గుంటూరు యూనిట్ జనరల్ బాడీ సమావేశం శనివారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగింది.

02/14/2020 - 05:23

ముంబయి: కరోనా వైరస్.. ఇప్పుడు ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. భయంకరమయిన ఈ కొత్త వైరస్ ఇప్పటికే చైనాలో 1,100కు పైగా మందిని పొట్టన పెట్టుకుంది. ఈ వైరస్ విజృంభణ ఇలాగే కొనసాగితే, ఆసియా-పసిఫిక్ (అపాక్) రీజియన్‌లోని ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుంది. దీని ప్రతికూల ప్రభావం బ్యాంకులపై మరింత తీవ్రంగా ఉంటుంది. బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత దెబ్బతింటాయి.

02/14/2020 - 04:35

ముంబయి, ఫిబ్రవరి 13: స్థూలార్థిక గణాంకాలు నిరుత్సాహపరచడంతో పాటు చైనాలో తాజాగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య వేగంగా పెరగడం గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇనె్వస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే గురువారం 106.11 పాయింట్లు (0.26 శాతం) పడిపోయి, 41,459.79 పాయింట్ల వద్ద ముగిసింది.

Pages