S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/11/2018 - 01:16

న్యూఢిల్లీ, జూన్ 10: దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలోని బ్యాంకుల నికర నష్టాలు 2017-18సంవత్సరంలో రూ.87,357 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నష్టాలు రూ. 12,283 కోట్లు ఉన్నాయి. 2017-18లో విజయా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు మాత్రమే లాభాలను సాధించాయి. ఇండియన్ బ్యాంకు గరిష్టంగా రూ.1258.99 కోట్లు, విజయా బ్యాంకు రూ.727.02 కోట్ల లాభాలను ఆర్జించాయి.

06/11/2018 - 01:14

న్యూఢిల్లీ, జూన్ 10: దేశంలోని మొదటి పది కంపెనీల్లో ఆరు కంపెనీల మార్కెట్ వాల్యూయేషన్‌ను గణనీయంగా పెంచుకున్నాయి. ఎప్పటిలాగానే రిలయన్స్ మార్కెట్ వాల్యూయేషన్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఆరు కంపెనీలు కలిపి రూ. 60,207.86 కోట్లను పెంచుకున్నాయి. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 34,378.16 కోట్ల నుంచి రూ. 6,23,070.31 కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్ విలువ రూ. 8627.3 కోట్ల నుంచి రూ.

06/11/2018 - 01:13

న్యూఢిల్లీ, జూన్ 10: దేశంలోని పేమెంట్ సంస్థలు ప్రతి 15 రోజులకోసారి డాటా స్టోరేజి నివేదికలను ఇవ్వాలని ఆర్‌బీఐ ఆదేశించింది. పేమెంట్ సంస్థలు డాటా స్టోరేజీపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ ఏడాది 6న ఆర్‌బీఐ అన్ని పేమెంట్ సంస్థలకు డాటాస్టోరేజీపై నివేదికలు ఇవ్వాలని కోరింది. తాజాగా ఈ నివేదికలను ప్రతి 15 రోజులకోసారి ఇవ్వాలని ఆర్‌బిఐ కోరింది.

06/11/2018 - 01:12

న్యూఢిల్లీ, జూన్ 10: వచ్చే రెండేళ్లలో స్ధూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8 శాతానికి చేరుకుంటుందని, దేశంలోవృద్ధిరేటు బాగుందని, సంస్కరణలు జోరందుకున్నాయని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) పేర్కొంది. దేశ ఆర్థిక రంగం జోష్ మీద ఉందని, గత కొనే్నళ్లుగా సంస్కరణలు వేగంపుంజుకున్నాయని, కొన్ని సర్దుబాట్లు కూడా చోటు చేసుకుంటున్నాయని సిఐఐ నివేదికలో పేర్కొంది.

06/11/2018 - 01:11

న్యూఢిల్లీ, జూన్ 10: దేశంలో అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 1325 కోట్ల మొండి బకాయిల వసూళ్లలో భాగంగా 12 నిరర్ధక ఆస్తులను ఈ నెలాఖరులోపల వేలం వేయాలని నిర్ణయించింది. జూన్ 25వ తేదీన ఇ-వేలం పద్ధతి ప్రక్రియనుప్రారంభిస్తారు. ఈవివరాలను ఎస్‌బిఐ వెల్లడించింది. అంకిత్ మెటల్ రూ.690.08 కోట్లు, మోడ్రన్ స్టీల్ రూ.

06/10/2018 - 05:24

వాషింగ్టన్: భారత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తలెత్తిన సంక్షోభాన్ని ప్రభుత్వం పరిష్కరించేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించుకోవాలని, సమీకృతాభివృద్ధిలో బ్యాంకులను భాగస్వామ్యం చేయాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అధికార ప్రతినిధి జెర్రీ రైస్ ప్రకటించారు. ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, ఆర్థిక సంక్షోభ నివారణకు భారత్ చర్యలు తీసుకుందన్నారు. నిరర్ధక ఆస్తుల విలువను (ఎన్‌పీఏ) మదింపు చేసిందన్నారు.

06/10/2018 - 00:50

న్యూఢిల్లీ, జూన్ 9: ప్రపంచ వాణిజ్య సంస్థలో జరిగే వాణిజ్య అంశాల చర్చల్లో భారతి ఎంటర్‌ప్రైజ్, ఐసిసి చైర్మ న్ సునీల్ భారతి మిటల్, ఐసీసీ కొత్త సెక్రటరీ జనరల్ జా న్ డబ్ల్యుహెచ్ డెంటన్ ఏవో, త్వరలో బాధ్యతలు చేపట్టనున్న ఐసీసీ చైర్మన్ పాల్ పాల్మాన్ పాల్గొన్నారు. ఈ కామ ర్స్, వాణిజ్యం, నిలకడతో కూడిన అభివృద్ధి, పెట్టుబడులు తదితర అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. డిజిటల్ ఎకానమీపై చర్చ జరగనుంది.

06/10/2018 - 01:06

కోల్‌కతా, జూన్ 9: ఈ ఏడాది దివాళా చట్టం పరిధి కిందకు వెళ్లి సంస్థల నుంచి రూ. 30 వేల కోట్ల మొత్తాన్ని రాబట్టుకునే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా డిఎండి పల్లవ్ మహాపాత్ర చెప్పారు. ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంకరప్సీ కోడ్ పరిధిలోకి వెళ్లిన కొన్ని సంస్థల నుంచి ఈ మొత్తం రాబట్టుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. శనివారం ఇక్కడ ఆయన సిఐఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

06/10/2018 - 01:07

కోల్‌కతా, జూన్ 9: దివాళాప్రక్రియ చట్టం పరిధి కిందకు వచ్చే కేసులకు సంబంధించి వివిధ పరిశ్రమలు, సంస్థలకు పూర్వటి వైభవం తెచ్చే విధంగా, ఆ సంస్థలు బతికే విధంగా చూడాలనేదే ఈ చట్టం ఉద్దేశ్యమని ఇన్‌సాల్వెన్సీ అండ్ బాంకరప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ ఎంఎస్ సాహూ తెలిపారు. దివాళా చట్టం కిందకు వచ్చే సంస్థలను మూసివేసే దృష్టితో చర్యలు తీసుకోరాదన్నారు. వీటిని బతికించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.

06/10/2018 - 01:08

ముంబయి, జూన్ 9: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో వారం బలపడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఈ వారంలో జరిపిన ద్రవ్య విధాన సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచినప్పటికీ, దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను యథాతథంగా కొనసాగించడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది.

Pages