S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/30/2017 - 00:23

న్యూఢిల్లీ, ఆగస్టు 29: మదుపరుల ప్రయోజనాలను కాపాడటానికే ఇన్ఫోసిస్ బోర్డు తీరుపట్ల తాను గొంతెత్తానని ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్ నారాయణ మూర్తి స్పష్టం చేశారు. దేశీయ రెండో అతిపెద్ద ఐటి రంగ సంస్థ అయిన ఇన్ఫోసిస్‌లో వ్యవస్థాపకులకు, బోర్డుకు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొన్నది తెలిసిందే.

08/30/2017 - 00:22

హైదరాబాద్, ఆగస్టు 29: ఆస్ట్రేలియా మైనింగ్ అధికారులతో టిఎస్ ఎండిసి చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి సమావేశం అయ్యారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వెల్స్‌లో మైనింగ్ 2017 రిసోర్స్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సుభాష్‌రెడ్డి అక్కడి మైనింగ్ అధికారులతో సమావేశం అయ్యారు. ఆస్ట్రేలియా మైనింగ్ విధానాలు, తవ్వకాల్లో అవలంభిస్తున్న ఆధునిక పరిజ్ఞానం గురించి అడిగి తెలుసుకున్నారు.

08/30/2017 - 00:20

హైదరాబాద్, ఆగస్టు 29: జిల్లాల్లో నిర్మించిన కోల్డ్ స్టోరేజీల పరిశీలనకు ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. సంబంధిత జిల్లా జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో మార్కెటింగ్, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లాల్లో ఉండే కోల్డ్ స్టోరేజీలను ఈ కమిటీ తరచూ తనిఖీ చేయాల్సి ఉంటుంది.

08/30/2017 - 00:19

హైదరాబాద్, ఆగస్టు 29: రాష్ట్రంలో రైతుల నుండి పెసలు కొనుగోలుకు టిఎస్ మార్క్‌ఫెడ్‌ను (తెలంగాణ స్టేట్ మార్కెట్ ఫెడరేషన్) నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది. రైతులకు ధరల చేయూత పథకం (ప్రైస్ సపోర్ట్ స్కీం) క్రింద ఈ బాధ్యతలను అప్పగించారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2017-18)కిగాను ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) రైతులకు లభించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

08/30/2017 - 00:19

హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణ ఐటి రంగం దేశంలో అగ్రగామిగా దూసుకుపోతోందని, ఐటి రంగం తన కార్యకలాపాలను విస్తరిస్తోందని, రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన నూతన ఐటి విధానం, ప్రోత్సాహకాలకు అనేక బహుళ జాతి కంపెనీలు ముందుకు వస్తున్నాయని రాష్ట్ర ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. మంగళవారం ఇక్కడ హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజస్ అసోసియేషన్ (హైసీ) వార్షిక సదస్సు జరిగింది.

08/30/2017 - 00:18

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ప్రభుత్వ రంగ విద్యుదుత్పాదక దిగ్గజం ఎన్‌టిపిసిలో ప్రభుత్వ వాటా విక్రయానికి సంస్థాగత మదుపరుల నుంచి మంగళవారం విశేష స్పందన లభించింది. ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) ద్వారా ఎన్‌టిపిసిలో 5 శాతం వాటాను కేంద్రం అమ్మేస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే 32.98 కోట్ల షేర్లకుగాను 46.35 కోట్ల షేర్లకు సంస్థాగత మదుపరుల నుంచి బిడ్లు దాఖలయ్యాయి. దీంతో 1.41 రెట్లు అధికంగా బిడ్లు వచ్చినట్లైంది.

08/30/2017 - 00:18

ముంబయి, ఆగస్టు 29: స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడానికి వీలుగా వచ్చే ఏడాది మార్చికల్లా 500 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ సలహాదారు జెఎ చౌధరి మంగళవారం ఇక్కడ తెలిపారు. ఈ నిధికి 100 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం, మిగతా 400 కోట్ల రూపాయలను ఎస్‌ఐడిబిఐ వంటి పలు సంస్థల నుంచి సేకరిస్తామన్నారు.

08/30/2017 - 00:17

న్యూఢిల్లీ, ఆగస్టు 29: వొడాఫోన్ డీల్ వ్యవహారంలో హాంకాంగ్‌కు చెందిన హచిసన్ నుంచి ఆదాయ పన్ను శాఖ 32,320 కోట్ల రూపాయలను కోరుతోంది. బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌కు భారత్‌లోని తమ మొబైల్ వ్యాపారాన్ని హచిసన్ 2007లో 11 బిలియన్ డాలర్లకు అమ్మినది తెలిసిందే. అయితే దీనికి సంబంధించి పన్ను చెల్లింపులు జరగలేదన్న ఆదాయ పన్ను శాఖ.. వడ్డీ, జరిమానా కలుపుకుని మొత్తం 32,320 కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తోంది.

08/30/2017 - 00:16

న్యూఢిల్లీ, ఆగస్టు 29: వెయ్యి రూపాయల నోట్లను తిరిగి చలామణిలోకి తెచ్చే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 200 రూపాయల నోట్లను పరిచయం చేసిన నేపథ్యంలో వెయ్యి రూపాయల నోట్లూ మళ్లీ రానున్నాయన్న వార్తలు సోమవారం వచ్చాయి. అయితే దీనిపై మంగళవారం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ అలాంటిదేమీ లేదని ప్రకటించారు.

08/30/2017 - 00:16

హైదరాబాద్, ఆగస్టు 29: రైతులు అధిక దిగుబడి కోసం ‘షేడ్‌నెట్ హౌస్’లను ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యాన కమిషనర్ ఎల్ వెంకట్రామి రెడ్డి తెలిపారు.

Pages